PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kesinenid4b6db24-eee6-492b-b654-d939f430d5dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kesinenid4b6db24-eee6-492b-b654-d939f430d5dc-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న నాని.. పార్టీ నేప‌థ్యంలో విజ‌యం ద‌క్కించుకున్నార‌నేది.. ముఖ్యంగా చంద్ర‌బాబు హ‌వాతోనే గెలుపు గుర్రం ఎక్కార‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఆయ‌న మాత్రం ప‌రోక్షంగా.. చంద్ర‌బాబు హ‌వా ఉంటే.. జిల్లాలో అంత మంది ఎందుకు ఓడిపోయారో.. చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. అంటే.. కేవ‌లం త‌న హ‌వాతోనే త‌న ఫేస్ వాల్యూతోనే విజ‌యం ద‌క్కించుకున్నాన‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు. Kesineni nani{#}Kesineni Nani;Service;Assembly;MLA;District;Party;East;Hanu Raghavapudi;MP;YCP;TDP;Ishtamకేశినేని న‌మ్ముతోంది ఎవ‌రిని.. ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఎవ‌రికి...?కేశినేని న‌మ్ముతోంది ఎవ‌రిని.. ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఎవ‌రికి...?Kesineni nani{#}Kesineni Nani;Service;Assembly;MLA;District;Party;East;Hanu Raghavapudi;MP;YCP;TDP;IshtamMon, 08 Nov 2021 16:24:36 GMTవిజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న నాని.. పార్టీ నేప‌థ్యంలో విజ‌యం ద‌క్కించుకున్నార‌నేది.. ముఖ్యంగా చంద్ర‌బాబు హ‌వాతోనే గెలుపు గుర్రం ఎక్కార‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఆయ‌న మాత్రం ప‌రోక్షంగా.. చంద్ర‌బాబు హ‌వా ఉంటే.. జిల్లాలో అంత మంది ఎందుకు ఓడిపోయారో.. చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. అంటే.. కేవ‌లం త‌న హ‌వాతోనే త‌న ఫేస్ వాల్యూతోనే విజ‌యం ద‌క్కించుకున్నాన‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు.

పైగా విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతే తాను ఒక్క‌డినే విజ‌యం సాధించాన‌ని.. కూడా గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బాహాటంగానే వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు.. అస‌లు.. కేశినేని ఎవ‌రిని న‌మ్ముకుంటున్నారు ?  అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేసినా.. పార్టీపై పూర్తి విశ్వాసంతోనే ముందుకు సాగుతున్నారు. కొంత వారి హ‌వా కూడా ప‌నిచేస్తోంది. అయితే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో పార్టీ హ‌వా క‌న్నా వ్య‌క్తిగత ఇమేజ్‌తోనే నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రికొన్ని చోట్ల వైసీపీలో ఉన్న విభేదాలు.. టీడీపీకి క‌లిసి వ‌చ్చాయి. దీంతో ఒక‌రిద్ద‌రు.. అలా కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు.

మ‌రి కేశినేని విష‌యంలో వైసీపీ విభేదాలు క‌లిసివ‌చ్చాయా ? అంటే.. లేదు. కేశినేని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ఒక్క విజ‌యవాడ తూర్పు త‌ప్ప‌.. అన్నీ .. వైసీపీ విజ‌యం సాధించింది. దీంతో కేశినేని అలా వ్యాఖ్యానించి ఉంటార‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రి కేశినేనికి వ్య‌క్తి గ‌త ఇమేజ్ ఉందా?  అంటే.. జిల్లా ప‌రిధిలో చూసుకుంటే.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌ను ఎవ‌రూ తోసిపుచ్చ‌లేరు. టాటా గ్రూప్‌తో క‌లిసి.. జిల్లాలోని త‌న ఎంపీ పార్ల‌మెంటు ప‌రిధిలో ఆయ‌న అనేక సేవ‌లు చేస్తున్నారు.

ఒక‌టి రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేశారు. ఇది ఆయ‌న‌కు ప్ల‌స్ అయింది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఆయ‌న పోటీ చేస్తే.. పార్టీపై ఉన్న సానుభూతికి కూడా ఆయ‌న‌కు క‌లిసి రావాలి. అయితే.. ఇప్పుడు.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు నానికి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యే ఓటు మాకు వేయండి.. ఎంపీ ఓటు మీ ఇష్టం అనే ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు.. తెలుస్తోంది. ఇదే విష‌యంపై కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క నాయ‌కులు చ‌ర్చ చేస్తున్నారు. దీంతో కేశినేని న‌మ్ముకున్న సేవ ఏమేర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాల‌ని అంటున్నారు. కొస‌మెరుపు ఏంటంటే. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



అప్పుడు హిట్లర్.. ఇప్పుడు జిన్పింగ్?

దిగజారిన డబ్ల్యుహెచ్వో.. వారికి బానిసగా మారిందా?

ఆఫ్ఘనిస్తాన్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఏం చేసిందంటే?

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"నువ్వు మీ నాన్నను మించిపోతావు రా".. బన్నీ కొడుకు దేశముద్దురే..!!

సోష‌ల్ వార్ : దాక్కో దాక్కో కేసీఆర్ ?

కేంద్రానికి వైసీపీ ఎంపీ సపోర్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>