Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rabishashtrifa6e4b38-b7dc-4920-9d05-300adfd27f93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rabishashtrifa6e4b38-b7dc-4920-9d05-300adfd27f93-415x250-IndiaHerald.jpgరవి శాస్త్రి.. ఒకప్పుడు టీమిండియాలో ఎన్నో రోజుల పాటు సేవలందించి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ క్రికెటర్ ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత అప్పట్లో టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లే విరాట్ కోహ్లి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అంటూ ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న అంటూ అనిల్ కుంబ్లే చెప్పటం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత మళ్ళీ అనిల్ కుంబ్లేను తీసుకRabishashtri{#}anil music;rahul;Ahmedabad;Rahul Sipligunj;Application;ravi shastri;ICC T20;VIRAT KOHLI;ravi anchor;BCCI;Indiaమళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?Rabishashtri{#}anil music;rahul;Ahmedabad;Rahul Sipligunj;Application;ravi shastri;ICC T20;VIRAT KOHLI;ravi anchor;BCCI;IndiaMon, 08 Nov 2021 15:38:07 GMTరవి శాస్త్రి.. ఒకప్పుడు టీమిండియాలో ఎన్నో రోజుల పాటు సేవలందించి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ క్రికెటర్ ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత అప్పట్లో టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లే విరాట్ కోహ్లి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అంటూ ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న   అంటూ అనిల్ కుంబ్లే చెప్పటం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత మళ్ళీ అనిల్ కుంబ్లేను తీసుకోవాలని బిసిసిఐ భావించినప్పటికీ అటు అనిల్ కుంబ్లే మాత్రం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోక పోవడం గమనార్హం  ఈ క్రమంలోనే ఇక రవిశాస్త్రి టీమిండియాకు కోచ్గా నియమింపబడ్డాడు.


 ఇక టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా కొనసాగగా అటు రవిశాస్త్రి కూడా టీమిండియా ఫార్మాట్లలో హెడ్ కోచ్గా   కొనసాగారు.అయితే ఇటీవలే రవి శాస్త్రి హెడ్ కోచ్ పదవీకాలం ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 వరల్డ్ కప్లో నేడు నమీబియాలో జరగబోయే మ్యాచ్ లో విరాట్ కోహ్లీకెప్టెన్సీకి స్వస్తి పలుకుతూ ఉండగా ఇక నేడు జరగబోయే మ్యాచ్లోనే రవి శాస్త్రీ హెడ్ కోచ్  పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియాకు తర్వాత హెడ్ కోచ్గా ఇక రాహుల్ ద్రావిడ్ ను నియమించాలి అని భావించింది బీసీసీఐ.


 అయితే ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోబోతున్న రవిశాస్త్రి మరోసారి కామెంటేటర్గా అలరించబోతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ రవిశాస్త్రి మరోసారి కోచ్ పదవి చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి టీమిండియాకు కాదు ఐపీఎల్ టీమ్ కు కోచ్గా వ్యవహరించ పోతున్నాడట రవి శాస్త్రి. ఇటీవల ఐపీఎల్ లోకి అడుగు పెట్టిన కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ కోసం రవి శాస్త్రి తోపాటు టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ కోచ్ లను కూడా జట్టు యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇక అహ్మదాబాద్ జట్టు హెడ్ కోచ్ గా ఉండేందుకు  రవి శాస్త్రి ఒప్పుకుంటాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



బాబుకు మళ్ళీ ఈజీ కాదు...వాళ్ళు జగన్ వైపే...?

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"నువ్వు మీ నాన్నను మించిపోతావు రా".. బన్నీ కొడుకు దేశముద్దురే..!!

సోష‌ల్ వార్ : దాక్కో దాక్కో కేసీఆర్ ?

కేంద్రానికి వైసీపీ ఎంపీ సపోర్ట్...?

పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ విధించ‌లేదా..? బండి సంజ‌య్

కెసిఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>