PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs8bf38cf8-8efb-44e5-b8ec-443f0cece086-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs8bf38cf8-8efb-44e5-b8ec-443f0cece086-415x250-IndiaHerald.jpgరాజ‌కీయంలో ప‌ద‌వులు శాశ్వ‌తం కావు అని అంటారు. ప‌దవులు వ‌చ్చినా రాకున్నా కూడా ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తామంటారు. రా జకీయంలో కులం చూడం మ‌తం చూడం అంటారు. మ‌తం ప్రాతిప‌దిక ఏద‌యినా ఉంటే త‌ప్ప‌క గ్ర‌హించి దానిని త‌మ అవ‌స‌రాల కు వాడుకుంటారు. కులం పేరిట రిజ‌ర్వేష‌న్ల కొట్లాట, కేటాయింపుల కొట్లాట ఉండ‌నే ఉంది. ఇంకేం కావాల‌? మ‌రి! తాజా రాజకీయంలో కొత్త మార్పు వ‌స్తోంది. trs{#}Research and Analysis Wing;Ministerతెలంగానం : అల్లుడూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌!తెలంగానం : అల్లుడూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌!trs{#}Research and Analysis Wing;MinisterTue, 09 Nov 2021 22:34:54 GMTరాజ‌కీయంలో ప‌ద‌వులు శాశ్వ‌తం కావు అని అంటారు. ప‌దవులు వ‌చ్చినా రాకున్నా కూడా ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తామంటారు. రా జకీయంలో కులం చూడం మ‌తం చూడం అంటారు. మ‌తం ప్రాతిప‌దిక ఏద‌యినా ఉంటే త‌ప్ప‌క గ్ర‌హించి దానిని త‌మ అవ‌స‌రాల కు వాడుకుంటారు. కులం పేరిట రిజ‌ర్వేష‌న్ల కొట్లాట, కేటాయింపుల కొట్లాట ఉండ‌నే ఉంది. ఇంకేం కావాల‌? మ‌రి! తాజా రాజకీయంలో కొత్త మార్పు వ‌స్తోంది. 


దీంతో తెలంగాణలో చాలా చాలా మార్పులు అనుబంధంగా చోటుచేసుకునే అవ‌కాశాలే ఎక్కువ. ఈ క్ర‌మంలో హ‌రీశ్ రావు (కేసీఆర్ అల్లుడు) కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఈటెల రాజేంద‌ర్ ఖాళీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ‌ను అప్ప‌గించి అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌మ‌ని ఆదేశాలు అందించారు కేసీఆర్. దీంతో తెలంగాణ‌లో ఎటువంటి సంస్క‌ర‌ణ‌లు అమ‌లు కానున్నాయో అన్న ఆస‌క్తి ఒక‌టి నెల‌కొని ఉంది. స‌మ‌ర్థ నాయ‌క‌త్వానికే కీల‌క ప‌దవి ఇవ్వ‌డంతో హ‌రీశ్ రావు వ‌ర్గంతో స‌హా ఇత‌ర వ‌ర్గాలు కూడా ఆనందాన్నే వ్య‌క్తీక‌రిస్తున్నాయి.

క‌రోనా స‌మ‌యంలో ఈటెల రాజేంద‌ర్ ఈ శాఖ‌ను నిర్వ‌ర్తించేవారు. అప్పుడు కూడా కేసీఆరే అన్నీ తానై న‌డిపి ప్రెస్మీట్ల‌లో ఏం చేయాలో ఏం చేయకూడ‌ద‌తో చెప్పారు. అందుకే ఈటెల ఓ సంద‌ర్భంలో  న‌న్ను మంత్రి గా చూడ‌క‌పోయినా ప‌ర్లేదు మ‌నిషిగా చూడ‌వ‌య్యా అని అభ్య‌ర్థించాన‌ని మ‌నోవేద‌నకు గురై భావోద్వేగాల‌ను వెల్ల‌డించారు. ఇప్పుడు హ‌రీశ్ రావు కూడా ఇలానే ఉంటారా లేదా స్వ‌తంత్ర రీతిలో నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉందా? ఎందుకంటే క‌రోనా త‌రువాత వైద్య ఆరోగ్య శాఖ అన్న‌ది కీల‌కంగా మారింది. ప్ర‌స్తుతానికి గండం గ‌ట్టెక్కినా ఇంకా ప్ర‌మాదం పొంచే ఉంది. ఈ త‌రుణాన కొత్త ఆస్ప‌త్రుల నిర్మాణం, పాత ఆస్ప‌త్రులలో మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న, ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌కు క‌నీస స్థాయిలో నిధుల కేటాయింపు, అదేవిధంగా సిబ్బంది నియామ‌కం ఇలా చాలా విష‌యాల్లో హ‌రీశ్ త‌న‌దైన నిర్ణ‌యాలు వెలువ‌రించాల్సి వ‌స్తుంది. రాజేంద‌ర్ లా కాకుండా త‌నంతట తాను నిర్ణ‌యాలు తీసుకునే స్థాయికి హ‌రీశ్ ఎద‌గాల‌నే ఆశిద్దాం.



తెలంగానం : అల్లుడూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌!

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>