PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp645fed9b-ea1a-4672-b01b-6a7272707b25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp645fed9b-ea1a-4672-b01b-6a7272707b25-415x250-IndiaHerald.jpgరాజధాని అమరావతి అంశం సైలెంట్‌గా వైసీపీని ఇబ్బంది పెట్టేలాగానే ఉంది...ఏదో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి...తాము తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్ధతు ఎక్కువగా ఉందని వైసీపీ నేతలు ఫీల్ అవుతున్నారు...కానీ గ్రౌండ్ లెవెల్‌ల్లోకి వెళితే ఆ పరిస్తితి లేదనే తెలుస్తోంది. పోనీ మూడు రాజధానులని అని చెప్పి...ఆ దిశగా ముందుకెళ్లడం...ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పని లేదు. దీంతో రాజధాని అంశంపై మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి...ఇప్పుడు ప్రజలysrcp{#}Prathipadu;Guntur;Parliment;YCP;Amaravati;TDP;Party;Capitalఈ సారి గుంటూరులో క్లీన్‌స్వీపేనా?ఈ సారి గుంటూరులో క్లీన్‌స్వీపేనా?ysrcp{#}Prathipadu;Guntur;Parliment;YCP;Amaravati;TDP;Party;CapitalTue, 09 Nov 2021 04:00:00 GMTరాజధాని అమరావతి అంశం సైలెంట్‌గా వైసీపీని ఇబ్బంది పెట్టేలాగానే ఉంది...ఏదో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి...తాము తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్ధతు ఎక్కువగా ఉందని వైసీపీ నేతలు ఫీల్ అవుతున్నారు...కానీ గ్రౌండ్ లెవెల్‌ల్లోకి వెళితే ఆ పరిస్తితి లేదనే తెలుస్తోంది. పోనీ మూడు రాజధానులని అని చెప్పి...ఆ దిశగా ముందుకెళ్లడం...ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పని లేదు. దీంతో రాజధాని అంశంపై మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి...ఇప్పుడు ప్రజలు..వైసీపీపై అసంతృప్తిని చూపించడం లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు..వీరు అమరావతి విషయంలో ప్రభుత్వంపై గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. అలా అని ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏం చేసిన ఉపయోగం లేదని, కానీ ఎన్నికల సమయంలో తమ అసంతృప్తి ఎలా ఉంటుందో చూపించాలని గుంటూరు ప్రజలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి రైతులు, ప్రజలు చేస్తున్న మహాపాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తుంది. దీని బట్టి చూస్తే ఈ సారి గుంటూరులో వైసీపీకి బొమ్మ కనబడేలా ఉంది.

ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ తుడుచుకుపెట్టుకుని పోయేలా ఉంది..స్థానిక ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు వైసీపీకి పూర్తిగా మద్ధతు ఇచ్చినా సరే....సాధారణ ఎన్నికలోచ్చేసరికి మాత్రం చుక్కలు చూపించడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. పైగా పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్నంత గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదని అర్ధమవుతుంది...అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేతలు వేగంగా పుంజుకుంటున్నారు.

పొన్నూరు, తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వైసీపీకి బాగా ఇబ్బంది ఉంటుందనే చెప్పొచ్చు. అలాగే తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు అంత సులువు కాదని....వైసీపీ శ్రేణులే మాట్లాడుకునే పరిస్తితి..రాజధాని అంశం ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, కాకపోతే అది ఇప్పుడు తెలియడం లేదని, నెక్స్ట్ ఎన్నికల్లో కనబడుతుందని సొంత పార్టీ నేతలే మాట్లాడుకునే పరిస్తితి.  





ఈ సారి గుంటూరులో క్లీన్‌స్వీపేనా?

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>