BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4e8c3fba-5d14-4501-9fae-aedd9a8d1f26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4e8c3fba-5d14-4501-9fae-aedd9a8d1f26-415x250-IndiaHerald.jpgచలికాలంలో చర్మ సంరక్షణకు సరైన చిట్కాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు సరిపోయే దుస్తులు మాత్రమే ధరించాలి. పొడి వాతావరణం అనేది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇంకా శరీరంలోని తేమను కూడా లాగేస్తుంది. చర్మం అంతా కూడా పొడిగా మారి, తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే.. క్రీమ్‌లా ఉండే క్లేన్సర్‌ని ఎంపిక చేసుకోవాలి. నురుగుతో కూడిన ఫేస్‌ వాష్‌లు మాత్రం వాడకూడదు. ఎందుకంటే అవి మీ ముఖంపై ఉండే మురికితో పాటు తేమను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల చర్మంbeautyఈ చలికాలలో చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్ పాటించండి..ఈ చలికాలలో చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్ పాటించండి..beautyMon, 08 Nov 2021 01:00:00 GMTచలికాలంలో చర్మ సంరక్షణకు సరైన చిట్కాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు సరిపోయే దుస్తులు మాత్రమే ధరించాలి. పొడి వాతావరణం అనేది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇంకా శరీరంలోని తేమను కూడా లాగేస్తుంది. చర్మం అంతా కూడా పొడిగా మారి, తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే.. క్రీమ్‌లా ఉండే క్లేన్సర్‌ని ఎంపిక చేసుకోవాలి. నురుగుతో కూడిన ఫేస్‌ వాష్‌లు మాత్రం వాడకూడదు. ఎందుకంటే అవి మీ ముఖంపై ఉండే మురికితో పాటు తేమను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. సరైన పీహెచ్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి ఇంకా చర్మాన్ని మరింత మృదువుగా చేసే క్రీమ్ ఆధారిత క్లేన్సర్స్‌ని ఎప్పుడూ కూడా ఎంపిక చేసుకోవాలి.ఇక సీజన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ఎక్స్‌ఫోలియేషన్ అనేది చాలా ముఖ్యం. చర్మం కింద పేరుకుపోయిన మృతకణాలను తొలగించే సున్నితమైన స్క్రబ్ చాలా అవసరం. కానీ అతిగా స్క్రబ్ చేస్తే మాత్రం ఇబ్బందులు అనేవి తలెత్తక మానదు. అందుకే వారానికి ఒకసారైన ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా మంచిది.

అలాగే రోజూ వినియోగించే ఆయిల్‌కు బదులుగా.. సీరమ్ ఆయిల్‌ను కూడా అప్లై చేస్తే మీ చర్మానికి మంచి జరుగుతుంది. ఇది మీ చర్మాన్ని చాలా మృదువుగా మార్చేందుకు సహకరిస్తుంది.అలాగే మీ చర్మాన్ని ఎల్లవేళలా కూడా హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. అందుకే సాధారణ క్రీమ్స్‌కు బదులుగా హెవీ క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవడం మంచిది. ఇక వేసవిలో తేలికపాటి మాయిశ్చరైజర్ ఎంతో అనువుగా ఉంటుంది. కానీ చలికాలంలో హెవీ క్రీమ్ తేమను చర్మంతోనే అట్టిపెట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది.నైట్ ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం చాలా మంచిది. ఇది చర్మంలోని తేమను లాక్ చేయడానికి ఎంతగానో సహాయపడుతాయి. అలాగే చర్మం హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.చలికాలంలో ముఖ్యంగా పెదవులు పొడిబారిపోతూ ఉంటాయి. అలాగే పగుళ్లు కూడా ఏర్పడుతాయి.ఈ సమస్యను ఎదుర్కోవడానికి రాత్రిపూట ఖచ్చితంగా లిప్‌బామ్ అప్లై చేసుకోవడం చాలా మంచిది.



కేసీఆర్ వార్నింగ్‌ బేఖాతర్.. ఎంపీ అర్వింద్‌ తిట్లే తిట్లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>