MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vilana330d3df-9b44-4a17-a446-531fd1686bd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vilana330d3df-9b44-4a17-a446-531fd1686bd0-415x250-IndiaHerald.jpgప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు మనవడు రానా ఇండస్ట్రీలో తాతకి తగ్గ మనవడిగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. రానా తండ్రి సురేష్ బాబు రామానాయుడు బాటలో నడవగా.. రానా మాత్రం వాళ్ళ బాబాయి వెంకటేష్ అడుగు జాడల్లో నడుస్తున్నాడు. రానా లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు.vilan{#}D Ramanaidu;Nimmala Ramanaidu;Bahubali;kalyan;Rajamouli;Suresh;producer;Producer;rana daggubati;Venkatesh;Cinemaవిలనిజంతో భయపెట్టిన రానా దగ్గుబాటి..!!విలనిజంతో భయపెట్టిన రానా దగ్గుబాటి..!!vilan{#}D Ramanaidu;Nimmala Ramanaidu;Bahubali;kalyan;Rajamouli;Suresh;producer;Producer;rana daggubati;Venkatesh;CinemaTue, 09 Nov 2021 10:23:59 GMTప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు మనవడు రానా ఇండస్ట్రీలో తాతకి తగ్గ మనవడిగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. రానా తండ్రి సురేష్ బాబు రామానాయుడు బాటలో నడవగా.. రానా మాత్రం వాళ్ళ బాబాయి వెంకటేష్ అడుగు జాడల్లో నడుస్తున్నాడు. రానా లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు. రానా సినీ జీవితంలో మొదట్లో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాహుబలి సినిమాతో సూపర్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటనతో విలన్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

అయితే రానా ఒక్కవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు విలన్ గా  వేస్తున్నాడు. రాజమౌళి సాధారణంగా ఎవరిని అయినా సెలక్ట్ చేశారంటే వారిలో ఉండే సామర్ధ్యాన్ని కూడా అంచనా వేసి సినిమాకి తీసుకుంటూ ఉంటాడు. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడు పాత్రలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అంతేకాదు.. బాహుబలి సినిమాతో రానా సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆయన ఈ సినిమా తరువాత హీరోగా పలు సినిమాలు చేశారు.

కాగా.. రానా హీరోనా, విలనా అనేది చూడకుండా కథ, పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆయన నటించే పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటె ఆ పాత్ర కోసం ఎంత రిస్క్ చేయడానికి అయినా ముందుకు వెళ్తుంటారు. రానా ఇప్పటికే పలు సినిమాలో తనలోని విలక్షణ కోణాన్ని బయటకు తీసిన విషయం అందరికి తెలిసిందే. ఆయనలోని మరికొన్ని నెగిటివ్ షేడ్స్ బయటికి తీయడానికి దర్శకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రానా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న బీమ్లానాయక్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికి హీరో, విలన్ ఇలా సినిమాలో ఓ పాత్రకు తాను సూట్ అవుతాను అనిపించిన ఏ సినిమా అయినా చేసే ఆలోచనలో ఉన్న రానా కచ్చితంగా ట్రెండ్ క్రియేట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు.



హుజురాబాద్ పుండుకు.. ఫ్రంట్ ఆయింటుమెంటా..!

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !

ర్యాంకులు పడిపోనాయ్.. ఏటి సేత్తాం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>