PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nellore-corporation6852aaea-c31b-4ffa-853f-bf67ab07bd9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nellore-corporation6852aaea-c31b-4ffa-853f-bf67ab07bd9a-415x250-IndiaHerald.jpgనెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ దూసుకెళ్తోంది. కార్పొరేషన్ ఎన్నికలు ఈనెల 15వ తేదీన జరుగుతాయి. అయితే ఎన్నికలు జరగకముందే టీడీపీకి కోలుకోలేని షాకులిస్తున్నారు వైసీపీ నేతలు. అసలు పోటీనే లేకుండా చాలా స్థానాలు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. టీడీపీ నేతల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిత్తూ చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ను ఎలాగైనా ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావించిన వైసీపీ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వెళుతూ.. టీడీపీ అంచనాలకు అందకుండా రాజకీయాలు నడిపారు. దీంతో నెల్లnellore-corporation{#}ATCHANNAIDU KINJARAPU;Nellore;District;YCP;politics;TDP;Elections;Party;local languageనెల్లూరు: అనుకున్నది సాధించిన వైసీపీనెల్లూరు: అనుకున్నది సాధించిన వైసీపీnellore-corporation{#}ATCHANNAIDU KINJARAPU;Nellore;District;YCP;politics;TDP;Elections;Party;local languageTue, 09 Nov 2021 08:00:49 GMTనెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ దూసుకెళ్తోంది. కార్పొరేషన్ ఎన్నికలు ఈనెల 15వ తేదీన జరుగుతాయి. అయితే ఎన్నికలు జరగకముందే టీడీపీకి కోలుకోలేని షాకులిస్తున్నారు వైసీపీ నేతలు. అసలు పోటీనే లేకుండా చాలా స్థానాలు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. టీడీపీ నేతల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిత్తూ చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ను ఎలాగైనా ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావించిన వైసీపీ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వెళుతూ.. టీడీపీ అంచనాలకు అందకుండా రాజకీయాలు నడిపారు. దీంతో నెల్లూరు నగరంలో 8 డివిజన్లు ఏకగ్రీవమై వైసీపీ చేతికి వచ్చాయి.

నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారాలతో నగరం హోరెత్తుతోంది. భారీ వర్షాల్లోనూ ప్రచారం చేస్తూ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఒకవైపున ప్రచారం చేస్తూనే మరొక వైపు రాజకీయాలు చేస్తున్నారు నెల్లూరు వైసీపీ నేతలు. ఈ రాజకీయాల ఫలితంగానే 8 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులే వచ్చి వైసీపీ కండువాలు కప్పుకునేలా వ్యూహాలు రచించారు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు అసలేం జరుగుతుందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

వైసీపీ రాజకీయాలో షాక్ తగిలిన టీడీపీ ఆందోళనలు, నిరసనలు తెలిపింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నెల్లూరుకు వచ్చి ఈ తతంగాన్ని పరిశీలించారు. వైసీపీ నేతల రాజకీయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోందని..ఇలాంటి ఘోరమైన ఎన్నికలను తామెన్నడూ చూడలేదని అంటున్నారు టీడీపీ నేతలు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు జరగకముందే వైసీపీ పై చేయి సాధించడంతో, నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్ కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది.



నేడు పాత‌ప‌ట్నం, ఒడిశాకు సీఎం వైఎస్‌ జగన్‌

నెల్లూరు: అనుకున్నది సాధించిన వైసీపీ

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>