Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/padmaca6a5036-067b-49cd-8a7d-0a76b9de31f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/padmaca6a5036-067b-49cd-8a7d-0a76b9de31f6-415x250-IndiaHerald.jpgఇటీవలే రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినీ రాజకీయ క్రీడా రంగాలలో కొనసాగుతున్న ఎంతోమంది కూడా ఈ అవార్డు ప్రదానోత్సవంలో పద్మ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. అయితే కేవలం వివిధ రంగాల్లో కొనసాగుతున్న ప్రముఖులు మాత్రమే కాదు అటు ఎంతోమందికి సేవచేస్తూ గొప్ప వ్యక్తిత్వాన్ని చదువుకున్న సామాన్య ప్రజలకు సైతం పద్మఅవార్డులను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.ఈ క్రమంలోనే ఎంతో మంది ముఖ్య అతిథులు నడుమ ఈ పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాPadma{#}Padma Shri;central governmentవైరల్ : రాష్ట్రపతిని ఆశీర్వదించిన ట్రాన్స్జెండర్?వైరల్ : రాష్ట్రపతిని ఆశీర్వదించిన ట్రాన్స్జెండర్?Padma{#}Padma Shri;central governmentWed, 10 Nov 2021 12:00:00 GMTఇటీవలే రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినీ రాజకీయ క్రీడా రంగాలలో కొనసాగుతున్న ఎంతోమంది కూడా ఈ అవార్డు ప్రదానోత్సవంలో పద్మ అవార్డు  దక్కించుకోవడం గమనార్హం. అయితే కేవలం వివిధ రంగాల్లో కొనసాగుతున్న  ప్రముఖులు మాత్రమే కాదు అటు ఎంతోమందికి సేవచేస్తూ గొప్ప వ్యక్తిత్వాన్ని చదువుకున్న సామాన్య ప్రజలకు సైతం పద్మఅవార్డులను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.ఈ క్రమంలోనే ఎంతో మంది ముఖ్య అతిథులు నడుమ ఈ పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి అందరికీ ఈ పద్మ అవార్డులను ఇచ్చి సత్కరించారు.


 అయితే రాష్ట్రపతి భవన్ లో ఇక ఇటీవల జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఒక సరదా సన్నివేశం ఎంతో మంది మనసు దోచేసింది. సాధారణంగా పద్మ అవార్డులను అందుకోవడానికి వెళ్లిన వ్యక్తులు రాష్ట్రపతికి ఎంతో గౌరవంగా నమస్కారం చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డును స్వీకరిస్తు ఉంటారు. అయితే ఇటీవలే పద్మ అవార్డును దక్కించుకున్న ఒక ట్రాన్స్జెండర్ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి తనదైన శైలిలో దిష్టి తీసింది. ఈ క్రమంలోనే ఇక ట్రాన్స్జెండర్ అలా చేయడం మాత్రం అక్కడున్న వారికి మనసు దోచేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇటీవలే పద్మ అవార్డుల్లో భాగంగా దేశ చరిత్రలోనే మొదటిసారి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది ఒక ట్రాన్స్ జెండర్.



 ఇటీవలే 2021 సంవత్సరానికి గాను మొత్తం 119 మంది కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించింది.  అయితే ఇలా పద్మ అవార్డులను సొంతం చేసుకున్న వారిలో ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉండటం విశేషం. ట్రాన్స్ జెండర్ మాతా బి మంజమ్మ జోగతి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. డాన్సర్ ఫోక్ సింగర్ అయిన మంజమ్మ కర్ణాటక జానపద అకాడమీ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునేందుకువెళ్లిన మంజమ్మ చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టితీసి ఇక తనదైన శైలిలో వ్యవహరించారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ జెండర్ ఇలా చేయడం అందరి మనసులను దోచేసింది. దీంతో అక్కడి సభావేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది.
">



వైసీపీని టెన్ష‌న్ పెడుతోన్న జ‌న‌సేన‌...!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>