PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpgధరలు తగ్గించలేని దద్దమ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత... రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని అడిగిన ప్రజలను ఏపీ ప్రభుత్వం కొడుతోందని ఆరోపించారు సోము వీర్రాజు. పెట్రోల్ ధరలపై పత్రికలో ప్రకటనలపై ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సోము వVeerraju{#}Nani;Somu Veerraju;Y. S. Rajasekhara Reddy;Government;Letter;Yevaru;Party;police;Bharatiya Janata Party;Andhra Pradesh;Petrol;Diesel;YCPవైసీపీ నేతలు దద్దమ్మలు... సోమన్న ఫైర్..!వైసీపీ నేతలు దద్దమ్మలు... సోమన్న ఫైర్..!Veerraju{#}Nani;Somu Veerraju;Y. S. Rajasekhara Reddy;Government;Letter;Yevaru;Party;police;Bharatiya Janata Party;Andhra Pradesh;Petrol;Diesel;YCPTue, 09 Nov 2021 13:03:00 GMTధరలు తగ్గించలేని దద్దమ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు.  పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత... రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని అడిగిన ప్రజలను ఏపీ ప్రభుత్వం కొడుతోందని ఆరోపించారు సోము వీర్రాజు. పెట్రోల్ ధరలపై పత్రికలో ప్రకటనలపై ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సోము వీర్రాజు తెలిపారు. పెట్రోల్ ధరలపై ఎవరు ఎంత పెంచారో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. వైసీపీ నేతలు పొత్తులపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు సోము వీర్రాజు. రాష్ట్రంలో కేవలం జనసేన, బీజేపీల మధ్య మాత్రమే పొత్తు ఉందన్నారు కమలం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తాము ఎవరికి తోక పార్టీలు కాదని తేల్చి చెప్పారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే... ఘాటుగా బదులిస్తామని హెచ్చరించారు సోము వీర్రాజు.

మంత్రి కొడాలీ నాని చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తుంటే... బూతులు మాట్లాడతారా అని ప్రశ్నించారు వీర్రాజు. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎయిడెడ్ కళాశాల విషయంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఏమిటన్నారు సోము వీర్రాజు. ప్రస్తుతం రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసే లేఖపై బదులు రాకపోతే... భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటో రుచి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఏపీ శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలున్నాయన్నారు కర్ణాటక రాష్ట్రానికి ఏపీకి మధ్య లీటర్ డీజిల్‌కు 12 రూపాయలు తేడా  ఉందని వ్యాఖ్యానించారు.





దర్శకుడే విలన్ అయితే.. సముద్రఖని లా ఉంటాడు..!!

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

పెట్రోల్ రేట్లలో ఏపీ, తెలంగాణ ఎక్కడ..?

విలన్ గా అడుగులు వేస్తున్న అది పినిశెట్టి..!!

బిగ్‌బాస్ టాప్‌-5లో ఎవ‌రెవ‌రంటే...!

లోకేష్‌.. మీరేం చేశారో చెప్పాలన్న హోమ్ మంత్రి...!

ఇదే నాకు సరైన సమయం అని చెప్పిన కోహ్లీ...

కుప్పంలో అనుకున్నది సాధించిన వైసీపీ...?

బిగ్ బాస్ 5లో.. వేడి రాజుకుంది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>