PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp34012baf-0195-4200-9da9-e5aa521c3433-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp34012baf-0195-4200-9da9-e5aa521c3433-415x250-IndiaHerald.jpgఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది....స్థానిక ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తోంది. ముందు ప్రజస్వామ్యంగా గెలవడం కంటే...అసలు బరిలో ప్రత్యర్ధులనే లేకుండా చేసి ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అసలు ఆ మధ్య జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని వార్డులని, డివిజన్లని ఏకగ్రీవం చేసుకుందో చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు, మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకుంది. అంటే టీడీపీ తరుపున పోటీ చేసే నాయకులు లేక అలా ఏకగ్రీవాలు అయ్యాయా లేక....వైసీపీ, టీడీపీ అభ్యర్ధులని బెదిరించి ఏకగ్Ysrcp{#}Macherla;Nellore;local language;Assembly;CBN;YCP;TDPవైసీపీ ఆ మ్యాజిక్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిపీట్ చేస్తుందా...!వైసీపీ ఆ మ్యాజిక్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిపీట్ చేస్తుందా...!Ysrcp{#}Macherla;Nellore;local language;Assembly;CBN;YCP;TDPTue, 09 Nov 2021 11:27:00 GMTఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది....స్థానిక ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తోంది. ముందు ప్రజస్వామ్యంగా గెలవడం కంటే...అసలు బరిలో ప్రత్యర్ధులనే లేకుండా చేసి ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అసలు ఆ మధ్య జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని వార్డులని, డివిజన్లని ఏకగ్రీవం చేసుకుందో చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు, మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకుంది. అంటే టీడీపీ తరుపున పోటీ చేసే నాయకులు లేక అలా ఏకగ్రీవాలు అయ్యాయా లేక....వైసీపీ, టీడీపీ అభ్యర్ధులని బెదిరించి ఏకగ్రీవం చేసుకుందా ? అనేది ప్రజలకు బాగా తెలుసు.

ఇక వైసీపీ నేతలు ఒక ఎత్తు అయితే అధికారులు మరొక ఎత్తు అవుతున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అధికారులు సైతం కావాలని టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లని తిరస్కరించి వైసీపీకి ఏకగ్రీవం అయ్యేలా చేస్తున్నారు. తాజాగా అదే సీన్ రిపీట్ అయింది. నెల్లూరు కార్పొరేషన్‌లో ఏకంగా 8 డివిజన్లలో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరించారు. దీంతో 8 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.

ఇటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఒక వార్డుని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 14వ వార్డులో టీడీపీ అభ్యర్ధి సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ తిరస్కరించి వైసీపీకి ఏకగ్రీవం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అటు దర్శి మున్సిపాలిటీలో సైతం ఒక వార్డులో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చెప్పి, ఆ వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయ్యేలా చేశారు.

అయితే ఇలా ఏకగ్రీవాలు అవ్వడంపై టీడీపీ శ్రేణులు కాస్త ఆందోళన చెందుతున్నాయి. స్థానిక ఎన్నికలు కాబట్టి ఏకగ్రీవం అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లని ఇదే విధంగా తిరస్కరిస్తే పరిస్తితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్ధులే ఏదొక సాకుతో టీడీపీ వాళ్ళవే రిజెక్ట్ చేస్తున్నారని, ఇదంతా వైసీపీ, అధికారులు కలిసి చేస్తున్న పోలిటికల్ డ్రామా అని అంటున్నారు.



సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>