PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8ea44076-0d34-456c-a6c8-547494bc460e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8ea44076-0d34-456c-a6c8-547494bc460e-415x250-IndiaHerald.jpg కొంద‌రైతే తెలంగాణ నుంచి ఆంధ్రా వైపు వ‌చ్చేందుకు కూడా సిద్ధం అయిపోయారు. ఇంకొంద‌రు ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా తెలంగాణ‌లో త‌మ‌కున్న కొద్దో గొప్పో ఆస్తులు కూడా అమ్ముకుని సొంత ఊళ్ల‌కు సైతం చేరుకుని ఇక్క‌డే స్థిర ప‌డిపోయారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా కేసీఆర్ మాత్రం త‌న ప‌ద్ధ‌తి మార్చుకోలేదు. తెలంగాణ ఏర్పాట‌యిన తొలి నాళ్ల‌లో బూతుల‌కు తిట్ల‌కు కాస్త బ్రేక్ ఇచ్చినా త‌రువాత త‌రువాత మ‌ళ్లీ పాత పంథాలోనే న‌డుచుకున్నారు.kcr{#}MP;Bharatiya Janata Party;Telangana;KCRకేసీఆర్ టాక్స్ : మళ్లీ ఆ భాష మారడ్రా పెద్దాయన!కేసీఆర్ టాక్స్ : మళ్లీ ఆ భాష మారడ్రా పెద్దాయన!kcr{#}MP;Bharatiya Janata Party;Telangana;KCRMon, 08 Nov 2021 12:20:00 GMTతెలంగాణ ఉద్య‌మంలో భాగంగా కేసీఆర్ తీవ్ర స్థాయిలో అనుచిత భాష‌ను మాట్లాడారు. ఆంధ్రా పాల‌కుల‌ను ఉద్దేశించి తిట్టిన తిట్ట కుండా తిట్టారు. అంతేకాదు త‌మ ప్రాంతానికి జ‌రిగిన అన్యాయం వివ‌రించే క్ర‌మంలోనూ ప‌ద్ధ‌తైన భాష కాకుండా చాలా తిట్లు క‌లిపి మరీ! వివ‌రించారు. స‌రే అది ఉద్య‌మం ఆ రోజు ఆయ‌న కోపం అలా ఉంది అని చాలా మంది విని స‌ర్దుకుపోయారు. చాలా మంది బాధ‌ప‌డ్డారు. చాలా మంది పైకి త‌మ బాధ చెప్పుకోలేక‌పోయినా లోలోనే చాలా మ‌థ‌న ప‌డ్డారు. అంత‌ర్మ‌థ‌నం చెందిన వారంతా త‌రువాత కాలంలో తెలంగాణ ఏర్పాట‌య్యాక కూడా తమ  మ‌న‌సుల‌కు స‌ర్ది చెప్పుకోలేక‌పోయారు కూడా!


కొంద‌రైతే తెలంగాణ నుంచి ఆంధ్రా వైపు వ‌చ్చేందుకు కూడా సిద్ధం అయిపోయారు. ఇంకొంద‌రు ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా తెలంగాణ‌లో త‌మ‌కున్న కొద్దో గొప్పో ఆస్తులు కూడా అమ్ముకుని సొంత ఊళ్ల‌కు సైతం చేరుకుని ఇక్క‌డే స్థిర ప‌డిపోయారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా కేసీఆర్ మాత్రం త‌న ప‌ద్ధ‌తి మార్చుకోలేదు. తెలంగాణ ఏర్పాట‌యిన తొలి నాళ్ల‌లో బూతుల‌కు తిట్ల‌కు కాస్త బ్రేక్ ఇచ్చినా త‌రువాత త‌రువాత మ‌ళ్లీ పాత పంథాలోనే న‌డుచుకున్నారు.


మ‌రోవైపు విప‌క్ష నేత‌లు కూడా కేసీఆర్ వాడిన భాష‌నే త‌రుచూ వినియోగిస్తున్నారు. ఏమంటే ఇదంతా త‌మ‌కు కేసీఆరే నేర్పార‌ని అంటున్నారు. నాలుక కోస్తా, మెడ‌లు వంచుతా లాంటి ప‌దాలు నిన్న‌టి ప్రెస్మీట్ లో మ‌ళ్లీ అన్నారు. అయితే ఓ ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి భాష‌పై నియంత్ర‌ణ లేకుండా ఎవ‌రో త‌న‌ను అన్నార‌ని తిరిగి ఆ విధంగా స్పందిచ‌డం అన్న‌ది త‌గ‌ని ప‌ని అని  ప‌రిశీల‌కులు అంటున్నారు. భాష‌ను నియంత్రించుకోకుండా, భావోద్వేగాలు నియంత్రించుకోకుండా నాయ‌కులు ఉన్నంత కాలం ప‌ర‌స్ప‌ర విద్వేషాలు అన్న‌వి పెరిగి పోతూనే ఉంటాయ‌న్న‌ది ఓ వాస్త‌వం. కానీ కేసీఆర్ మాత్రం ఉద్య‌మ కాలంలో త‌న‌కెంతో క‌లిసి వ‌చ్చిన భాషనే ఇప్పుడూ వాడుతున్నారు. బీజేపీ పెద్ద‌ల‌ను సైతం చాలా తిట్టారు. పెట్రో ధ‌రల విష‌య‌మై కోపం అయ్యారు. ఇదే సంద‌ర్భంలో బీజేపీని అన‌రాని మాట‌లు అన్నారు. దీంతో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ సీన్ లోకి వ‌చ్చి కేసీఆర్ ను అదే భాష‌లో తిట్టిపోశారు. ఇవ‌న్నీ రాజ‌కీయాల్లో స‌ర్వ సాధార‌ణ‌మేన‌ని స‌ర్దుకుపోవ‌డం మిన‌హా సామాన్యులు చేసేందేం లేదా?





అయ్యో పాపం.. ఆ విషయంలో.. మగవారే ఎక్కువ బాధ పడతారట?

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>