• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Earthquake: భారీ భూకంపంతో వణికిన అండమాన్: అదే తీవ్రతతో మరో రెండు చోట్లా

|

పోర్ట్‌బ్లెయిర్: కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు ఆగ్నేయ దిశగా ఈ తెల్లవారు జామున భూమి కంపించింది. అల్పపీడనం ప్రభావం వల్ల ఇప్పటికే అండమాన్ నికోబార్ ద్వీప సమీపంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో భూకంపం సంభవించడంతోో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆ తరువాత స్వల్పంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి.

ఈ తెల్లవారు జామున 5:28 నిమిషాలకు పోర్ట్‌బ్లెయిర్‌కు ఆగ్నేయ దిశగా భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా రికార్డయింది. భూ ఉపరితలం నుంచి 16 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. దీనితో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు పెట్టారు. ఆ తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీనితో స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే ఉండిపోయారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత కూడా 4.3గా రికార్డయింది. మనాలికి వాయవ్య దిశగా 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో భూమి కంపించినట్లు వివరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది.

ఈశాన్యంలోని మణిపూర్‌లోనూ దాదాపు అదే సమయంలో భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా రికార్డయింది. మణిపూర్ సమీపంలోని ఉఖ్రుల్ ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఈ మూడు భూకంపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తూ.. వరుస ట్వీట్లను చేసిందా సంస్థ. ఈ భూకంపాల వల్ల ఏదైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా అనేది ఇంకా తెలియరాలేదు.

Earth quake with 4.3 magnitude hits Andaman and Nicobar islands

కాగా- 4.3 తీవ్రతతో భూకంపం సంభవించడం 10 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిందటి నెల 31వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇదే స్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత కూడా 4.3గా నమోదైంది. గడ్చిరోలి ప్రాంతం సీస్మిక్ జోన్-3లో ఉంది. తరచూ ఈ స్థాయిలో భూమి కంపిస్తుంటుందని ఎన్‌సీఎస్ మాజీ చీఫ్ ఏకే శుక్లా అప్పట్లో పేర్కొన్నారు. తాజాగా అదే తీవ్రతతో అండమాన్ నికోబార్, హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో భూకంపం సంభవించింది.

English summary
An earthquake of magnitude 4.3 hit Southeast of Port Blair, capital city of Andaman and Nicobar Island in the early hours of Monday, the National Center for Seismology (NCS) informed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X