PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-bjpba1642ad-dc8a-4737-93c4-d5c2331ddd98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-bjpba1642ad-dc8a-4737-93c4-d5c2331ddd98-415x250-IndiaHerald.jpg2014లో చంద్రబాబు..బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అటు కేంద్రంలో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించింది. అయితే నాలుగేళ్ల పాటు వీరి పొత్తు బాగానే నడిచింది...కానీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి కేంద్రం వేరే రాష్ట్రాలకు ఇస్తూ ఏపీకి ఇవ్వకపోవడంతో చంద్రబాబు, ఎన్డీయే నుంచి బయటకొచ్చేశారు. అక్కడ నుంచి చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరిట కేంద్రంపై పోరాడుతూ వచ్చారు. ఇక ఎన్నికల దగ్గరకొచ్చేసరికి....బీజేపీ ఏ విధంగా చంద్రబాబుకు చుక్కలు చూపించిందో చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నేతల ఇళ్లపై ఈడchandrababu bjp{#}CBN;Hanu Raghavapudi;Bharatiya Janata Party;KCR;Telangana;TDPచంద్రబాబుని బీజేపీ అంత‌లా భయపెట్టిందా...?చంద్రబాబుని బీజేపీ అంత‌లా భయపెట్టిందా...?chandrababu bjp{#}CBN;Hanu Raghavapudi;Bharatiya Janata Party;KCR;Telangana;TDPTue, 09 Nov 2021 11:50:00 GMT2014లో చంద్రబాబు..బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అటు కేంద్రంలో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించింది. అయితే నాలుగేళ్ల పాటు వీరి పొత్తు బాగానే నడిచింది...కానీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి కేంద్రం వేరే రాష్ట్రాలకు ఇస్తూ ఏపీకి ఇవ్వకపోవడంతో చంద్రబాబు, ఎన్డీయే నుంచి బయటకొచ్చేశారు. అక్కడ నుంచి చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరిట కేంద్రంపై పోరాడుతూ వచ్చారు. ఇక ఎన్నికల దగ్గరకొచ్చేసరికి....బీజేపీ ఏ విధంగా చంద్రబాబుకు చుక్కలు చూపించిందో చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నేతల ఇళ్లపై ఈడీ దాడులు జరిగాయి. అలాగే బాబుని ఇరుకున పెట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసింది.

అందుకే చంద్రబాబు సైతం రాష్ట్రంలోకి సి‌బి‌ఐ రావడానికి వీలు లేదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే ఏ విధంగా బీజేపీ...ఈడీ, సి‌బి‌ఐలని వాడుకుని బాబుని భయపెట్టిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే విషయాన్ని తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ పరోక్షంగా చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు, కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ అవినీతి చేశారని, సి‌బి‌ఐ విచారణ జరగడం ఖాయమని, ఆయన్ని జైలుకు పంపిస్తామని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్, బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

ఇదేంటని ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేస్తారా? అన్యాయంగా కేసులు పెడతారా? అని ప్రశ్నించిన కేసీఆర్..అక్కడో ఇక్కడో భయపెట్టినట్లు ఇక్కడ సాగదని, అడ్డగోలుగా దుర్వినియోగం చేసి తమను ఏదైనా చేద్దామని అనుకుంటే వాళ్లే నష్టపోతారని,  ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. అంటే అక్కడో, ఇక్కడో అంటే 2019 ఎన్నికల ముందు బీజేపీ...చంద్రబాబుని భయపెట్టిందన్నట్లు కేసీఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చినట్లు ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ తమ అధికారంతో కొందరు నేతలని భయపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాగే కేసీఆర్‌ని కూడా ఇరుకున పెట్టడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 



అందరూ మోసం చేసారు, రేవంత్ రెడ్డి ఆవేదన...!

బిగ్ బాస్ 5లో.. వేడి రాజుకుంది?

సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>