PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/babu56e951a6-19db-453d-a1c8-b3ab09522432-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/babu56e951a6-19db-453d-a1c8-b3ab09522432-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకటే రచ్చ... అదే పెట్రో మంట. దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్‍‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. మోదీ సర్కార్ నిర్ణయం సూపర్ అంటూ... భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ ట్యాక్స్‌ను తగ్గించాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ అడుగు ముందుకు వేసింది. అసలు ఎందుకు తగ్గించాలి అంటూ ఓ పెద్ద ప్రకటన కూడా జారీ చేసింది. దీనిపై అటు వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి అనBabu{#}Jagan;Narendra Modi;Varsham;Diwali;Y. S. Rajasekhara Reddy;Andhra Pradesh;YCP;CBN;Petrol;Telugu Desam Party;war;TDP;Telugu;central government;Bharatiya Janata Partyఅంతుచిక్కని జగన్ వ్యూహం... బాబు పరిస్థితి అయోమయం...!అంతుచిక్కని జగన్ వ్యూహం... బాబు పరిస్థితి అయోమయం...!Babu{#}Jagan;Narendra Modi;Varsham;Diwali;Y. S. Rajasekhara Reddy;Andhra Pradesh;YCP;CBN;Petrol;Telugu Desam Party;war;TDP;Telugu;central government;Bharatiya Janata PartyTue, 09 Nov 2021 14:59:38 GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకటే రచ్చ... అదే పెట్రో మంట. దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్‍‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. మోదీ సర్కార్ నిర్ణయం సూపర్ అంటూ... భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ ట్యాక్స్‌ను తగ్గించాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ అడుగు ముందుకు వేసింది. అసలు ఎందుకు తగ్గించాలి అంటూ ఓ పెద్ద ప్రకటన కూడా జారీ చేసింది. దీనిపై అటు వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఒక్కసారిగా కేంద్రానికి రివర్స్ అయ్యింది. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. పెట్రోల్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పెంచింది ఎంత... తగ్గించింది ఎంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

జగన్ సర్కార్ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీని ఇరుకున పెట్టినట్లుగా అయ్యింది. నిన్న మొన్నటి వరకు కేంద్రానికి జగన్ సర్కార్ అనుకూలంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే ఇప్పుడు పెట్రో ధరలపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలని చూసిన చంద్రబాబుకు వైసీపీ ప్రకటన గట్టి షాక్  ఇచ్చినట్లుగా ఉంది. వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని వైసీపీని డిమాండ్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ... ఎక్సైజ్ డ్యూటీ విషయంలో మాత్రం కేంద్రాన్ని పల్లెత్తు మాట అనటం లేదు. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాల్సింది కేంద్రమే అని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా కూడా... తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం... కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని వదిలేసి... రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం ఏమిటంటున్నారు వైసీపీ నేతలు. జగన్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యిందా అని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సూచిస్తున్నారు.





చైనాను అది భయపెడుతుంది.. చేసిన పాపం ఎటు పోతుంది?

కేసీఆర్ Vs బీజేపీ : తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంట‌ర్

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>