PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs1620ebd4-fb19-4f6a-a458-56055a7bb27f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs1620ebd4-fb19-4f6a-a458-56055a7bb27f-415x250-IndiaHerald.jpgఎక్క‌డా తొణ‌కకుండా, బెణ‌కకుండా ధాన్యం కొనుగోలు మొద‌లుకుని విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటు వ‌ర‌కూ, పెట్రో ధ‌ర‌లు మొద‌లుకుని విభ‌జ‌న చ‌ట్టం వ‌ర‌కూ ఆయ‌న అన్నింటిపై అన‌ర్గ‌ళంగా మాట్లాడారు. తాను చెప్పినా కూడా కేంద్రం విన‌డం లేద‌ని తేల్చేశారు. కొన్ని విష‌యాల్లో ఈ పాపం కేంద్రందే అని కూడా స్ప‌ష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు త‌రువాత కేంద్రానికి విద్యా సంబంధ విష‌యాలు విన్న‌వించాన‌ని జిల్లాకో న‌వోద‌య పాఠ‌శాల ఏర్పాటు చేయాల‌ని కోరుకున్నాన‌ని కానీ అవేవీ జ‌ర‌గ‌లేద‌ని వాపోయారు. ఇదే స‌మ‌యంలో పెట్రో సెస్సుల‌పై కూడా trs{#}electricity;oil;media;Huzurabad;Bharatiya Janata Party;Telangana;KCRకేసీఆర్ టాక్స్ : టచ్ చేసి చూడు ఆహా ఏమన్నడ్రా!కేసీఆర్ టాక్స్ : టచ్ చేసి చూడు ఆహా ఏమన్నడ్రా!trs{#}electricity;oil;media;Huzurabad;Bharatiya Janata Party;Telangana;KCRMon, 08 Nov 2021 12:42:24 GMT
హుజురాబాద్ ఎన్నిక‌లు అయిపోయాక కేసీఆర్ మేల్కొన్నాడు. ఆ మాట‌కు వ‌స్తే ఆయ‌న మేల్కొన్నా మేల్కొన‌క‌పోయినా కూడా అక్క‌డ గెలిచేది ఈటెల రాజేంద‌రే! కానీ ఇంత‌కాలం తెలంగాణ నేల‌పై ఏక‌ఛ‌త్రాధిప‌త్యం సాగిస్తున్న కేసీఆర్ కు మొన్న‌టి ఎన్నిక‌ల ఫలితాలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. వ‌రుస వైఫ‌ల్యాలు ఆయ‌న‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. దుబ్బాక ఓట‌మి నుంచి తేరుకున్నాక మ‌ళ్లీ హుజురాబాద్ ఎన్నిక‌లు ఆయ‌న‌కు అవే ఫ‌లితాలు ఇచ్చాయి. దీంతో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న త‌రుణంలో ఎలా అయినా దెబ్బ తీయాల‌న్న సంక‌ల్పంలో భాగంగా నిన్న‌టి మీడియా మీట్ ను చాలా చక్క‌గా త‌న‌కు అనుగుణంగా వాడుకున్నారు.

