PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/---------------95845c6b-9398-4dd4-8249-7bdcefc68e25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/---------------95845c6b-9398-4dd4-8249-7bdcefc68e25-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీనియర్‌ నేత, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు టీ. సుబ్బిరామిరెడ్డికి అనుకోని విధంగా షాక్ త‌గిలిన‌ది. ముంబైకి చెందిన ఓ కంపెనీ సుబ్బిరామిరెడ్డిని భారీ మోసగించింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.11 కోట్ల విలువ చేసే షేర్ల విషయంలో మోసం చేసిన‌ది ఆ కంపెనీ. ఓ కంపెనీ వ్యవహారంలో 1 శాతం షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ది. అయితే ఆయన కుటుంబానికి తెలియకుండానే ముంబైకి చెందిన కంపెనీ షేర్‌లను అమ్మేసింది. సుబ్బిరామిరెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన త‌రువాత ఛాంప#సుబ్బిరామిరెడ్డికి షాక్‌..!{#}Indira Gandhi;T Subbiramireddy;Nampally;Traffic police;police;June;contractమాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి భారీ షాక్‌..!మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి భారీ షాక్‌..!#సుబ్బిరామిరెడ్డికి షాక్‌..!{#}Indira Gandhi;T Subbiramireddy;Nampally;Traffic police;police;June;contractTue, 09 Nov 2021 07:28:24 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్ర సీనియర్‌ నేత, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు టీ. సుబ్బిరామిరెడ్డికి అనుకోని విధంగా షాక్ త‌గిలిన‌ది. ముంబైకి చెందిన ఓ కంపెనీ సుబ్బిరామిరెడ్డిని భారీ మోసగించింది.  ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా  రూ.11 కోట్ల విలువ చేసే షేర్ల విషయంలో మోసం చేసిన‌ది ఆ కంపెనీ. ఓ కంపెనీ వ్యవహారంలో 1 శాతం షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ది.

 అయితే  ఆయన కుటుంబానికి తెలియకుండానే ముంబైకి చెందిన కంపెనీ షేర్‌లను అమ్మేసింది. సుబ్బిరామిరెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన త‌రువాత ఛాంపియన్‌ పిన్స్‌ లిమిటెడ్‌కు చెందిన చేతన్‌ బాలుబాయి పటేల్‌ (48), హర్షవర్ధన్‌ అవినాష్‌ ప్రధాన్‌ (40) అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   ట్రాన్సిట్‌ వారెంట్‌పై వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరు ప‌రిచారు.  ఆ ఇద్ద‌రినీ జ్యూడీషియల్‌ కస్టడికి తరలించారు.

హైద‌రాబాద్‌లోని గాయ‌త్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్ర‌మోట‌ర్, చైర్ ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తిరెడ్డి నుంచి త‌మ‌కు ఫిర్యాదు అందింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. అయితే వారిని న‌మ్మి దాదాపు రూ.33.05 కోట్లు విలువ చేసే షేర్ల‌పై రూ.11.50,63,575 రుణం తీసుకునేందుకు అంగీక‌రించిన‌ట్టు వెల్ల‌డి అయింది. కానీ రుణం పొంద‌డానికి చివ‌రికి జీపీఎల్ జూన్ 17న మాస్ట‌ర్ లోన్ అగ్రిమెంట్ ప్ర‌కారం సీఎఫ్ఎల్ కేవ‌లం 32,50,000 షేర్ల‌ను తాక‌ట్టు పెట్టిన‌ట్టు పోలీస్ ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

ఒప్పందం ప్ర‌కారం తాక‌ట్టు పెట్టిన షేర్ల‌కు రుణ మొత్తాన్ని జులై 12 లోపు జీపీఎల్‌కు బ‌దిలీ చేయాల్సి ఉన్న‌ది. కానీ సీఎఫ్ఎల్ లోన్ మొత్తంలో ఎలాంటి డ‌బ్బు కూడ జీపీఎల్ బ‌దిలీ చేయ‌క‌పోవ‌డంతో జులై 8న సీఎఫఎల్ త‌మ‌ను మోస‌గించిన వారికి చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సుబ్బిరామిరెడ్డి భార్య ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేసింది. జులై 8న సీఎఫ్ఎల్ తాక‌ట్టు పెట్టిన షేర్ల‌ను చ‌ట్ట‌విరుద్ధంగా ప్ర‌వేశ‌పెట్టిన బ‌హిరంగ మార్కెట్‌లో విక్ర‌యించిన‌ట్టు తెలియ‌డంతోనే పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్టు ఇందిర వెల్ల‌డించారు. ఇందిరా సుబ్బిరామిరెడ్డి ఫిర్యాదుతో ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ సెక్ష‌న్ 406, 420ఆర్‌/డ‌బ్ల్యూ కింద కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు.






మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి భారీ షాక్‌..!

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>