PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr6071a1ab-4135-495f-91cc-fdab2e311185-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr6071a1ab-4135-495f-91cc-fdab2e311185-415x250-IndiaHerald.jpgతెలంగాణను ఎంతో అభివృద్ధి చేశాను అంటున్నాడు సీఎం కేసీఆర్. అలా చేస్తే ఈ వ్యతిరేకత ఎందుకు, మూడు సీట్లు బీజేపీ కైవసం ఎలా చేసుకుంది అంటారు సీఎం గారు. ముందు ఈ విషయంపై మీరు ఒక స్పష్టతకు వస్తే అనంతరం అన్ని కూడా అర్ధం అవుతాయి. ఒకవేళ ఇలా అయిఉండవచ్చు, మీరు చేసినా ప్రజలకు కనిపించటం లేదేమో, అదేదో వాళ్లకు కనిపించేట్టు చేయండి మళ్ళీ వాళ్ళందరూ మీకే ఓటు వేస్తారు. అలా కాకుండా ప్రతిపక్షాన్ని నిందిస్తే వాళ్లకు ప్రచారం చేసినట్టే అవుతుంది తప్ప మీకు మీ పార్టీకి వచ్చేది ఏమి లేదు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నారు, బంగారు తెలంkcr-bjp;{#}gold;media;Party;CM;Bharatiya Janata Partyఅభివృద్ధి చేస్తే.. వ్యతిరేకత ఎందుకొచ్చింది కేసీఆర్ సారూ..!అభివృద్ధి చేస్తే.. వ్యతిరేకత ఎందుకొచ్చింది కేసీఆర్ సారూ..!kcr-bjp;{#}gold;media;Party;CM;Bharatiya Janata PartyTue, 09 Nov 2021 19:17:28 GMTతెలంగాణను ఎంతో అభివృద్ధి చేశాను అంటున్నాడు సీఎం కేసీఆర్. అలా చేస్తే ఈ వ్యతిరేకత ఎందుకు, మూడు సీట్లు బీజేపీ కైవసం ఎలా చేసుకుంది అంటారు సీఎం గారు. ముందు ఈ విషయంపై మీరు ఒక స్పష్టతకు వస్తే అనంతరం అన్ని కూడా అర్ధం అవుతాయి. ఒకవేళ ఇలా అయిఉండవచ్చు, మీరు చేసినా ప్రజలకు కనిపించటం లేదేమో, అదేదో వాళ్లకు కనిపించేట్టు చేయండి మళ్ళీ వాళ్ళందరూ మీకే ఓటు వేస్తారు. అలా కాకుండా ప్రతిపక్షాన్ని నిందిస్తే వాళ్లకు ప్రచారం చేసినట్టే అవుతుంది తప్ప మీకు మీ పార్టీకి వచ్చేది ఏమి లేదు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నారు, బంగారు తెలంగాణ తెస్తాను అన్నారు; తీరా మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కూడా అప్పులపాలు చేశారు.

కేవలం శాశ్వతమైన అభివృద్ధి నేను చేశాను, అవినీతికి పాల్పడలేదు అనేది మీ వాదన అయితే దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, కానీ ఇన్నాళ్లు ఎందుకు బీజేపీకి దాసోహం అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎదురు తిరగబడుతున్నారు. ఇప్పటికి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప, నిజాలు చెప్పి ప్రతిపక్షాన్ని ప్రజలకు దూరం చేయడంలేదు. నిన్నటి వరకు ప్రచారంలో బీజేపీ జాతీయ భావాన్ని తీసుకువస్తుంది అన్నారు, ఇప్పుడు మీరే జాతీయ విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదిగారా మీరు దిగజారారా అనేది ఒకసారి చూసుకోవాలి. అలా కాకుండా ఓడిపోయినందుకు మీడియా ముందుకు వచ్చి రంకెలు వేస్తె ప్రయోజనం ఏముంటుందో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీకు తెలిసిరాలేదా..!

ఇన్నాళ్లు అధికారం ఉందని ప్రజలను నిర్లక్ష్యం చేశారు కాబట్టే ఇప్పుడు అపజయాలపాలు అవుతున్నారు. కేవలం అధికార పార్టీ నిర్లక్ష్యం వలననే బీజేపీ రాష్ట్రంలో పాగా వేయగలిగింది. ఇప్పటికి తేరుకున్నారు అనుకోవడంలేదు, బీజేపీని నిందించడం కంటే, ఇప్పటికైనా ప్రజల కోసం నేనేమి చేయాలని ఆలోచన రావడం లేదు. అధికారం ఉండనే అహమే ఇంకా కనిపిస్తుంది తప్ప మరొకటి లేదు. ఇంకా కల్లబొల్లి మాటలు ప్రజలు వినే స్థితి లేదు. అదికూడా మీకు అర్ధం కావడంలేదు. అందుకే అప్పుడే ఫలితాలు తెలిసిపోతున్నాయి, తెలంగాణాలో బీజేపీ జండా ఖాయం.



పునీత్ లానే నేను కూడా.. గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం..!!

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>