PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpc6da5989-d2ba-47f4-8db4-fa575259cb0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpc6da5989-d2ba-47f4-8db4-fa575259cb0c-415x250-IndiaHerald.jpgరెండు సభలు ఎందుకున్నాయి అంటే ఒక సభ వేడివేడిగా నిర్ణయాలు తీసుకుంటే రెండవ సభ చల్లార్చడానికి. దేశంలో పెద్దల సభకు ఎంతో విశిష్టత ఉంది. అక్కడ ఉండేవారు అంతా పెద్ద మనుషులు. మేధావులు, చదువరులు, విద్యావేత్తలు, కళా స్రష్టలు. వివిధ రంగాల్లో నిష్ణాతులు. ycp{#}TDPపెద్ద మనుషులు వెయిటింగ్ అక్కడ... ?పెద్ద మనుషులు వెయిటింగ్ అక్కడ... ?ycp{#}TDPWed, 10 Nov 2021 19:44:49 GMTరెండు సభలు ఎందుకున్నాయి అంటే ఒక సభ వేడివేడిగా నిర్ణయాలు తీసుకుంటే రెండవ సభ చల్లార్చడానికి. దేశంలో పెద్దల సభకు ఎంతో విశిష్టత ఉంది. అక్కడ ఉండేవారు అంతా పెద్ద మనుషులు. మేధావులు, చదువరులు, విద్యావేత్తలు, కళా స్రష్టలు. వివిధ రంగాల్లో నిష్ణాతులు.

అటువంటి పెద్దల సభలో తామూ చేరాలని, పెద్ద మనుషులు అనిపించుకోవాలని వైసీపీలో ఆశావహులు పెద్ద ఎత్తున  వెయిట్ చేస్తున్నారు. చాలా కాలంగా చూసుకుంటే పెద్దల సభలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయి. అది ఏ ఒక్కరి వల్లనో కాదు, అందరూ అలాగే చేస్తున్నారు. ఇపుడు ఏపీలో ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడ్డాయి. ఏకంగా పద్నాలుగు సీట్లకు  ఒకేసారి భర్తీ చేయనున్నారు. దాని కోసం పదుల సంఖ్యలో వెయిటింగ్ చేస్తున్నారు.

జగనన్న నిర్ణయం తీసుకుంటే తమకు ఎమ్మెల్సీ దక్కుతుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఉన్నవి పద్నాలుగు అయితే దానికి నాలుగు రెట్లు ఆశ పెట్టుకున్న వారున్నారు. వీరంతా చాలాకాలంగా వైసీపీలో అంకితభావంతో కొనసాగుతున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ కావాలని అనుకుంటున్నారు. నిజానికి తనను మరోసారి పెద్దల సభకు రెన్యువల్ చేయలేదనే చంద్రబాబు నుంచి టీడీపీ నుంచి వేరుపడి ఆయన వైసీపీలో చేరారు. ఇక ఆయన ఒకసారి మళ్ళీ వైసీపీని తిట్టి వెనక్కు వెళ్లారు. 2019 ఎన్నికల్లో మళ్లీ వచ్చారు. ఇలా ఊగిసలాడడం వల్లనే ఆయన పేరు పరిశీలనలో ఉందా లేదా అన్న టెన్షన్ అయితే అనుచరుల్లో ఉంది.


మరో వైపు చూస్తే వైసీపీకి తన సర్వస్వం ధారపోసి జగన్ని నమ్ముకున్న నేత విశాఖ సిటీ వైసీపీ అధ్యక్షుడు  వంశీక్రిష్ణ శ్రీనివాస్. అయితే ఆయనకు రాజకీయ బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తూర్పు ఎమ్మెల్యే టికెట్ నాడు దక్కితే ఆ ఊపులో ఆయనే ఎమ్మెల్యే అయ్యేవారు. అది చేజారింది. ఇక విశాఖ మేయర్ హామీ ఇచ్చి అది కూడా తీర్చలేదు. ఇపుడు ఎమ్మెల్సీ సీటు అందేవరకూ ఆయనది పోరాటమే. మరో వైపు చూస్తే విశాఖ జిల్లాలో  వరుడు కళ్యాణి అని మహిళా నాయకురాలు పేరు కూడా వినిపిస్తోంది.

అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఏ పదవీ లేకుండా ఉన్న మైనారిటీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ ఈసారి అయినా చాన్స్ ఉంటుందా అని చూస్తున్నారు. అదే వరసలో మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతలా వెయిట్ చేస్తున్నా విశాఖ జిల్లాలో స్థానిక కోటాలో  ఉన్నవి కేవలం రెండే రెండు పోస్టులు దాంతో వీరిలో మండలిలో అడుగుపెట్టే పెద్ద మనుషులు ఎవరో చూడాలి. పెద్దల సభలో ఎవరికి ఎంట్రీ ఉంటుంది అన్నది జగనే నిర్ణయిస్తారు. అంత వరకూ ఎదురు చూడడమే.





మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా : మహేశ్ బాబు

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>