MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli7700cb40-8105-4164-9ae9-3451651b1eea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli7700cb40-8105-4164-9ae9-3451651b1eea-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'ఆర్ఆర్ఆర్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సుమారు 450 కోట్లతో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరRajamouli{#}NTR;Ram Charan Teja;Alia Bhatt;ajay;Makar Sakranti;India;World Cup;Event;Director;Heart;Doctor;Kshanam;Darsakudu;Jr NTR;m m keeravani;Pawan Kalyan;January;Rajamouli;Cinema'RRR' డైలాగ్ ని లీక్ చేసిన రాజమౌళి.. ఆ డైలాగ్ ఏంటో తెలుసా..?2'RRR' డైలాగ్ ని లీక్ చేసిన రాజమౌళి.. ఆ డైలాగ్ ఏంటో తెలుసా..?2Rajamouli{#}NTR;Ram Charan Teja;Alia Bhatt;ajay;Makar Sakranti;India;World Cup;Event;Director;Heart;Doctor;Kshanam;Darsakudu;Jr NTR;m m keeravani;Pawan Kalyan;January;Rajamouli;CinemaTue, 09 Nov 2021 14:00:00 GMTబాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'ఆర్ఆర్ఆర్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సుమారు 450 కోట్లతో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అజయ్ దేవగన్,సముద్రఖని, శ్రీయా శరన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన 45 సెకన్ల నిడివి గల గ్లిమ్స్ వీడియో ప్రేక్షకుల్లో భారీ స్పందనను రాబట్టింది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోసారి ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా హైదరాబాద్లోని ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, క్రికెటర్ కపిల్ దేవ్, డాక్టర్ రవి తంగరాల పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.." కపిల్ దేవ్ పై ఉన్న తన ప్రేమను ముందుగా బయటపెట్టాడు. కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ లు తాను లైవ్లో చూడకపోయినా..

 అలా గాల్లో ఉన్న బంతిని కపిల్ దేవ్ క్యాచ్  అందుకున్న క్షణం తన గుండె ఆగిపోయినంత సంతోషము, ఉద్వేగం కలిగింది అని అన్నాడు. అయితే ఇదే సందర్భంలో కపిల్ దేవ్ గురించి చెబుతూ అనుకోకుండా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఓ డైలాగ్ ని అభిమానులతో పంచుకున్నాడు రాజమౌళి." నువ్వు చేసేది ధర్మయుద్ధం అయితే ఆ యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి" అనే డైలాగ్ను చెప్పాడు జక్కన్న. ఇక ఈ డైలాగ్ కి ఈవెంట్ లో అరుపులు, కేకలు వినిపించాయి.అయితే సినిమాలో ఈ డైలాగ్ ని ఎన్టీఆర్ తో పలికిస్తారా? లేక రామ్ చరణ్ తో పలికిస్తారా? అనే విషయాన్ని మాత్రం మాత్రం రాజమౌళి రివిల్ చేయలేదు. మరి అది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే...!!



బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సి బయటికి.. వెక్కి వెక్కి ఏడ్చిన షన్ను?

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

పెట్రోల్ రేట్లలో ఏపీ, తెలంగాణ ఎక్కడ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>