MoviesVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/tollywood-family-movies3372f22f-8f9b-4674-84d1-56f57bc0c4c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/tollywood-family-movies3372f22f-8f9b-4674-84d1-56f57bc0c4c9-415x250-IndiaHerald.jpg తెలుగులో కమర్షియల్ సినిమాల ఖర్చు విపరీతంగా పెరిగి పోతన్న రోజుల్లో.. అంటే 2012లో వచ్చిన కుటుంబ కథా చిత్రం మిథునం. ఇది లో బడ్జెట్ చిత్రం. ప్రముఖ పాత్రికేయుడు శ్రీరణ కలం నుంచి జాలువారిన కథ ఇది. మిథునం చిత్రాన్ని మరో రచయిత తనికెళ్ల భరణి తెరకెక్కించారు. భార్య భర్తల అనుబంధాన్ని చక్కగా చిత్రీకరించిన ఫ్యామిలీ చిత్రం ఇది.tollywood-family-movies{#}bharani;nithya new;santhanam;Writer;Singer;Santosham;Wife;Manam;Chitram;Cinema;Telugu;Fatherలో బడ్జెట్ ఫ్యామిలీ చిత్రం ఇదిలో బడ్జెట్ ఫ్యామిలీ చిత్రం ఇదిtollywood-family-movies{#}bharani;nithya new;santhanam;Writer;Singer;Santosham;Wife;Manam;Chitram;Cinema;Telugu;FatherMon, 08 Nov 2021 16:03:08 GMT
తెలుగులో కమర్షియల్ సినిమాల ఖర్చు విపరీతంగా పెరిగి పోతన్న రోజుల్లో.. అంటే  2012లో వచ్చిన కుటుంబ కథా చిత్రం మిథునం.  ఇది లో బడ్జెట్ చిత్రం. ప్రముఖ పాత్రికేయుడు శ్రీరణ కలం నుంచి జాలువారిన  కథ  ఇది. మిథునం చిత్రాన్ని మరో రచయిత తనికెళ్ల భరణి తెరకెక్కించారు.  విపరీతమైన వ్యయంతో ఆకాశపుటంచులు దాటి వెళుతున్న తెలుగు సినిమా వ్యయాన్ని తగ్గించిన చిత్రం ఇంది. కేవలం కోటి పాతిక లక్షల రూపాయల వ్యయంతోనే ఈ చిత్రం రూపుదిద్దుకునింది. భార్య భర్తల అనుబంధాన్ని చక్కగా చిత్రీకరించిన ఫ్యామిలీ చిత్రం ఇది.
ఇందులో ప్రధాన పాత్రలు రెండంటే రెండే.    ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు  శ్రీపతి  పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం ఉరఫ్ ఎస్పీబీ , సీనియర్ నటి  లక్ష్మి ప్రధాన పాత్రధారులు. భార్యా భర్తల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించ లేక పోయినా కోట్లాది  సినీ అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది.
వివిధ కుల వృత్తులు, వ్యవసాయం, వంట చేయడం, తో పాటు,  ఏదయినా వస్తువు బావిలో పడిపోతే  చేదే (వెలికి తీసే) వృత్తులన్నీ సినీనటుడు ఎస్పి బాలసుబ్రమణ్యం తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఒక  సగటు వ్యక్తి  జీవన శైలి ఆ చిత్రంలోప్రతిబింబించింది. సీనియర్ నటి  లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భార్యా భర్తల అనుబంధం, వారి  నిత్య  జీవన యానం ఇందులోని విశేషం.  భార్యా భర్తల్లో ఒకరి పై మరోకరికి ఉండే  ప్రేమ, వారిద్దరి మధ్య ఆప్యాయత, ఇద్దరి మధ్య చోటుచేసుకునే  చిరుతగవులు ఇందులో ప్రత్యేకంగా  మన కళ్లముందు కనపడతాయి. అంతే కాదు పాతతరం లో భోజనాలు ఎలా చేసే వారు. ఏ ఏ పదార్దాలు ఎలా వడ్డించే వారు. పిండి వంటలు ఎలా ఉండేవి. ఇంటికి పిల్లలు వస్తారంటే ముసలి వాళ్ల మోములో కనిపించే సంతోషం  ఒకటి కాదు రెండు కాదు జవన పార్శ్వంలోని అన్ని కోణాలను సున్నితంగా టచ్   చేసిన సినిమా ఇది.

 ఎక్కడో, ఖండాత రాల అవతల ఉన్న సంతానం.  ఎప్పటికో కానీ తల్లితండ్రుల ను చూడాలను కోని సంతానం గురించిన సినిమాలు మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఈ చిత్రం ఎక్కడా  ముసలి దంపతులు సంతానం మనకు కనబడరు.  కానీ వారి కోసం తల్లి, తండ్రి పడే తపన మన కళ్లకు కడుతుంది. ఈ చిత్రం ప్రత్యేకతల్లో ఇది ఒక అంశం మాత్రమే.
ఈ చిత్రం విడుదలై దశాబ్ద కాలం దాటినా ఈ చిత్రం తాలూకూ ఏదో ఒకక ప్రస్తావన ప్రముఖ రచయిత తనికేళ్ల భరణి దృష్టికి నేటికీ వస్తున్నదంటే అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనను కలసిన పాత్రికేయులకు తెలిపారు. మిథునం చిత్రం కోట్లాది రూపాయలు ఆర్జించక పోయినా కోట్లాది మంది  హృదయాలను మాత్రం కొల్లగొట్టిన ఘనతను మూట కట్టుకుంది.








వంట గ్యాస్ ధర పెరుగుదల.. సామాన్యుడి బాధలు చెప్పే ఫోటో వైరల్?

దిగజారిన డబ్ల్యుహెచ్వో.. వారికి బానిసగా మారిందా?

ఆఫ్ఘనిస్తాన్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఏం చేసిందంటే?

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"నువ్వు మీ నాన్నను మించిపోతావు రా".. బన్నీ కొడుకు దేశముద్దురే..!!

సోష‌ల్ వార్ : దాక్కో దాక్కో కేసీఆర్ ?

కేంద్రానికి వైసీపీ ఎంపీ సపోర్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>