MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puneeth-rajkumar-gali-janardhan-reddyf4827d1b-75a8-488f-b873-a46fd5fc9d0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puneeth-rajkumar-gali-janardhan-reddyf4827d1b-75a8-488f-b873-a46fd5fc9d0e-415x250-IndiaHerald.jpgకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్ని రోజుల ముందు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన నివాసంలో వర్క్ అవుట్స్ చేస్తూ..ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళారు కుటుంబ సభ్యులు. అయినా ఫలితం లేకుండాపోయింది. డాక్టర్స్ ట్రీట్ మెంట్ ఇస్తున్న సమయంలోనే పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస్ విడిచారు. ఈ వార్తతో సినీ లోకం షాక్ కి గురైంది. కేవలం సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయ నాయకులు సైతం ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన నటుడిగానే కాకుండా సామాజిక సేవకుడిగానూ సమాజంPuneeth Rajkumar gali janardhan reddy{#}Raaj Kumar;puneet rajkumar;advertisement;Supreme Court;Kannada;monday;Yevaru;Air;Reddy;School;Government;Pawan Kalyan;Ministerపునీత్ లానే నేను కూడా.. గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం..!!పునీత్ లానే నేను కూడా.. గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం..!!Puneeth Rajkumar gali janardhan reddy{#}Raaj Kumar;puneet rajkumar;advertisement;Supreme Court;Kannada;monday;Yevaru;Air;Reddy;School;Government;Pawan Kalyan;MinisterTue, 09 Nov 2021 19:20:07 GMTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్ని రోజుల ముందు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన నివాసంలో వర్క్ అవుట్స్ చేస్తూ..ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళారు కుటుంబ సభ్యులు. అయినా ఫలితం లేకుండాపోయింది. డాక్టర్స్ ట్రీట్ మెంట్ ఇస్తున్న సమయంలోనే పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస్ విడిచారు. ఈ వార్తతో సినీ లోకం షాక్ కి గురైంది. కేవలం సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయ నాయకులు సైతం ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎందుకంటే ఆయన నటుడిగానే కాకుండా సామాజిక సేవకుడిగానూ సమాజంపై చెరగని ముద్ర వేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. అభిమానులంతా ప్రేమగా అప్పు అని పిలుచుకునే ఆయన మరణించి దాదాపు 10 రోజులు కావస్తున్న ఇంకా ఆ విషయాని ఎవరు మర్చిపోలేకపోతున్నారు. పునీత్ దశదిన కర్మను ఆయన అభిమానులు సోమవారం నాడు జరుపుకొన్నారు. ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సైతం బళ్లారిలో బెళగల్‌ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు.

తన అద్భుతమైన  నటనతోనే కాకుండా  సామాజిక సేవతోనూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న  పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం  కన్నడ ప్రజలను తీవ్ర దు:ఖంలోకి నెట్టేసిందని అన్నారు. దివంగత నటుడికి ప్రభుత్వం ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువేనని తెలిపారు.  అంతేకాదు.. ఇక నుంచి పునీత్ దారిలోనే తాను  పయనిస్తానని.. ఆయన లానే పలు సేవా కార్యక్రమాలను చేపడతానని చెప్పిన ఆయన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇక నుంచి బళ్లారిలోనే తాను నివసిస్తానని చెప్పుకొచ్చారు. బళ్లారిలో పునీత్ జ్ఞాపకార్థం ఆయన పేరుతో గాలి సొంత ఖర్చులతో  ఆసుపత్రి, పాఠశాల నిర్మిస్తానని మాట ఇచ్చారు. పేదలకు హాస్పిటల్ లో ఉచితంగా ట్రీట్ మెంట్ అందించడమే కాకుండా విద్యార్థులకు కూడా ఉచితంగా విద్యనందించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆసుపత్రి, పాఠశాలకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి.

 



పునీత్ లానే నేను కూడా.. గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం..!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>