TechnologyVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-phone-next-d3232cbe-4692-43ff-9268-9310c590bed3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-phone-next-d3232cbe-4692-43ff-9268-9310c590bed3-415x250-IndiaHerald.jpgజియో అనగానే సామాన్యుల బ్రాండ్ అన్పిస్తుంది. పేదల నుంచి సామాన్యుల వరకు జియోకు సంబంధించిన మొబైల్స్, సాంకేతిక అంశాలపై ఓ కన్నేసి ఉంచుతారు. తాజాగా జియో ఫోన్ నెక్స్ట్‌ అందుబాటు లోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే జియో ఫోన్ నెక్స్ట్‌ కి సంబంధించిన 5 ప్రత్యేక విషయాలు ఫోన్ ను కొనే ముందు ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. జియో ఫోన్ నెక్స్ట్‌ ని గూగుల్ మరియు Qualcomm సహాయంతో రిలయన్స్ అభివృద్ధి చేసింది. ఇలా చేయడం ఇదే మొదటి సారి, ఇంకా జియో ఫోన్ నెక్స్ట్‌ కోసం కొత్త OS కూడా ప్రవేశ పెట్టారు. జియో ఫోన్ నెక్స్ట్Jio Phone Next;{#}ram pothineni;Smart phone;Reliance;Google;Jioజియో ఫోన్ నెక్స్ట్‌ కొంటున్నారా? 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండిజియో ఫోన్ నెక్స్ట్‌ కొంటున్నారా? 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండిJio Phone Next;{#}ram pothineni;Smart phone;Reliance;Google;JioTue, 09 Nov 2021 16:00:00 GMTజియో అనగానే సామాన్యుల బ్రాండ్ అన్పిస్తుంది. పేదల నుంచి సామాన్యుల వరకు జియోకు సంబంధించిన మొబైల్స్, సాంకేతిక అంశాలపై ఓ కన్నేసి ఉంచుతారు. తాజాగా జియో ఫోన్ నెక్స్ట్‌ అందుబాటు లోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే జియో ఫోన్ నెక్స్ట్‌ కి సంబంధించిన 5 ప్రత్యేక విషయాలు ఫోన్ ను కొనే ముందు ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

జియో ఫోన్ నెక్స్ట్‌ ని గూగుల్ మరియు Qualcomm సహాయంతో రిలయన్స్ అభివృద్ధి చేసింది. ఇలా చేయడం ఇదే మొదటి సారి, ఇంకా జియో ఫోన్ నెక్స్ట్‌ కోసం  కొత్త OS కూడా ప్రవేశ పెట్టారు.

జియో ఫోన్ నెక్స్ట్‌ మొదటిసారి స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులను, ఫీచర్ ఫోన్‌ల నుండి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది. గ్రామీణ, తక్కువ వయస్సు గల కొనుగోలుదారులకు స్మార్ట్ ఫోన్ వాడకం సులభతరం చేయడానికి, రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్‌ కోసం EMI ఆప్షన్ ను కూడా ప్రవేశ పెట్టింది. మీరు ఒక్కసారిగా డబ్బులు చెల్లించలేకపోతే రూ. 1,999 డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. వాయిదా మొత్తం రూ.300 నుండి ప్రారంభమవుతుంది. 18 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. జియో ఫోన్ నెక్స్ట్‌ EMIని అందించడానికి DMI ఫైనాన్స్ రిలయన్స్ రిటైల్‌తో కూడా జతకట్టింది.

జియో ఫోన్ నెక్స్ట్‌ 5.45-అంగుళాల HD+ డిస్‌ ప్లేతో వస్తోంది. థర్డ్ జనరేషన్ గొరిల్లా గ్లాస్ తో పూర్తిగా స్క్రీన్ సేఫ్ గా ఉంటుంది. Qualcomm అభివృద్ధి చేసిన క్వాడ్-కోర్ చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్ వస్తుంది. జియో ఫోన్ నెక్స్ట్‌ 3,500 mAh బ్యాటరీ బ్యాకప్ తో అందుబాటులోకి వస్తోంది.  
ఆప్టిక్స్‌లో ఇది 13MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ లెన్స్‌కు సపోర్ట్ చేస్తుంది. కంప్యూటింగ్ కోసం జియో ఫోన్ నెక్స్ట్‌ 32GB ఇంటర్నల్ స్పేస్‌తో 2GB ram తో రానుంది.

జియో ఫోన్ నెక్స్ట్‌ కోసం jio, google సంయుక్తంగా కొత్త OSను అభివృద్ధి చేశాయి. ఈ ఫీచర్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇది ఆండ్రాయిడ్ గో వెర్షన్‌పై ఆధారపడి ఉంటుంది. జియో ఫోన్ నెక్స్ట్‌ కూడా అట్టడుగున ఉన్న వారికి సహాయం చేయడానికి రీడ్ ఎలౌడ్, ట్రాన్స్‌లేట్ ఫీచర్‌తో వస్తుంది.

మొత్తం మీద జియో ఫోన్ నెక్స్ట్‌ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌కు కొత్త యూజర్ బేస్‌ను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇంకా 200 మిలియన్లకు పైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇందులో భాగం కావాలనుకుంటున్నారు. జియో ఫోన్ నెక్స్ట్‌ Xiaomi, Realme వంటి చైనీస్ కంపెనీలతో పోటీ పడుతుంది.



చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?

విశాఖ మన్యంలో మావోల అలజడి! జగనన్నకు వార్నింగ్ !

ఈఎంఐ ఆఫర్లో విమాన టికెట్.. త్వరపడండి?

నాని శ్యామ్ సింగరాయ్ బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందా...?

కేసీఆర్ Vs బీజేపీ : తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంట‌ర్

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>