PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ika-eppud-u-cahndramamnake-jakilaf7f6f4d0-a533-43d2-9053-36f9e8e2ff48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ika-eppud-u-cahndramamnake-jakilaf7f6f4d0-a533-43d2-9053-36f9e8e2ff48-415x250-IndiaHerald.jpgకుప్పం మున్సిప‌ల్‌ ఎన్నికల్లో జ‌రుగుతున్న‌ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డిజిపి గౌతం సవాంగ్ లకు ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయి అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అధికార వైసీపీ పార్టీతో అధికారులు కుమ్మక్కై టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా అడ్డుకుంటున్నారు అని చంద్ర‌బాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. స్థానిక ఎన్నికల అధికారులు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరchandrababu naidu{#}Gautam Adani;CBN;Nani;Elections;Arrest;local language;Tirupati;police;TDP;YCP;Novemberఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌chandrababu naidu{#}Gautam Adani;CBN;Nani;Elections;Arrest;local language;Tirupati;police;TDP;YCP;NovemberWed, 10 Nov 2021 13:16:28 GMTకుప్పం మున్సిప‌ల్‌ ఎన్నికల్లో జ‌రుగుతున్న‌ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డిజిపి గౌతం సవాంగ్ లకు ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.    ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయి అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అధికార వైసీపీ పార్టీతో అధికారులు కుమ్మక్కై టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా అడ్డుకుంటున్నారు అని చంద్ర‌బాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. స్థానిక ఎన్నికల అధికారులు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారు అని మండిప‌డ్డారు చంద్ర‌బాబు.


 నకిలీ సంతకాలతో నామినేషన్లను తొలగించార‌ని, అధికార వైసీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారు అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులతో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 9 నవంబర్ 2021 అర్ధరాత్రి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అమరనాథ్ రెడ్డితో సహా తిరుపతి పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జి పుల్లివర్తి నాని లను అరెస్ట్ చేశారు అని తెలిపారు. నవంబర్ 8, 2021న తప్పుడు కేసు నమోదు చేసి 9వ తేదిన అర్థరాత్రి అరెస్టు చేశారు అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.


 పోలీసులకు అందుబాటులో ఉండగా అర్ధరాత్రి అరెస్టు చేశార‌ని, అంత అవసరం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు నాయుడు. ఇది టీడీపీ నేతలను ఎన్నికల్లో ప్రచారం చేయనీయ‌కుండా అడ్డుకునేందుకు అధికార వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రయత్నం తప్పా మరొకటి కాదు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌స్తుతం జరుగుతున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి అని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ ప‌రిస్థితులు బ్రిటీష్ రాజ్, నియంతృత్వ అధికారాన్ని గుర్తుకు తెస్తున్నాయి అని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్ప‌క్షపాతంగా జరిగేలా ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చంద్ర‌బాబు నాయుడు.



2024లో ఏపీ ముఖ్య‌మంత్రి కాపు వ్య‌క్తే : చింతా మోహన్

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>