PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish6cde974f-4ccf-4438-b8f0-0d442542f6a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish6cde974f-4ccf-4438-b8f0-0d442542f6a8-415x250-IndiaHerald.jpgసిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గం వెలమ సామాజిక వ‌ర్గానికి పెట్ట‌ని కోట‌గా ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ నిల‌బ‌డేవారు ఇప్పుడు హ‌రీష్‌రావును నిల‌బెడుతున్నారు. ఈ ఇద్ద‌రు నాయ‌క‌లుగా ప‌నిచేయ‌డంతో ఆ సామాజిక వ‌ర్గం బ‌లం పెరిగిపోయింది. అయితే, అక్క‌డ బీసీల‌తో పాటు రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా బాగానే ఉన్నా.. ఇన్నేళ్లుగా కేసీఆర్, హ‌రీష్ రావు ఉన్న కార‌ణంగా ఇత‌రులు ఎదిగే అవ‌కాశం లేకుండా పోయింది. రాజ‌కీయాల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా ఎవ‌రూ నిల‌దొక్కునే వాళ్లు కూడా కాద‌నే మాట‌లు వినిపిస్తాయి. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్harish rao-bjp{#}KCR;Telangana Rashtra Samithi TRS;Velama;Congress;Reddy;Inti Guttuహ‌రీష్‌రావుకు పోటీగా బీజేపీ కొత్త లీడ‌ర్‌..?హ‌రీష్‌రావుకు పోటీగా బీజేపీ కొత్త లీడ‌ర్‌..?harish rao-bjp{#}KCR;Telangana Rashtra Samithi TRS;Velama;Congress;Reddy;Inti GuttuWed, 10 Nov 2021 09:07:57 GMTసిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గం వెలమ సామాజిక వ‌ర్గానికి పెట్ట‌ని కోట‌గా ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ నిల‌బ‌డేవారు ఇప్పుడు హ‌రీష్‌రావును నిల‌బెడుతున్నారు. ఈ ఇద్ద‌రు నాయ‌క‌లుగా ప‌నిచేయ‌డంతో ఆ సామాజిక వ‌ర్గం బ‌లం పెరిగిపోయింది. అయితే, అక్క‌డ బీసీల‌తో పాటు రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా బాగానే ఉన్నా.. ఇన్నేళ్లుగా కేసీఆర్, హ‌రీష్ రావు ఉన్న కార‌ణంగా ఇత‌రులు ఎదిగే అవ‌కాశం లేకుండా పోయింది. రాజ‌కీయాల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా ఎవ‌రూ నిల‌దొక్కునే వాళ్లు కూడా కాద‌నే మాట‌లు వినిపిస్తాయి. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే రాయితీలు, స‌బ్సీడీలు, కాంట్రాక్టులు అన్ని కూడా త‌మ అనుకూల‌వ‌ర్గానికి వ‌చ్చేలా చూశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


  ఈ క్ర‌మంలో 40 ఏళ్లుగా ఇదే తంతు చూస్తున్న ఇత‌ర సామాజిక వ‌ర్గాలు కొత్త నాయ‌క‌త్వం కోసం ఎదురు చూసే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో టీఆర్ఎస్‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌ను అడ్డు పెట్టుకుని హ‌రీష్ రావుకు వ్య‌తిరేకంగా నిల‌బ‌డి అక్క‌డ విజ‌యం సాధిస్తే ఏనుగు కుంబ‌స్థ‌లాన్ని కొట్టిన‌ట్టేన‌ని భావించి ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీంతో అక్క‌డ ఓటింగ్‌ కీలకంగా ఉన్న బీసీల నుంచి కీల‌క నాయ‌కుడిని తీసుకువ‌స్తే అత్యంత బ‌లంగా మారిన వెలమ‌సామాజిక వర్గాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం ఖాయం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


  దీంతో హైద‌రాబాద్‌లోని రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త‌ను రంగంలోకి దింపాల‌ని చూస్తోంది బీజేపీ. అందులో సిద్దిపేట‌కు చెందిన వారు ఉండాల‌ని చూడ‌డంతో ముగ్గురు ఉన్న‌ట్టు తెలిసింద‌ని అందులో ఒక‌రి పేరు దాదాపు ఖాయం అయింద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌గానే పాచిక‌లు వేస్తున్నార‌ని అంద‌రు భావిస్తున్నారు. ఇంటి గుట్టు తెలిసిన ఈట‌ల టీఆర్ఎస్ బ‌ల‌హీన‌త‌లను క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో రాబోయే రెండేళ్లలో మ‌రిన్ని వ్యూహాలు ప‌న్ని అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది బీజేపీ. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ కూడా ముందుకు ఎలా వెళ్తుందో అన్న ఆస‌క్తి కూడా మొద‌ల‌యింది.



కారుణ్య నియామకాలు 30లోగా పూర్తి

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>