PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/padma-awards149fccf9-7e93-4c21-a8b9-e4e19425fd04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/padma-awards149fccf9-7e93-4c21-a8b9-e4e19425fd04-415x250-IndiaHerald.jpg భారత రాష్ట్ర పతి రామనాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రధానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను ఆయన ప్రముఖులకు అందజేశారు. ఇందులో విశేషం ఏ ముంది? భారత్ లో వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులు అందజేయడం ఆనవాయితి. కాదు ఈ దఫా కూడా అవార్డుల ప్రధానం విమర్శలకు తావిచ్చింది. అవేంటో చూద్దాం.padma awards{#}Arun;Goa;India;Arun Jaitley;Sushma Swaraj;2020;central government;Husband;monday;Government;Party;Bharatiya Janata Partyపద్మ అవార్డులకు రాజకీయ సుగంధంపద్మ అవార్డులకు రాజకీయ సుగంధంpadma awards{#}Arun;Goa;India;Arun Jaitley;Sushma Swaraj;2020;central government;Husband;monday;Government;Party;Bharatiya Janata PartyTue, 09 Nov 2021 14:01:59 GMT
భారత రాష్ట్ర పతి రామనాథ్ కోవింద్   పద్మ అవార్డులను ప్రధానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను ఆయన ప్రముఖులకు అందజేశారు. భారత్ లో వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారికి  కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులు అందజేయడం ఆనవాయితి.  ఈ ఏడాది పద్మ అవార్డులు కూడా ఎప్పటి లాగానే రాజకీయ సుగంధాన్ని వెదజల్లాయని అపవాదను మూట గట్టుకున్నాయి. ప్రముఖులను గుర్తించి సత్కరించడం ద్వారా ప్రభుత్వం తనను తాను సత్కరించుకుంటుందని గతంలో చాలా సందర్భాలలో వెల్లడయింది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా పద్మ అవార్డులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. దీంతో నిబద్ధత కలిగిన వారు  తమకు  అందజేసే అవార్డులను తిరస్కరించారు. మరి కొందరు తాము అవార్డును తీసుకున్న తరువాత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వాటిని ప్రభుత్వానికి తిరిగి పంపించారు. ఇలా  గత కొన్ని సంవత్సరాలుగా పద్మ అవార్డులు  అపవాదును మూటగట్టుకున్నాయి.  సోమవారం రాష్ట్రపతి అందజేసిన పద్మ అవార్డులలో భారతీయ జనతా పార్టీకి  రాజకీయంగా సేవలందించిన వారు ముగ్గురున్నారు. అయితే వారి రాజకీయ జీవితం లో పెద్ద గా చెప్పుకో త్గ్గ విమర్శనాత్మక మచ్చ లేవీ లేక పోవడం ఒకింత మేలు చేసే అంశం. దీవంగతులైన ముగ్గురు బిజేపి నేతలకు పద్మ అవార్డులు లభించాయి. వారి కుటుంబ సభ్యులు  ఈ అవార్డును అందుకున్నారు. ఇది విమర్శలకు తావిచ్చింది. విమర్శలు ఎంత మేర, ఎంత ఘాటు గా ఉన్నాయన్న విషయాన్ని కాస్త పక్కన పెడదాం. మాజీ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్ , అరుణ్ జైట్లీ లకు పద్మ విభూషన్ లభించింది. మరణానంతరం వీరికి అవార్డులు దక్కాయి. వీరిద్దరూ  భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నది నిర్వివాదాంశం. కేంద్ర ఆర్థిక , రక్షణ శాఖల మంత్రిగా అరుణ్ జైట్లీ పని చేశారు. ఇక సుష్మా స్వరాజ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు.
వీరితో పాటు పద్మ అవార్డు అందుకున్న  మరో బిజేపి నేత మనోహర్ పారికర్. ఈయన కూడా కేంద్ర మంత్రిగా పని చేశారు. గోవా ముఖ్యమంత్రిగా చివరి శ్వాస వరకూ పనిచేశారు.  ఈయన చేసిన సేవలకు గుర్తుగా పద్మభూషన్ పురస్కారాన్ని అందజేశారు. మరణానంతరం పద్మ అవార్డులు దక్కించు కున్న మరో నేత జార్జి ఫెర్నాండేజ్.  రైల్వే శాఖ మాజీ మంత్రి. బారతీయ జనతా పార్టీ భావజాలం కానీ, మూలాలు కానీ ఏ మాత్రం లేని వ్యక్తి.  మరి ఈయనకు ఎందుకు  పద్మ అవార్టు లభించిందనుకుంటున్నారా ? ఈయన మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయికి  అత్యంత సన్నిహితుగా రాజకీయ వర్గాలలో పేరుంది.  ఏది ఏమైనా  నలుగురు పేరెన్నిక గన్న రాజకీయ వేత్తలకు మరణానంతరం పద్మ అవార్డులు అందజేయడం విమర్శకుల కలానికి పదును పెట్టినట్లయింది.



ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

పెట్రోల్ రేట్లలో ఏపీ, తెలంగాణ ఎక్కడ..?

విలన్ గా అడుగులు వేస్తున్న అది పినిశెట్టి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>