PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr25241464-664a-4c5e-b02a-c6fe66aa8888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr25241464-664a-4c5e-b02a-c6fe66aa8888-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో తాజా ఓటమి సీఎం కేసీఆర్ ను బాగా బాధిస్తున్నట్టే ఉంది. ఇప్పటివరకు ఓటమి అనేది ఎరుగక అధికారంతో కొనసాగుతూ ఉన్న ఆయనకు ఇక అధికారం పోతుందేమో అన్న భయం మొదటి సారి కలిగినట్టే ఉంది. అందుకే ఇటీవల ప్రెస్ మీట్ లు పెట్టి పెట్టి తన గోడు వినిపించుకుంటూనే ఉన్నాడు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఇంతకు కేంద్రం చేసిన తప్పులే వల్లే వేస్తాడు తప్ప తాను చేసింది మాత్రం చెప్పట్లేదు. తాజా ఓటమికి బాగా మానసికంగా కేసీఆర్ కృంగిపోతున్నట్టే ఉంది. అందుకే గతంలో వదిలేసిన ఫ్రంట్ ను మళ్ళీ మొదలు పెడతాను అంటున్నాడు. ఇదంతా ఓటమి నkcr-front;{#}CM;Press;Coronavirus;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Partyహుజురాబాద్ పుండుకు.. ఫ్రంట్ ఆయింటుమెంటా..!హుజురాబాద్ పుండుకు.. ఫ్రంట్ ఆయింటుమెంటా..!kcr-front;{#}CM;Press;Coronavirus;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata PartyTue, 09 Nov 2021 10:32:49 GMTతెలంగాణాలో తాజా ఓటమి సీఎం కేసీఆర్ ను బాగా బాధిస్తున్నట్టే ఉంది. ఇప్పటివరకు ఓటమి అనేది ఎరుగక అధికారంతో కొనసాగుతూ ఉన్న ఆయనకు ఇక అధికారం పోతుందేమో అన్న భయం మొదటి సారి కలిగినట్టే ఉంది. అందుకే ఇటీవల ప్రెస్ మీట్ లు పెట్టి పెట్టి తన గోడు వినిపించుకుంటూనే ఉన్నాడు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఇంతకు కేంద్రం చేసిన తప్పులే వల్లే వేస్తాడు తప్ప తాను చేసింది మాత్రం చెప్పట్లేదు. తాజా ఓటమికి బాగా మానసికంగా కేసీఆర్ కృంగిపోతున్నట్టే ఉంది. అందుకే గతంలో వదిలేసిన ఫ్రంట్ ను మళ్ళీ మొదలు పెడతాను అంటున్నాడు. ఇదంతా ఓటమి నొప్పి తగ్గించుకోవడానికేనా లేక మరేదైనా కారణం ఉన్నదా అని తెలుసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ఉన్నమాట నిజమే, అదే తాజా ఉపఎన్నికలలో కూడా కాస్త కనిపించింది. అందుకే బీజేపీ కూడా తనవంతు కృషి చేయడం మొదలుపెట్టింది. ఇక అధిక ధరల విషయం అందరికి తెలిసిందే, అదంతా కరోనా పుణ్యమే. ఇవన్నీ జాతీయంగా ప్రభావం చూపించినట్టు ప్రస్తుతానికి అనిపించినా ఎన్నికల సమయానికి వాటికీ బీజేపీ ఒక పరిష్కారం చెప్పుకుంటుంది. అది చాలు మళ్ళీ అదే అధికారంలోకి రావడానికి, ఈ దెబ్బతో తెలంగాణాలో తెరాస కు గట్టి దెబ్బ తగిలినట్టే. ఒకపక్క అభివృద్ధి చేస్తున్నాను అంటూనే మరోపక్క వ్యతిరేకత ఎందుకు వచ్చిందనే ఆలోచన కేసీఆర్ లో రావాల్సి ఉంటుంది. అది రానంతకాలం ఎన్ని ఫ్రంట్ లు పెట్టినా  ప్రయోజనం మాత్రం శూన్యమే.

అలా కాకుండా కేవలం తన ఓటమికి మందులా ఈ ఫ్రంట్ మాట ఎత్తితే మాత్రం పెద్దగా ప్రభావం ఉండదు అనే చెప్పాలి. నిజమే కదా, గాయానికి మందు రాసుకోవడం తప్పేమి కాదు. ఫ్రంట్ ఏర్పాటుకు ఇప్పుడు అన్ని పార్టీలు కలుస్తున్నట్టుగా అనిపించినా అందులో కేసీఆర్ పాత్ర మాత్రం పెద్దగా ఉండబోదు. ఆయన అటువైపు వెళితే బీజేపీ కి కూడా సొంత అస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా వాటిని ప్రయోగిస్తారు. అలా కేసీఆర్ మందేసుకుంటే సరి, నిజంగా అటువైపు మళ్ళినా, మరో దెబ్బ మాత్రం తప్పదు.



కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ లేఖ !

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !

ర్యాంకులు పడిపోనాయ్.. ఏటి సేత్తాం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>