PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-44952a79-78fe-4d13-8978-6b568d87b1b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-44952a79-78fe-4d13-8978-6b568d87b1b3-415x250-IndiaHerald.jpgఇదంతా బాగుంది కానీ కేంద్రం ఎందుక‌ని ధాన్యం కొనుగోలుపై మొగ్గు చూప‌డం లేదు అన్న‌ది సిస‌లు ప్ర‌శ్న. వేసంగిలో వ‌చ్చే ధాన్యం తాము కొనుగోలు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేసింది స‌రే అదే స‌మ‌యంలో రైతుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూపిందా? రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్నా సరే వ్య‌వ‌సాయం లో ఒక్క వ‌రి మాత్రమే ఉంద‌న్న విధంగా రైతులు ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని? సీఎం చెప్పినా కూడా రైతులు ఆవాలు, నువ్వులు ఇలాంటి ఇత‌ర పంట‌ల సాగుకు ఎందుకు దృష్టిసారించ‌లేదు? అన్న‌వి కొన్ని ప్ర‌శ్నలు.trs {#}Corporate;local language;CM;Telanganaకేసీఆర్ టాక్స్ : నువ్వు కొంటానంటే నేనొద్దంటానా?కేసీఆర్ టాక్స్ : నువ్వు కొంటానంటే నేనొద్దంటానా?trs {#}Corporate;local language;CM;TelanganaMon, 08 Nov 2021 13:02:39 GMTధాన్యం కొనుగోలు చుట్టూనే రాజ‌కీయం న‌డుపుతున్నాడు కేసీఆర్. తాను ఎన్ని సార్లు కోరిన‌ప్ప‌టికీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి  ఎటువంటి స్ప‌ష్ట‌మ‌యిన స‌మాధానం కేంద్రం ఇవ్వ‌లేద‌ని, కొనుగోలుకు సంబంధించి లేఖ‌లు రాసినా కూడా స్పంద‌న లేద‌ని అంటున్నాడు కేసీఆర్. ఇదంతా పార‌దర్శ‌కంగా జ‌రిగిందా లేదా అన్న‌ది కూడా ఓ అనుమానం. ఇవాళ తెలంగాణ దేశానికే అన్నం పెడుతుంద‌ని ఆ విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌ని, మిష‌న్ కాక‌తీయ లాంటి ప‌థ‌కాల పుణ్య‌మాని రైతుల‌కు నీళ్లందుతున్నాయ ని, అదేవిధంగా తాము అందిస్తున్న పెట్టుబ‌డి సాయం ఎంద‌రికో ఊతం ఇస్తుంద‌ని దీంతో పంట‌లు పుష్క‌లంగా పండుతున్నాయ‌ని చెబుతున్నాడు కేసీఆర్.


ఇదంతా బాగుంది కానీ కేంద్రం ఎందుక‌ని ధాన్యం కొనుగోలుపై మొగ్గు చూప‌డం లేదు అన్న‌ది సిస‌లు ప్ర‌శ్న. వేసంగిలో వ‌చ్చే ధాన్యం తాము  కొనుగోలు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేసింది స‌రే అదే స‌మ‌యంలో రైతుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూపిందా? రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్నా సరే వ్య‌వ‌సాయం లో ఒక్క వ‌రి మాత్రమే ఉంద‌న్న విధంగా రైతులు ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని? సీఎం చెప్పినా కూడా రైతులు  ఆవాలు, నువ్వులు ఇలాంటి ఇత‌ర పంట‌ల సాగుకు ఎందుకు దృష్టిసారించ‌లేదు?
అన్న‌వి కొన్ని ప్ర‌శ్నలు.

మ‌రోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒక‌ప్పుడు లెవీ ఉండేది ఇప్పుడు కేంద్రం లెవీకి సంబంధించి ప్ర‌త్యేకించి సేక‌ర‌ణ‌లేవీ చేప‌ట్ట‌డం లేదు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అమ‌లు అయితే దేశంలో ఆహార భ‌ద్ర‌త అన్న‌ది కేంద్రం ప‌రిధిలో ఉండదు. ధాన్యం కార్పొరేట్ శ‌క్తులే కొనుగోలుచేయాలి. అందుకు రైతుల‌ను సిద్ధం చేసేలా కేంద్రం త‌న బాధ్య‌త నుంచి త‌ప్పుకుంటోంది. అలానే పౌర స‌ర‌ఫరాల వ్య‌వ‌స్థ‌ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేయాల‌ని  యోచిస్తోంది. ఇవేవీ లేకుండానే రాజ‌కీయం చేయొచ్చు కానీ అది చేత‌గాక‌నే తామేం చెబితే ఆ పంట సాగు చేసేలా స్థానిక లేదా ప్రాంతీయ ప్ర‌భుత్వాలు ఆదేశించేలా కేంద్రం ఇప్ప‌టి నుంచే కొన్ని కుయుక్తులు ప‌న్నుతోంది. దీంతో ద‌ళారీ వ్య‌వ‌స్థ క‌న్నాబ‌ల‌మైన కార్పొరేట్ వ్య‌వ‌స్థ ఒక‌టి సీన్ లోకి వ‌చ్చి రైతును నిండా ముంచే ప్ర‌య‌త్నం ఒక‌టి త‌ప్ప‌క జ‌రుగుతుంది.



అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఉందా..బండ్ల గణేష్ సంచలనం..!!

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>