 
ఎక్క‌డా తొణ‌కకుండా, బెణ‌కకుండా ధాన్యం కొనుగోలు మొద‌లుకుని విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటు వ‌ర‌కూ, పెట్రో ధ‌ర‌లు మొద‌లుకుని విభ‌జ‌న చ‌ట్టం వ‌ర‌కూ  ఆయ‌న అన్నింటిపై అన‌ర్గ‌ళంగా మాట్లాడారు. తాను చెప్పినా కూడా కేంద్రం విన‌డం లేద‌ని తేల్చేశారు. కొన్ని విష‌యాల్లో ఈ పాపం కేంద్రందే అని కూడా స్ప‌ష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు త‌రువాత కేంద్రానికి విద్యా సంబంధ విష‌యాలు విన్న‌వించాన‌ని జిల్లాకో న‌వోద‌య పాఠ‌శాల ఏర్పాటు చేయాల‌ని కోరుకున్నాన‌ని కానీ అవేవీ జ‌ర‌గ‌లేద‌ని వాపోయారు. ఇదే స‌మ‌యంలో పెట్రో సెస్సుల‌పై కూడా పూర్తి స్థాయిలో త‌న‌దైన వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ప‌న్నుల‌ను పెంచ‌లేద‌ని, సెస్సుల ద్వారా పిండుతున్న‌ది కేంద్ర‌మేన‌ని  సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. ఇవ‌న్నీ ఆయ‌న వైపు నుంచి బాగానే ఉన్నా, ఆయ‌న త‌ర‌ఫు మ‌నుషుల‌కు ఇవి సబ‌బే అనిపించినా, స‌హేతుకంగా వినిపించినా అస‌లు వాస్త‌వం ఏంటి?



పెట్రో ధ‌ర‌ల‌కు సంబంధించి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ ఎంత..అందులో త‌గ్గించుకోద‌గ్గ‌ది ఎంత అన్న‌ది ఆయ‌న ప‌రిధిలో అయినా చెబితే బాగుండు. సెస్సుల రూపంలో పిండుకుంటున్నార‌ని చెబుతున్నారు ఇంత కాలం సెస్సులు వ‌సూలు చేసేలా స‌హ‌క‌రించిం ది ఎవ‌రు? ఇప్పుడే ఎందుకు సెస్స‌లు త‌క్ష‌ణ‌మే విత్ డ్రా చేసుకోవాల‌ని అంటున్నారు? వీట‌న్నింటిపై కేసీఆర్ మాట్లాడాలి కానీ ఆయ‌న వాక్చాతుర్యంతో  నెగ్గుకు వ‌చ్చే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. త‌క్ష‌ణ‌మే సెస్సులు విత్ డ్రా చేసుకుంటే రాష్ట్రం మాదిరిగానే కేంద్రం కూడా పూర్తిగా సంక్షోభంలోకి పోతోంది. అప్పుడు  కేంద్రం చేసిన అప్పుల వాటా కూడా పెరిగిపోతోంది. ఉన్న ప‌ళాన సెస్సులు త‌గ్గించుకోవ‌డం సాధ్యం కానీ విడ‌త‌ల విడ‌త‌ల గా అయినా కేంద్రం ఈ భారాన్ని వినియోగ‌దారుల‌పై వేయ‌కుండా  నిర్ణ‌యాలు వెలువ‌రిస్తే చాలు. అంత‌ర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెరుగుద‌ల లేక‌పోగా త‌గ్గుద‌ల ఉంద‌న్న‌ది వాస్త‌వం కనుక ద‌ఫ‌ద‌ఫాలుగా అయినా కేంద్రం త‌న ప‌రిధిలో ఉన్న సెస్సులు త‌గ్గిస్తే ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గిస్తే రాష్ట్రాలు కూడా అదే బాట‌న వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం త‌న ప‌రిధిలో ఉన్న ప‌న్నులు ఏవీ పెంచ‌లేద‌నే చెబుతున్నాడు. ఇదే క్ర‌మంలో బీజేపీ ప‌రిధిలో ఉన్న నిర్ణ‌యాల వెంట వెంట‌నే అమలు చేస్తే లీట‌రు పెట్రో ధ‌ర 70 రూపాయ‌ల‌కే వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ పూర్తిగా కేంద్రాన్ని ఇర‌కాటంలో ఉంచి త‌న‌ను ఉద్దేశించి మాట్లాడేవారంతా త‌న‌ను ట‌చ్ చేసి చూడాల‌ని ఆ త‌రువాత ఏమౌతుందో అంద‌రికీ అర్థం అవుతుంద‌ని స‌వాలు విసిరారు.



ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ప‌ద్మ‌విభూష‌ణ్

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>