PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apsrtc84787e13-996b-4736-ba56-4cd599752b9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apsrtc84787e13-996b-4736-ba56-4cd599752b9c-415x250-IndiaHerald.jpgమేఘా ఇంజినీరంగ్ సంస్థ ఖాతాలో మరో మెగా కాంట్రాక్ట్ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పలు కీలక ప్రాజెక్టులు మేఘా సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ నిర్మించిది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్రంలో పోలవరం ప్రాజెక్టు కూడా మేఘా సంస్థకే కట్టబెట్టిది వైఎస్ జగన్ సర్కార్. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మరో కీలక ప్రాజెక్టు కూడా మేఘా సంస్థకు అప్పగించింది జగన్ సర్కార్. తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు మొత్తం వంద బ్యాటరీ బసAPSRTC{#}sree;RTC;Tirupati;kaleshwaram;pollution;air pollution;polavaram;Polavaram Project;Hyderabad;contract;Jagan;Andhra Pradesh;Telangana;Government;Teluguమరో మెగా కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ...!మరో మెగా కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ...!APSRTC{#}sree;RTC;Tirupati;kaleshwaram;pollution;air pollution;polavaram;Polavaram Project;Hyderabad;contract;Jagan;Andhra Pradesh;Telangana;Government;TeluguMon, 08 Nov 2021 17:22:25 GMTమేఘా ఇంజినీరంగ్ సంస్థ ఖాతాలో మరో మెగా కాంట్రాక్ట్ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పలు కీలక ప్రాజెక్టులు మేఘా సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ నిర్మించిది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్రంలో పోలవరం ప్రాజెక్టు కూడా మేఘా సంస్థకే కట్టబెట్టిది వైఎస్ జగన్ సర్కార్. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మరో కీలక ప్రాజెక్టు కూడా మేఘా సంస్థకు అప్పగించింది జగన్ సర్కార్. తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు మొత్తం వంద బ్యాటరీ బస్సులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ దక్కించుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రంపై వాయు కాలుష్యం తగ్గించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. దీంతో కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని గతంలో ఏపీఎస్ఆర్టీసీకీ ప్రభుత్వం సూచించింది. దీంతో ఆ దిశగా ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ కార్యాచరణ ప్రారంభించింది.

తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తోంది ఆర్టీసీ. మొత్తం 140 కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్ర్రీన్ టెక్ సంస్థ దక్కించుకుంది. ఏడాది కాలంలో మొత్తం వంద బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఆర్టీసికి అప్పగించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్... ఫేమ్-2 ఫథకం కింద ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్రీన్ టెక్  సంస్థకు ఆర్టీసీ అప్పగించింది. ఈ ఒప్పందం కారణంగా ఆర్టీసీ దగ్గర మొత్తం 14 వందల 50 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు చేరినట్లుగా ఉంది. మొత్తం వంద బస్సులను కూడా తిరుపతిలోని అలిపిరి డిపోనకు అందిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. ఒప్పందంలో భాగంగా ఏడాది కాలం పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత కూడా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థదే. ఈ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.





బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్

అప్పుడు హిట్లర్.. ఇప్పుడు జిన్పింగ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>