PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpgమొదట నుంచి కుప్పం టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న వైసీపీ చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఎలాగైనా గెలవాలనే విధంగా వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతా తానై చూసుకుంటూ, కుప్పంలో వైసీపీ జెండా పాతేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగేలా చూసుకుంటున్నారు. ఎలా గెలిచామన్నది కాదు....గెలిచామా లేదా అన్నట్లుగా వైసీపీ ముందుకెళుతుంది. ఎలాగో పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ పైచేయి సాధిkuppam ysrcp{#}Cheque;local language;Venkatesh;kuppam;Minister;YCP;TDPకుప్పంలో అనుకున్నది సాధించిన వైసీపీ...?కుప్పంలో అనుకున్నది సాధించిన వైసీపీ...?kuppam ysrcp{#}Cheque;local language;Venkatesh;kuppam;Minister;YCP;TDPTue, 09 Nov 2021 11:55:00 GMTమొదట నుంచి కుప్పం టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న వైసీపీ చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఎలాగైనా గెలవాలనే విధంగా వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతా తానై చూసుకుంటూ, కుప్పంలో వైసీపీ జెండా పాతేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగేలా చూసుకుంటున్నారు. ఎలా గెలిచామన్నది కాదు....గెలిచామా లేదా అన్నట్లుగా వైసీపీ ముందుకెళుతుంది. ఎలాగో పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ పైచేయి సాధించింది.

ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా వైసీపీ ముందుకెళుతుంది. ప్రజల మద్ధతుతో గెలిస్తే ఎలాటి ఇబ్బంది ఉండదు...కానీ ప్రజల కంటే ముందే తాము ఏకగ్రీవం అయిపోవాలని వైసీపీ ట్రై చేస్తుంది. అందులో భాగంగా వైసీపీ అనుకున్నది సాధించింది. ఒక వార్డుని ఏకగ్రీవం చేసుకుంది. అంటే కుప్పంలో ఒక వార్డు ఏకగ్రీవం కావడం అనేది మామూలు విషయం కాదనే చెప్పాలి. అయితే వైసీపీ ముందు నుంచి 14వ వార్డుపైనే ఫోకస్ చేసింది. అక్కడ టీడీపీ తరుపున బరిలో దిగిన వెంకటేష్ నామినేషన్ పత్రాలు చించివేశారు.

ఎలాగోలా చివరి నిమిషంలో ఆయన నామినేషన్ వేశారు. అయినా సరే నామినేషన్ రిజెక్ట్ చేశారు. దీంతో టీడీపీ నుంచి డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ప్రకాశ్ నామినేషన్ ఓకే అయింది. దీంతో ప్రకాశ్ బరిలో ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నారని, 14వ వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయిందని అధికారులు ప్రకటించారు. అసలు ఆయన ఉపసంహరించుకోవడానికే వెళ్లలేదు....అయితే అధికారులే ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఏకగ్రీవం చేసేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పైగా నామినేషన్ల ఉపసంహరణ సమయం అయిపోయినా సరే అధికారులు వెంటనే పోటీలో ఉన్న అభ్యర్ధులని ప్రకటించలేదు. ఎప్పటికో అభ్యర్ధులని ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కుప్పంలో వైసీపీ అనుకున్నది సాధించింది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు ఇక్క‌డ పెద్ద ర‌చ్చ త‌ప్పేలా లేదు.

 



అందరూ మోసం చేసారు, రేవంత్ రెడ్డి ఆవేదన...!

బిగ్ బాస్ 5లో.. వేడి రాజుకుంది?

సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>