PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp954eb035-d5bb-4638-b662-dd5fa267af55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp954eb035-d5bb-4638-b662-dd5fa267af55-415x250-IndiaHerald.jpgఏమ‌యినా అంటే కోపం ఏమ‌యినా అంటే ద్వేషం ఏమ‌యినా అంటే ప‌గ లేదా ప్ర‌తీకారం ఇవే క‌దా రాజ‌కీయ నాయ‌కుల‌ను న‌డిపిస్తాయి. అవే రేప‌టి స‌మ‌యాన ఓడిస్తాయి కూడా! గుర్తు పెట్టుకోండి. వైసీపీ స‌ర్కారు కానీ టీడీపీ స‌ర్కారు కానీ ఆ కార్యాల‌యానికి చేసిందేం లేదు. సుదీర్ఘ చ‌రిత్ర‌కు చెద‌లు ప‌ట్టించ‌డం త‌ప్ప వీళ్లేం చేసిందీ లేదు మార్చిందీ లేదు. ఓ త‌హ‌శీల్దార్ కార్యాల‌యాన్ని బాగు చేసే దిక్కే లేన‌ప్పుడు అది అడిగే వారిపై కోపాలు ఎందుకు వ‌స్తాయి. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఇన్నేళ్ల‌యినా కూడా ఓ కార్యాల‌యాన్ని బాగు చేసేందుకycp{#}YCP;District;TDPఆత్మ‌కూరు ఆత్మ‌క్షోభిస్తుంది రా!ఆత్మ‌కూరు ఆత్మ‌క్షోభిస్తుంది రా!ycp{#}YCP;District;TDPTue, 09 Nov 2021 20:28:24 GMT- దీనావ‌స్థ‌లో త‌హ‌శీల్దారు కార్యాల‌యం
ప‌ట్టించుకోని వైనం
- టార్పాన్లు క‌ప్పుకుని శిథిలావ‌స్థ‌లో న‌డుస్తున్నా
- నిధులివ్వ‌ని ప్ర‌భుత్వం
- సుదీర్ఘ చ‌రిత్ర‌కు చెద‌లు

ఏమ‌యినా అంటే కోపం ఏమ‌యినా అంటే ద్వేషం ఏమ‌యినా అంటే ప‌గ లేదా ప్ర‌తీకారం ఇవే క‌దా రాజ‌కీయ నాయ‌కుల‌ను న‌డిపిస్తాయి. అవే రేప‌టి స‌మ‌యాన ఓడిస్తాయి కూడా! గుర్తు పెట్టుకోండి. వైసీపీ స‌ర్కారు కానీ టీడీపీ స‌ర్కారు కానీ ఆ కార్యాల‌యానికి చేసిందేం లేదు. సుదీర్ఘ చ‌రిత్ర‌కు చెద‌లు ప‌ట్టించ‌డం త‌ప్ప వీళ్లేం చేసిందీ లేదు మార్చిందీ లేదు. ఓ త‌హ‌శీల్దార్ కార్యాల‌యాన్ని బాగు చేసే దిక్కే లేన‌ప్పుడు అది అడిగే వారిపై కోపాలు ఎందుకు వ‌స్తాయి. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఇన్నేళ్ల‌యినా కూడా ఓ కార్యాల‌యాన్ని బాగు చేసేందుకు మ‌న ద‌గ్గర అందుకు త‌గ్గ నిధులు లేక‌పోవ‌డం అన్న‌దే విచార‌క‌రం. ఇలాంటి కార్యాల‌యాల్లో సుప‌రిపాల‌న స‌మ‌య పాల‌న ఎలా సాధ్యం? ఒక త‌హ‌శీల్దార్ కార్యాల‌యమే ఇంత‌టి దుఃస్థితిలో ఉంటే మ‌రి! మిగ‌తా వ్య‌వ‌స్థ‌ల‌ను అనుసంధానిస్తూ ఇక్క‌డి వారు ఎలా ప‌నిచేయ‌గ‌ల‌రు?

క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరు మండ‌ల కార్యాల‌యానికి సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. బ్రిటీషు కాలంలో నిర్మించిన ఈ కార్యాల‌యం అప్ప‌టి నుంచి అదే స్థానంలో అంతే స్థాయిలో సేవ‌లందిస్తోంది. జిల్లాకు చెందిన ఎంద‌రో నాయ‌కులు, ఎన్నో పార్టీలు మారుతూ వ‌స్తున్నా కూడా ఇక్క‌డి కార్యాల‌యం అవ‌స్థ‌లు అలానే ఉన్నాయి. వ‌ర్షం ప‌డితే కారిపోతుంది. శిథిలావ‌స్థ‌లో చేరుకున్న కార్యాల‌యం క‌నీసం మ‌ర‌మ్మ‌తులకు కూడా నోచుకోవ‌డం లేదు. ఇదేమ‌ని అడిగితే చూద్దాం చేద్దాం అన్న కాల‌క్షేపం క‌బుర్లే త‌ప్ప నాయ‌కులు చేస్తున్న‌ది ఏమీ లేదు. గ‌త ప్ర‌భుత్వంలో కానీ ఇప్ప‌టి ప్ర‌భుత్వంలో కానీ కార్యాల‌య అభివృద్ధికి క‌నీస నిధులు మంజూరు చేసిన దాఖ‌లాలే లేవు.  ఇప్ప‌టికైనా కార్యాల‌య మ‌ర‌మ్మ‌తుల‌పై దృష్టి సారించాల‌ని కోరుతున్నారు ఇక్క‌డి అధికార యంత్రాంగం.





తాలిబన్ లకు.. దాసోహం అంటున్న ఇమ్రాన్..!

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>