PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-modicabinate02e2564d-a0ca-4493-b050-20af1955f8e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-modicabinate02e2564d-a0ca-4493-b050-20af1955f8e9-415x250-IndiaHerald.jpgదీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ధరలను మరింత తగ్గించేందుకు వీలుగా ఇకపై ఇథనాల్ వినియోగం పెంచుతామంటున్నారు నీతి ఆయోగ్ సభ్యులు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరను కూడా కేంద్రం పెంచేసింది. లీటరు ఇథనాల్‌పై రూపాయి 47 పైసలు చొప్పువ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలోకి ముడి చమురు దిగుమతిని కొంత మేర తగ్గించుకోవచనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. చెరకు వ్యర్థాల నుంచి ఇథనాల్ ఉత్పత్ethanol{#}NITI Aayog;Diesel;Sugar;Petrol;central governmentఇథనాల్ రేటు పెంచిన కేంద్రం...!ఇథనాల్ రేటు పెంచిన కేంద్రం...!ethanol{#}NITI Aayog;Diesel;Sugar;Petrol;central governmentWed, 10 Nov 2021 17:18:21 GMTపెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ధరలను మరింత తగ్గించేందుకు వీలుగా ఇకపై ఇథనాల్ వినియోగం పెంచుతామంటున్నారు నీతి ఆయోగ్ సభ్యులు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరను కూడా కేంద్రం పెంచేసింది. లీటరు ఇథనాల్‌పై రూపాయి 47 పైసలు చొప్పువ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలోకి ముడి చమురు దిగుమతిని కొంత మేర తగ్గించుకోవచనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. చెరకు వ్యర్థాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పెట్రోల్‌లో కలిపేందుకు వీలుగానే ఇథనాల్ ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన ధరలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే మార్కెటింగ్ ఏడాది నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముడి చమురు దిగుమతిని తగ్గించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా విదేశీ మారక ద్రవ్యం భారీగా మిగులుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్ చేయాలని తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చేసింది. 2025 నాటికి పెట్రోల్‌లోకి సుమారు 20 శాతం ఇథనాల్ డోపింగ్ సాధించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకే 2021-22 మార్కెటింగ్ ఇయర్‌లో చెరకు నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్ సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్‌లో కలిపేందుకు సేకరించిన ఇథనాల్ ధరను రూపాయి 47 పైసలు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల ముడి చమురు దిగుమతి గణనీయంగా తగ్గుతుంది. ఇదే సమయంలో చెరకు రైతులతో పాటు షుగర్ ఫ్యాక్టరీలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. చెరకు పంట సాగు పెరుగుతుందని కూడా కేంద్రం భావిస్తోంది. ఇథనాల్ ధరను లీటరుకు 62 రూపాయల 65 పైసల నుంచి 63 రూపాయల 45 పైసలకు పెంచింది కేంద్రం. మొలాసిస్ నుంచి సేకరించే ఇథనాల్ ధరను లీటరుకు రూపాయి పెంచింది. వచ్చే నెల నుంచి చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచిన ధరలకు అనుగుణంగా ఇథనాల్‌ను కొనుగోలు చేస్తాయి.






రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!

ఆప్ఘనిస్థాన్లో అజ్ఞాతంలో మహిళలు.. ఆ మాట నిజమేనా?

కేసీఆర్ : ఆహా! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చింద్రా ధర్నా చౌక్!

యూపీలో జికా వైర‌స్ కలకలం..!

నెల్లూరులో జలకన్య.. అసలు విషయం ఏంటంటే?

తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..ఛాన్స్ ఎవరికీ..?

సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>