PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sucharita70f3b9e3-550e-4e17-a4ee-7bf8b14af07d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sucharita70f3b9e3-550e-4e17-a4ee-7bf8b14af07d-415x250-IndiaHerald.jpgసేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. ఇప్పటికే యాత్ర గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని... ప్రకాశం జిల్లా పర్చూరు, ఇంకొల్లు ప్రాంతానికి చేరుకుంది. ఈ యాత్ర విషయంలో ఏపీ పోలీసుల వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ముందుగా యాత్రకు అనుమతి నిరాకరించారు. చివరికి హైకోర్టులో పిటిషన్ వేయడంతో... అక్కడ పాదయాత్రకు అనుమతి వచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయి అంటూ హైకోర్టు సూచించింది. యాత్రకు కేవలం 157 మందికి మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు అSucharita{#}Mekathoti Sucharitha;High court;Maha;Amaravati;court;Yatra;Prakasam;Yevaru;police;House;Capital;Andhra Pradeshఅమరావతి రైతులకు హోమ్ మంత్రి వార్నింగ్..!అమరావతి రైతులకు హోమ్ మంత్రి వార్నింగ్..!Sucharita{#}Mekathoti Sucharitha;High court;Maha;Amaravati;court;Yatra;Prakasam;Yevaru;police;House;Capital;Andhra PradeshTue, 09 Nov 2021 11:36:29 GMTసేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. ఇప్పటికే యాత్ర గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని... ప్రకాశం జిల్లా పర్చూరు, ఇంకొల్లు ప్రాంతానికి చేరుకుంది. ఈ యాత్ర విషయంలో ఏపీ పోలీసుల వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ముందుగా యాత్రకు అనుమతి నిరాకరించారు. చివరికి హైకోర్టులో పిటిషన్ వేయడంతో... అక్కడ పాదయాత్రకు అనుమతి వచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయి అంటూ హైకోర్టు సూచించింది. యాత్రకు కేవలం 157 మందికి మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు అంగీకరించిన రాజధాని ప్రాంత రైతులు... పాదయాత్ర చేపట్టారు. అయితే పోలీసులు మాత్రం తొలి నుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. యాత్రలో పాల్గొన్న వారి ఫోటోలు తీయడం, వారికి ఆశ్రయం ఇస్తున్న వారి వివరాలు సేకరించడం వంటివి పోలీసులు చేస్తున్నారు. దీనిపై తొలి నుంచి అటు రైతులు, ఇటు ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

రైతులు నిబంధనలు ఉల్లంఘించారని... కొవిడ్ రూల్స్ అతిక్రమించారని.. అనుమతి తీసుకున్న వారి కంటే ఎక్కువ మంది యాత్రలో పాల్గొన్నారంటూ పోలీసులు యాత్ర నిర్వాహకులకు ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కూడా రైతు సంఘాల నేతలు అంగీకారం తెలిపారు. అయితే ఈ పాదయాత్రపై రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సూచించారు. అమరావతి రైతులు కూడా పాదయాత్రలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని స్పష్టం చేశారు హోమ్ మంత్రి సుచరిత. మహా పాదయాత్ర పేరుతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు హోమ్ మంత్రి సుచరిత. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కూడా వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తారని... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు కూడా.



జ‌గ‌నన్న టూర్ : ఏప్రిల్ లో లేఖ రాశాడు న‌వంబ‌ర్ లో వెళ్తున్నాడ్రా!

బిగ్ బాస్ 5లో.. వేడి రాజుకుంది?

సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>