PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp415e3b89-6b73-4301-9c37-5077bf4d8650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp415e3b89-6b73-4301-9c37-5077bf4d8650-415x250-IndiaHerald.jpgటీడీపీని యువ‌త‌కు చేరువ చేయాలి.. వ‌చ్చే రోజుల్లో యువత‌కు ప్రాధాన్యం పెంచాలి. ఇదీ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం. అయితే.. ఇప్పుడున్న వారిలో అంద‌రూ సీనియ‌ర్లుగా చెప్పుకొనే నాయ‌కులే త‌ప్ప‌.. పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కులు లేకుండా పోయారు. అయితే.. ఇటీవ‌ల‌.. పార్టీలో అధునాత‌నంగా తీసుకువ‌చ్చిన‌.. ఐటీడీపీ విభాగానికి కొన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు పార్టీని సిద్ధం చేయాల‌ని.. పైనుంచి ఆదేశాలు అందాయ‌ట‌. దీంతో సోష‌ల్ మీడియాలో యువ‌త‌ను ఆక‌ర్షించ‌డ‌మే క‌దా! అనుకున్నారు అంద‌రూ. TDP{#}Research and Analysis Wing;Telugu;YCP;Telugu Desam Party;Partyటీడీపీలో స్లోగ‌న్ల గోల‌.. ఏం జ‌రిగిందంటే...!టీడీపీలో స్లోగ‌న్ల గోల‌.. ఏం జ‌రిగిందంటే...!TDP{#}Research and Analysis Wing;Telugu;YCP;Telugu Desam Party;PartyWed, 10 Nov 2021 16:43:08 GMTటీడీపీని యువ‌త‌కు చేరువ చేయాలి.. వ‌చ్చే రోజుల్లో యువత‌కు ప్రాధాన్యం పెంచాలి. ఇదీ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం. అయితే.. ఇప్పుడున్న వారిలో అంద‌రూ సీనియ‌ర్లుగా చెప్పుకొనే నాయ‌కులే త‌ప్ప‌.. పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కులు లేకుండా పోయారు. అయితే.. ఇటీవ‌ల‌.. పార్టీలో అధునాత‌నంగా తీసుకువ‌చ్చిన‌.. ఐటీడీపీ విభాగానికి కొన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు పార్టీని సిద్ధం చేయాల‌ని.. పైనుంచి ఆదేశాలు అందాయ‌ట‌. దీంతో సోష‌ల్ మీడియాలో యువ‌త‌ను ఆక‌ర్షించ‌డ‌మే క‌దా! అనుకున్నారు అంద‌రూ.

కానీ.. దాంతో పాటు.. పార్టీకి నూత‌నంగా.. స్లోగ‌న్లు సిద్ధం చేయాల‌ని కూడా ఆదేశించ‌డంతో ఇప్పుడు నాయ‌కుల రాజ‌కీయం అంతా కూడా .. స్లోగ‌న్ల చుట్టూ తిరుగుతోంది. టీడీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు.. పాత స్లోగ‌న్లే ఉన్నాయి. అయితే.. చంద్ర‌బాబు.. లేక‌పోతే.. చంద్ర‌న్.. ఇవీ కాక‌పోతే.. తెలుగు దేశం పిలుస్తోంది.. రా క‌ద‌లిరా!  లేక‌పోతే.. అన్న‌గారు.. పేరుతో ఉన్న‌.. జై ఎన్టీఆర్‌.. జై జై ఎన్టీఆర్‌.. తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వం.. ఇలా.. కొన్ని ప‌డిగ‌ట్టు నినాదాలు ఉన్నాయి. వీటినే ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. నాయ‌కులు వినిపిస్తున్నారు. వీటినే పాట‌ల రూపంలోనూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో వీటిని వినీ వినీ బోరు కొట్టిన ప్ర‌జ‌లు.. రికార్డు మార్చండ‌ర్రా! అనేస్తున్నారు.

పైగా.. వైసీపీ నినాదాలు చూస్తే.. చాలా కొత్త‌గా ఉంటున్నాయి. బైబై బాబు, అన్న మాటిస్తే.. మాస్‌, మాటిచ్చాడంటే.. చేస్తాడంతే! జ‌గ‌న‌న్న న‌వ‌ర‌త్నాలు.. మాట త‌ప్పం.. మ‌డ‌మ తిప్పం!  ఇలా.. అనేక కొత్త కొత్త స్లోగ‌న్లు ఈ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కానీ, ఈ త‌ర‌హా కొత్తనినాదాలు టీడీపీకి లేకుండా పోయాయి. ఎంత‌సేపూ.. త‌మ‌ను తాము పొడుగు కోవ‌డ‌మేనా? అనే చ‌ర్చ కొన్నాళ్లుత‌గా జ‌రుగుతోంది. పైగా.. అవి ప్ర‌జ‌ల్లో నానినాని ఉండ‌డంతో వారు కొత్త‌వి కోరుకుంటున్నారు. దీంతో ప్ర‌జ‌లకు బాగా చేరువ అయ్యేవి.. ప్ర‌జ‌లు ఇవి బాగున్నాయ్‌! అనేవి.. ముఖ్యంగా యువ‌త‌లో కిక్కు రేపే స్లోగ‌న్లు రూపొందించాలంటూ.. పై నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని.. చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే.. ఈ విష‌యంలో ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌న్న‌ది.. ఐటీడీపీ వాద‌న‌. ఏదేమైనా.. ఇప్పుడు అంత‌ర్గ‌తంగా.. ఎవ‌రు పార్టీ కార్యాల‌యానికివెళ్లినా.. కొత్త‌గా ఆలోచించండి సార్‌! అనేస్తున్నార‌ట‌. సో.. ఇదీ ఇప్పుడు టీడీపీలో స్లోగ‌న్ల  గోల‌. మ‌రి ఇదంతా చ‌దివిన త‌ర్వాత‌.. మీకేదైనా స్లోగ‌న్ వ‌స్తే.. వెంట‌నే ఐటీడీపీ వారికి చెప్ప‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు!!

 



కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ.. వైరల్ అవుతున్న వీడియో..?

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!

ఆప్ఘనిస్థాన్లో అజ్ఞాతంలో మహిళలు.. ఆ మాట నిజమేనా?

కేసీఆర్ : ఆహా! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చింద్రా ధర్నా చౌక్!

యూపీలో జికా వైర‌స్ కలకలం..!

నెల్లూరులో జలకన్య.. అసలు విషయం ఏంటంటే?

తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..ఛాన్స్ ఎవరికీ..?

సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. !

నిఘా నీడలో తిరుపతి... హై అలర్ట్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>