PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tention-in-ap-employees-about-prc975ac5af-0e69-4f31-b87f-e456fcf2bab4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tention-in-ap-employees-about-prc975ac5af-0e69-4f31-b87f-e456fcf2bab4-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పీఆర్‌సీపై కూడా హామీలిచ్చారు. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచింది. కానీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా employees{#}Yatra;Adhugo;Congress;Y. S. Rajasekhara Reddy;Government;Partyపీఆర్‌సీ నివేదికపై ఉద్యోగుల వార్నింగ్..!పీఆర్‌సీ నివేదికపై ఉద్యోగుల వార్నింగ్..!employees{#}Yatra;Adhugo;Congress;Y. S. Rajasekhara Reddy;Government;PartyTue, 09 Nov 2021 18:32:22 GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పీఆర్‌సీపై కూడా హామీలిచ్చారు. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచింది. కానీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా ఇదే విషయంపై చర్చించారు ఉద్యోగ సంఘాల నేతలు. రెండు రోజుల్లో పీఆర్‌సీ నివేదిక ఇస్తామని ప్రధాన కార్యదర్శి నేతలకు హామీ కూడా ఇచ్చారు. కానీ పది రోజులు గడిచినప్పటికీ... ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక రాలేదు. ఇదే విషయంపై ఉద్యోగులు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్‌సీ నివేదికపై ప్రభుత్వానికి ఉద్యోగులు డెడ్ లైన్ విధించారు. రేపటి లోగా తప్పనిసరిగా నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలా ఇవ్వకపోతే... భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. జీతాలు, పెన్షన్లు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి. దీనిపై ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్‌సీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. నివేదిక కోసం కూడా ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇదే సమయంలో నివేదిక ఇదుగో అదుగో అంటూ ప్రభుత్వం లీకులు ఇస్తోంది. దీనితో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు... ఇక తమకు ఓపిక లేదని తేల్చి చెప్పేశాయి. అసలు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందా లేదా అని డిమాండ్ చేస్తున్నాయి. నివేదిక ఇస్తే... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచొచ్చనేది ప్రభుత్వ ఉద్యోగుల భావన. తాము ఎప్పుడు అడిగినా... పీఆర్‌సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందనే సమాధానమే వస్తుందని... ఇలా ఎంత కాలం కాలయాపన చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.



కేటిఆర్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదా

హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

మా గుప్పిట్లో ఉన్నారు..ముర‌ళీధ‌ర్‌రావు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ఇంటర్ సిలబస్ పై 30 శాతం తగ్గింపు..!!

టీ-20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>