PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/demonetization17605f5f-66de-4e9c-b58f-ea2a2606d329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/demonetization17605f5f-66de-4e9c-b58f-ea2a2606d329-415x250-IndiaHerald.jpgయావత్ భారత దేశం నివ్వెర పోయిన రోజు ఇది. ఐదేళ్ల క్రితం అంటే 2016లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక ప్రటకన చేశారు. దీంతో యావత్ భారత దేశం నివ్వెర పోయింది. కోట్లాది మంది భారతీయులు చేసేదేమీ లేక , దిక్కుతోచక మిన్నకుండి పోయారు. ప్రధాన మంత్రి చేసిన ప్రకట ఏంటి ? మంత్రి వర్గ సహచరులకు సైతం తెలియకుండా ఆయన చేసిన ప్రకటన ఏమిటి ?demonetization{#}Narendra Modi;Indians;Prime Minister;November;India;Capital;Ministerనోట్ల రద్దు : భారత్ నివ్వెర పోయిన రోజునోట్ల రద్దు : భారత్ నివ్వెర పోయిన రోజుdemonetization{#}Narendra Modi;Indians;Prime Minister;November;India;Capital;MinisterMon, 08 Nov 2021 11:00:00 GMT
యావత్ భారత దేశం నివ్వెర పోయిన రోజు ఇది.  ఐదేళ్ల క్రితం అంటే 2016లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక ప్రటకన చేశారు. దీంతో యావత్ భారత దేశం నివ్వెర పోయింది. కోట్లాది మంది భారతీయులు చేసేదేమీ లేక , దిక్కుతోచక మిన్నకుండి పోయారు.  ప్రధాన మంత్రి చేసిన ప్రకట ఏంటి ? మంత్రి వర్గ సహచరులకు సైతం  తెలియకుండా ఆయన చేసిన ప్రకటన ఏమిటి ?
2016 వ సంవత్సరం నవంబర్ నెల  8వ తేదీ, రాత్రి ఎనిమిది గంటల సమయం. ఢిల్లీలో వాతావరణం చాలా చల్లగా ఉంది. దేశ రాజధాని లోనే కాదు భారత దేశం అంతటా దాదాపు చలిగాలులు వీస్తున్నాయి. రహదారుల్లో జనాల రాకపోకలు మందకొడిగా సాగుతున్నాయి.  ఆ సమయంలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నగదు రహిత లావాదేవీల వ్యవస్థ, డిజిటల్ సొసైటీ వైపుగా దేశం ప్రయాణం ఆరంభించిందని పేర్కోంటూ ఓ కీలక మైన  ప్రకటన చేశారు. అదే నోట్ల రద్దు. అప్పటి దాకా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు ఇక చెల్లవని ప్రకటించారు. అర్థరాత్రి తరువాత వాటికి  ఎలాంటి మారకం విలువ ఉందడని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చాలా నింపాదిగా తెగేసి చెప్పారు. ఈ  మాట దేశ ప్రజలకు శరాఘాతంలా మారింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తనను తాను సమర్థించుకున్నారు.  దేశంలో ని నల్లధనం అరికడతానన్ గతం లోనే తాము యావత్ భారత జాతికి మాటిచ్చానని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పారు. నోట్ల రద్దుతో  దేశంలోని నల్లధనం పూర్తిగా పోతుందని నరేంద్ర మోడీ తెలిపారు.  దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు కూడా.  కాక పోతే దేశంలోని ప్రజలందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలన్న పిలుపును మర్చిపోయారు.  భవిష్యత్తులో అవసరాల కోసం  ఇళ్లలో తమ వద్ద  దాచుకుని ఉన్న నగదు హఠాత్తుగా మారదంటే ఏం చేయాలి ? అని చాలా మంది వృద్ధులు గుండెె పోటుతో మరణించారు.  మరెంతో మంది మానసికంగా కృంగి పోయి  వ్యాధి గ్రస్తులయ్యారు. పాలకులకు ఇవేమి కనిపించవు కదా ..





పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే ను లాక్ చేసిన హరీష్ శంకర్..!

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?

కేసీఆర్ నయా టార్గెట్ బీజేపీ...!

కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>