PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs0ed0c756-1224-436e-a00e-5aa637327907-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs0ed0c756-1224-436e-a00e-5aa637327907-415x250-IndiaHerald.jpgఇవాళ కేసీఆర్ మాట మార్చినా, వైఎస్ జ‌గ‌న్ మాట మార్చినా అవ‌న్నీ వాళ్ల రాజ‌కీయ అవ‌స‌రాల్లో భాగ‌మే! అందుకే వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వీడియోలు చూస్కోండి అని అంటుంటారు. ఆ వీడియోలో చెప్పిన‌దానికి ఇప్ప‌టికీ ఏం తేడా అంటే అప్పుడు వీళ్ల‌కు ఉన్న ఆలోచ‌న వేరు ఇప్పుడు వీరి బుర్ర‌కు తోచిన ఆలోచ‌న వేరు అని! స‌రిగ్గా నిన్న‌టి వేళ కేసీఆర్ కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించారు. చ‌ర్చ‌కు తావిచ్చారు. trs{#}job;Press;KCR;Telanganaకేసీఆర్ టాక్స్ : ఇంటికో ఉద్యోగం అనలేద్రా? నమ్మండహే!కేసీఆర్ టాక్స్ : ఇంటికో ఉద్యోగం అనలేద్రా? నమ్మండహే!trs{#}job;Press;KCR;TelanganaTue, 09 Nov 2021 11:19:48 GMTరాజ‌కీయం అన్నాక రోజుకో మాట పూట‌కో మాట ఉంటాయి. నిమిషానికో నినాదం, క్ష‌ణానికో వివాదం ఉంటాయి. వీటిని అర్థం చేసుకున్న వారికి  చేసుకున్నంత. లేని వారికి లేనంత. అన్నీ అలానే ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ్టి ప‌రిణామాల ప్ర‌భావం రేప‌టి పై ఉంటుందా అంటే చెప్ప‌లేం. ఏ క్ష‌ణాన ఏమ‌యినా జ‌ర‌గవ‌చ్చు. జ‌ర‌గ‌కుండా ఉండ‌నూవ‌చ్చు. న‌మ్మ‌లేం. ఇక్క‌డ ఎవ్వ‌రినీ న‌మ్మ‌లేం. హాయిగా ఏదో నాలుగు మాటలు చెప్పి కాలం వెళ్ల‌దీసే రోజులు ఎప్పుడో పోయాయి. చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారా లేదా అని నిల‌దీసే రోజులు రానున్నాయి. అవి వ‌స్తే త‌ప్ప నాయ‌కుల్లో మార్పు రాదు. అందుకు ముందు ప్ర‌జ‌ల్లో మార్పు రావాలి.


ఇవాళ కేసీఆర్ మాట మార్చినా, వైఎస్ జ‌గ‌న్ మాట మార్చినా అవ‌న్నీ వాళ్ల రాజ‌కీయ అవ‌స‌రాల్లో భాగ‌మే! అందుకే వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వీడియోలు చూస్కోండి అని అంటుంటారు. ఆ వీడియోలో చెప్పిన‌దానికి ఇప్ప‌టికీ ఏం తేడా అంటే అప్పుడు వీళ్ల‌కు ఉన్న ఆలోచ‌న వేరు ఇప్పుడు వీరి బుర్ర‌కు తోచిన ఆలోచ‌న వేరు అని! స‌రిగ్గా నిన్న‌టి వేళ కేసీఆర్ కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించారు. చ‌ర్చ‌కు తావిచ్చారు.


ఎలా అంటే..? :
నిన్న‌టి వేళ నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని ఏనాడూ చెప్ప‌లేద‌ని అన్నారు. అదేవిధంగా రైతుల‌కు రుణ‌మాఫీ విష‌య‌మై కూడా స్ప‌ష్ట‌మ‌యిన వైఖ‌రితో ఉన్నామ‌ని రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ ఇస్తామ‌ని అన‌లేద‌ని, ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ రుణ‌మాఫీ వ‌ర్తింప జేస్తామ‌ని అన్నామ‌ని అదే మాట ఇప్పుడు కొన‌సాగిస్తున్నామని అన్నారు. ఇక ఉద్యోగాల విష‌యానికే వ‌స్తే జోన‌ల్ వ్య‌వ‌స్థ నిర్థార‌ణ అయ్యాక త్వ‌ర‌లో 70 వేల పోస్టులు వేయనున్నామ‌ని తెలంగాణ వ‌చ్చాక ల‌క్షా35 వేల ఉద్యోగాలు
ఇచ్చామ‌ని అన్నారు. వీటి మాటెలా ఉన్నా ఇంటికో ఉద్యోగం అన్న‌ది ఉద్య‌మ వేళ కేసీఆర్ చెప్పిన మాటే కానీ ఇప్పుడు మాత్రం
తాను ఆ మాట మాట్లాడ‌నే లేదని చెప్ప‌డం నాలుగు మ‌డ‌తెట్ట‌డం చూస్తుంటే న‌వ్వుకోక త‌ప్ప‌దు. నీళ్లు నిధులు నియామకాలు
అన్న నినాదమే ప్రాధాన్యం గా సాగిన తెలంగాణ ఉద్య‌మంలో ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాట‌ల‌కూ ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప‌నుల‌కూ అస్స‌లు పొంత‌నే లేదు.





సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>