PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-good-news-for-the-unemployed20f394e6-6e89-4f8f-b5da-683b255f1288-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-good-news-for-the-unemployed20f394e6-6e89-4f8f-b5da-683b255f1288-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న కేసీఆర్. మ‌రోసారి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌ మూడు రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న రైతుల‌కు మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కొనేంత వ‌ర‌కు కేంద్రంపై పోరాడుతాం అవ‌స‌ర‌మైతే వెంటాడి.. వేటాడుతాం.. అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఈ నెల 12 వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌నcm kcr{#}central government;CM;West Bengal - Kolkata;KCR;Bharatiya Janata Partyకేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?cm kcr{#}central government;CM;West Bengal - Kolkata;KCR;Bharatiya Janata PartyTue, 09 Nov 2021 10:12:31 GMTకేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న కేసీఆర్. మ‌రోసారి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌ మూడు రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న రైతుల‌కు మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని  తెలిపారు. తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కొనేంత వ‌ర‌కు కేంద్రంపై పోరాడుతాం అవ‌స‌ర‌మైతే వెంటాడి.. వేటాడుతాం.. అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఈ నెల 12 వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.


 దేశంలో అగ్గి రాజేస్తామ‌ని పేర్కొన్న కేసీఆర్ మాట‌ల‌తో మ‌రోసారి దేశ రాజ‌కీయాల్లో పాత్ర పోషించ‌డానికి ప్ర‌య‌త్నాలను కేసీఆర్ మొద‌లు పెట్టాడా అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. గ‌తంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన కేసీఆర్ ఆ విధంగా ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. కాంగ్రేస్ యేత‌ర‌, బీజేపీ యేత‌ర పార్టీల‌ను ఏకం చేసే దిశ‌గా పావులు క‌దిపారు కేసీఆర్‌. స‌మాఖ్య కూట‌మిని ఏర్పాటు చేసే దిశ‌గా ప‌లు రాష్ట్రాల నాయ‌కుల‌తో కూడా మాట్లాడారు.


ప‌శ్చిమ బెంగాల్ సీఎం, త‌మిళ‌నాడు సీఎం ఇలా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులను క‌లిసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. కానీ,  ఎన్నిక‌ల త‌రువాత ఆ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట ఎత్త‌లేదు కేసీఆర్‌. మ‌ళ్లీ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సీఏఏ (పౌర‌స‌త్వ చ‌ట్టం) కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన కేసీఆర్ మ‌రోసారి ఫెడ‌రల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్న‌ట్టు మాట్లాడారు. అవ‌స‌రం అయితే కాంగ్రెస్‌తో కూడా న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఈ ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌లేవ‌ని దీంతో కేసీఆర్ మ‌ళ్లీ వెనుక‌డుగు వేశారు.



 ఇప్పుడు కేంద్రంపై పోరాడుతాం వెంటాడుతాం వేటాడుతాం అంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌తో మ‌ళ్లీ కేసీఆర్ ఫెడ‌రల్ ఫ్రెంట్ దిశగా అడుగులు వేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా దేశ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ అడుగు పెడుతారనే వార్త‌లు వ‌స్తున్న క్ర‌మంలో కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై మాట్లాడుతున్న మాట‌ల తీరును చూస్తే మున్ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌నే ఆసక్తి నెల‌కొంది.


   

   



రాత్రయితే నాకు అదే పని.. అసలు విషయం చెప్పేసిన బాలయ్య?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !

ర్యాంకులు పడిపోనాయ్.. ఏటి సేత్తాం..

సునీల్ లుక్ పై సెటైర్లు !

నేడు పాత‌ప‌ట్నం, ఒడిశాకు సీఎం వైఎస్‌ జగన్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>