PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/power-cute01eb646-5985-4f58-9ed1-9c2f9fc749f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/power-cute01eb646-5985-4f58-9ed1-9c2f9fc749f8-415x250-IndiaHerald.jpgపెట్రో ధరల మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ధరల పెంపు మీ వల్ల అంటే మీ వల్ల అని అటు భారతీయ జనతా పార్టీ నేతలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. పెంచింది ఎంత... తగ్గించింది ఎంత అంటూ కేంద్రంపై ప్రకటనలు కూడా జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేంద్రం దెబ్బకు దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఢిల్లీకి పPower{#}Y. S. Rajasekhara Reddy;advertisement;Jagan;war;Ishtam;Andhra Pradesh;central government;Bharatiya Janata Party;Party;Governmentఏపీ జెన్ కో ఓ దివాళా సంస్థ.. కేంద్రం ప్రకటన...!ఏపీ జెన్ కో ఓ దివాళా సంస్థ.. కేంద్రం ప్రకటన...!Power{#}Y. S. Rajasekhara Reddy;advertisement;Jagan;war;Ishtam;Andhra Pradesh;central government;Bharatiya Janata Party;Party;GovernmentMon, 08 Nov 2021 13:57:03 GMTపెట్రో ధరల మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ధరల పెంపు మీ వల్ల అంటే మీ వల్ల అని అటు భారతీయ జనతా పార్టీ నేతలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. పెంచింది ఎంత... తగ్గించింది ఎంత అంటూ కేంద్రంపై ప్రకటనలు కూడా జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేంద్రం దెబ్బకు దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఢిల్లీకి పరిగెట్టింది. నవరత్నాల పేరుతో సంక్షేమం పేరుతో ప్రజలకు భారీ ఎత్తున తాయిలాలు ఖర్చు చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి మరీ పథకాలకు డబ్బు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నుంచి తీసుకువచ్చిన అప్పుల్ని సకాలంలో చెల్లించలేని దుర్భర స్థితికి ఏపీ ఖజానా చేరుకుంది. ప్రభుత్వ ఆస్తులను కూడా ఇప్పటికే తాకట్టు పెట్టేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఏపీ జెన్ కో సంస్థ పేరుతో ఇప్పటికే కేంద్రం దగ్గర ఇబ్బంది ముబ్బడిగా అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వీటిని తిరిగి చెల్లించలేదు. దీంతో జెన్ కో సంస్థను నిరర్థక ఆస్తుల జాబితాలో చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తదుపరి ప్రైవేటీకరణ మాత్రమే. దీనితో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు ఢిల్లీకి పరుగులు పెట్టారు. సంక్షేమం ముసుగులో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడంతో... ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా దివాలా స్థాయికి దిగజారిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ సంస్థ నుంచి ఏపీ జెన్ కో భారీగా అప్పులు తీసుకుంది. అయితే గత మూడు నెలలుగా వాటిని తిరిగి చెల్లించడం లేదు. దీనిపై ఎన్ని నోటిసులు జారీ చేసినా కూడా జెన్ కో నుంచి నో ఆన్సర్. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం జెన్ కో సంస్థను ఓ దివాళా సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థను పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రైవేటీకరించే హక్కు కూడా కేంద్రానికి ఉంది. దీంతో కేంద్రంతో చర్చలు జరిపేందుకు ఏపీ జెన్ కో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపింది.



పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ విధించ‌లేదా..? బండి సంజ‌య్

రైతుల‌కు రుణ‌మాపీ చేశావా..? బండి సంజ‌య్

ఆయన అంతే...కెసిఆర్ మారలేదు...

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>