PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-e20ee008-932b-4853-be11-07e8af9fd551-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-e20ee008-932b-4853-be11-07e8af9fd551-415x250-IndiaHerald.jpgనగర పంచాయతీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిందట. బేతంచెర్ల మంత్రి సొంత ఊరు కావడంతో ఫలితాల పై ఆసక్తి నెలకొంది. వీలైతే ఏకగ్రీవం కాకుంటే అధిక వార్డులను గెలుపొంది చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు బుగ్గన వ్యూహం సిద్ధం చేశారని తెలుస్తోంది. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికైనా మంత్రి బుగ్గన ప్రతిష్టకు సంబంధించింది. ఈ ఎన్నికలో అధిక వార్డులు గెలుపొందడం ద్వారా మంత్రి పై పై చేయి సాధించడం కోసం టిడిపి ప్రయత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కి ఒక్క వార్డు దక్కకుండా తన పట్టు నిలుపుకోవాలని బుగ్గన ప్రయత్నిస్తున్నారు. బేతంచెర్ల Political {#}Panchayati;Buggana Rajendranath Reddy;local language;Reddy;Minister;Kurnool;MLA;TDP;YCPటీడీపీ వ్యూహం.. బుగ్గనకు సవాల్ గా మారనుందా..?టీడీపీ వ్యూహం.. బుగ్గనకు సవాల్ గా మారనుందా..?Political {#}Panchayati;Buggana Rajendranath Reddy;local language;Reddy;Minister;Kurnool;MLA;TDP;YCPTue, 09 Nov 2021 21:50:00 GMTఏపీ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్  రెడ్డి కి సొంత నియోజకవర్గంలో నగర పంచాయతీ ఎన్నిక పరీక్షగా మారిందా? పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీల్లో అత్యధిక శాతం ఏకగ్రీవం చేసుకున్న బుగ్గన సొంత ఊరు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కర్నూలు  జిల్లాడోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. బుగ్గన హయాంలోనే పంచాయతీ నుంచి నగర పంచాయతీ హోదాకు వచ్చింది. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకున్న మంత్రి బుగ్గన కు తన సొంత ఊరు బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు  ఏకగ్రీవం కష్టం అయిందట. డోన్ నియోజకవర్గంలో మొత్తం సర్పంచులు 81 మంది ఉండగా, వైసిపి మద్దతుదారులు 37 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు.

జడ్పిటిసి స్థానాలు 3 ఉండగా వాటన్నింటినీ వైసిపి ఏకగ్రీవంగా దక్కించుకుంది. 54 ఎంపీటీసీల్లో 49  ఎంపీటీసీలు ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. డోన్ మున్సిపాలిటీలోని మొత్తం వార్డులు 32 ఉండగా.. వైసిపి ఏకగ్రీవంగా 25 కౌన్సిలర్ల స్థానలను దక్కించుకుంది. అయితే బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఏకగ్రీవం  సాధ్యం అయ్యే పరిస్థితి లేదట. ఇక గత ఎన్నికల అనుభవాలతో టిడిపి ఈసారి ముందే జాగ్రత్త పడింది. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలపై టిడిపి ప్రత్యేక దృష్టి సారించిదట. నగర పంచాయతీ లో ఏ ఒక్క వార్డు ఏకగ్రీవం కాకుండా జాగ్రత్తలు తీసుకుందట. డోన్ నియోజకవర్గానికి ఇంఛార్జిగా  ధర్మారం సుబ్బారెడ్డిని నియమించి బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నిక బాధ్యతను అప్పగించిందని టాక్. బేతంచెర్ల లో 20 వార్డులు ఉండగా ప్రతి వార్డులో ఒకరి కంటే ఎక్కువ మంది  అభ్యర్థులతో నామినేషన్ వేయించిందట టిడిపి. నామినేషన్ వేసిన వారిపై ఒత్తిడి తెచ్చి ఉపసంహరింప చేస్తారని వారిని స్థానికంగా లేకుండా కుటుంబాలతో సహా క్యాంపు పంపిందట. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వారు తిరిగి వచ్చి ప్రచారం చేసేలా వ్యూహం పన్నింది టిడిపి. ప్రతి వార్డుకు మాజీ ఎమ్మెల్యే లను ఇన్చార్జీలు గా నియమించిందట. టిడిపి అభ్యర్థుల్లో బుగ్గన సమీప బంధువులు కూడా ఉన్నారు. ఏకగ్రీవం కాకుండా చూడడం తో పాటు బేతంచర్ల లో ఎక్కువ వార్డులను గెలవాలని టీడీపీ అధిష్టానం ఆదేశించిందట. టిడిపి వ్యూహంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  కి బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిందట. బేతంచెర్ల మంత్రి సొంత ఊరు కావడంతో ఫలితాల పై ఆసక్తి నెలకొంది. వీలైతే ఏకగ్రీవం కాకుంటే అధిక వార్డులను గెలుపొంది చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు బుగ్గన వ్యూహం సిద్ధం చేశారని తెలుస్తోంది. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికైనా మంత్రి బుగ్గన ప్రతిష్టకు సంబంధించింది. ఈ ఎన్నికలో అధిక వార్డులు గెలుపొందడం ద్వారా మంత్రి పై పై చేయి సాధించడం కోసం టిడిపి ప్రయత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కి ఒక్క వార్డు దక్కకుండా తన పట్టు నిలుపుకోవాలని బుగ్గన ప్రయత్నిస్తున్నారు. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నిక మంత్రి బుగ్గన ప్రతిష్ఠను నిలుపుతుందో లేదో చూడాలి.



టీడీపీ వ్యూహం.. బుగ్గనకు సవాల్ గా మారనుందా..?

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>