PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jai-bheem-movie-6dc08018-51a0-41f1-ba63-160c1625a9cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jai-bheem-movie-6dc08018-51a0-41f1-ba63-160c1625a9cb-415x250-IndiaHerald.jpgడ‌బ్బులుంటే మంచి సినిమాలే వ‌స్తాయి అని గ్యారెంటీ లేదు. లాయ‌ర్ చంద్రు జీవితమే జై భీమ్ సినిమాగా రూపుదిద్దుకుంటుంద‌న్న న‌మ్మ‌క‌మూ లేదు. కానీ సూర్య, జ్యోతిక ఓ యువ‌తి పోరాటాన్ని అందుకు అండ‌గా నిలిచిన లాయ‌ర్ జీవితాన్ని ప‌ట్టి తెచ్చారు. గిరిజ‌న జీవితాల్లో వ్య‌థ‌ల‌ను తెర‌పైకి తెచ్చారు జ్ఞాన్ వేల్ అనే డైరెక్ట‌ర్. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సంచ‌ల‌నం. సినిమా ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం. నిజజీవితాల్లో ఉన్నంత మ‌నం తెలుసుకోద‌గినంత విషాదం అంతా సినిమాలో ఉంది. అందుకే బాధిత కుటుంబానికి తాను సాయం చేస్తాన‌ని డైరెక్ట‌ర్ లారjai bheem movie {#}jyothika;raghava lawrence;Chittoor;CPI;Manam;Yuva;Komaram Bheem;House;police;Cinemaజై భీమ్ చూసి సీపీఐ నారాయణ ఏమన్నడంటే?జై భీమ్ చూసి సీపీఐ నారాయణ ఏమన్నడంటే?jai bheem movie {#}jyothika;raghava lawrence;Chittoor;CPI;Manam;Yuva;Komaram Bheem;House;police;CinemaTue, 09 Nov 2021 16:50:11 GMTడ‌బ్బులుంటే మంచి సినిమాలే వ‌స్తాయి అని గ్యారెంటీ లేదు. లాయ‌ర్ చంద్రు జీవితమే జై భీమ్ సినిమాగా రూపుదిద్దుకుంటుంద‌న్న న‌మ్మ‌క‌మూ లేదు. కానీ సూర్య, జ్యోతిక ఓ యువ‌తి పోరాటాన్ని అందుకు అండ‌గా నిలిచిన లాయ‌ర్ జీవితాన్ని ప‌ట్టి తెచ్చారు. గిరిజ‌న జీవితాల్లో వ్య‌థ‌ల‌ను తెర‌పైకి తెచ్చారు జ్ఞాన్ వేల్ అనే డైరెక్ట‌ర్. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సంచ‌ల‌నం. సినిమా ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం. నిజజీవితాల్లో ఉన్నంత మ‌నం తెలుసుకోద‌గినంత  విషాదం అంతా సినిమాలో ఉంది. అందుకే బాధిత కుటుంబానికి  తాను సాయం చేస్తాన‌ని డైరెక్ట‌ర్ లారెన్స్ ముందుకు వ‌చ్చారు. పార్వ‌తి (రియ‌ల్ సిన‌త‌ల్లి)కు ఇల్లు క‌ట్టించి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇంకా ఎంద‌రెంద‌రో ఈ సినిమా చూసి చ‌లించి పోతున్నారు. 


న్యాయ పోరాటాల కార‌ణంగా ఊరూ పేరూ కొట్టుకు పోయిన ఎంతో మంది వ్య‌థ‌లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప‌నిచేసే న్యాయ‌వాదుల జీవితాల గురించి ఇప్పుడిప్పుడే వెతుకులాట మొద‌ల‌యింది. ఈ క్ర‌మంలో జై భీమ్ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయింది. అణ‌గారిన వర్గాల అవ‌స్థ‌లు ప‌ట్టి ఇచ్చింది.



పోలీసు వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంచి ఏద‌యినా మాట్లాడాల్సి వ‌స్తే అప్పుడు మాత్రం మ‌న‌కు అనుమానాలు వ‌స్తాయి. స‌మాజంలో ఉన్న అస‌మాన‌త‌లు అన్నీ ఒక్క‌సారిగా క‌ళ్లెదుటే క‌న‌ప‌డ‌తాయి. ఊహ‌కు కూడా అంద‌ని ఘ‌ట‌న‌లే క‌ళ్లెదుట సాక్షాత్క‌రిస్తాయి. న్యాయం కోసం పోరాడే క్ర‌మంలో మ‌న‌కు అవ‌మానాలే ఎదురవుతాయి. ఓ బాధితురాలి పోరాటం నుంచి ఓ బాధితురాలి దుఃఖం నుంచి మ‌నం నేర్చుకోవాల్సినంత నేర్చుకోక‌పోవ‌డ‌మే అస‌లు అవివేకం. జై భీమ్ సినిమా వ్య‌వ‌స్థ‌ల్లో ఉన్న డొల్ల‌త‌నాన్ని చాటింది. పోలీసు వ్య‌వ‌స్థ‌లో ఉన్న డొల్ల‌త‌నాన్నీ చాటింది. ఎప్పుడో జ‌రిగిన ఓ ఘ‌టన ఈ సినిమాకు ఆధారం కానీ అది మ‌నిషిని ఉన్న చోట ఉండ‌నీయ‌ని ఘ‌ట‌న. జై భీమ్ సినిమా అన్న‌ది వ్య‌వ‌స్థ‌ల్లో మార్పునకు స‌హ‌క‌రిస్తుందా లేదా అన్న‌ది త‌రువాత క‌నీసం మనం ఆ మార్పున‌కు ఏ విధం అయిన ప్ర‌య‌త్నం చేస్తున్నామా లేదా అన్న‌దే ముఖ్యం. జై భీమ్ సినిమా చూసి వ‌చ్చాక సీపీఐ నారాయ‌ణ చ‌లించిపోయారు. ఇలాంటి సినిమా తీసిన వాస్త‌విక ఘ‌ట‌న‌లతో కూడిన సినిమా తీసిన చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌ను అభినందించారు. 37 ఏళ్ల కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న‌లు కొన్ని త‌ల్చుకున్నారు. చిత్తూరు సీపీఐ కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న‌లు త‌లుచుకు న్నారు. యువ న్యాయవాదుల బాధ్య‌త‌ను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంద‌ని కితాబిచ్చారు.



విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ.1001 బహుమతి..?

హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

మా గుప్పిట్లో ఉన్నారు..ముర‌ళీధ‌ర్‌రావు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ఇంటర్ సిలబస్ పై 30 శాతం తగ్గింపు..!!

టీ-20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?

విశాఖ మన్యంలో మావోల అలజడి! జగనన్నకు వార్నింగ్ !

ఈఎంఐ ఆఫర్లో విమాన టికెట్.. త్వరపడండి?

నాని శ్యామ్ సింగరాయ్ బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>