PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpb15dd153-be7a-4915-ae51-5525525b5cee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpb15dd153-be7a-4915-ae51-5525525b5cee-415x250-IndiaHerald.jpgసాధారణ ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ హవా నడుస్తూనే ఉంది. పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఇక వైసీపీ విజయాలకు కారణాలు ఏంటని ఒక్కసారి చూస్తే....అధికారంలో ఉండటం, ప్రత్యర్ధులని నామినేషన్స్ వేయనివ్వకుండా బెదిరించడం, నామినేషన్ పత్రాలని చించి వేయడం, పథకాలు పోతాయని ఓటర్లని బెదిరించడం...ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు వైసీపీ గెలుపుకు కారణమయ్యాయని ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.అన్నిటికంటే వైసీపYsrcp{#}Guntur;Gurazala;TDP;Scheduled caste;YCPగురజాలలో వైసీపీని గెలిపించేది వారే...?గురజాలలో వైసీపీని గెలిపించేది వారే...?Ysrcp{#}Guntur;Gurazala;TDP;Scheduled caste;YCPMon, 08 Nov 2021 15:56:43 GMTసాధారణ ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ హవా నడుస్తూనే ఉంది. పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఇక వైసీపీ విజయాలకు కారణాలు ఏంటని ఒక్కసారి చూస్తే....అధికారంలో ఉండటం, ప్రత్యర్ధులని నామినేషన్స్ వేయనివ్వకుండా బెదిరించడం, నామినేషన్ పత్రాలని చించి వేయడం, పథకాలు పోతాయని ఓటర్లని బెదిరించడం...ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు వైసీపీ గెలుపుకు కారణమయ్యాయని ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

అన్నిటికంటే వైసీపీ గెలుపుకు కారణం అధికారులు, పోలీసులే అని అంటున్నారు. ఎందుకంటే పోలీసుల చేత టీడీపీ నేతలని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసని, ఇక అధికారులు...టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లని ఎలా రిజెక్ట్ అయ్యేలా చేస్తున్నారో కూడా తెలుసని చెబుతున్నారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే..టీడీపీ అభ్యర్ధులు వేసే నామినేషన్స్ పత్రాలు సరిగ్గానే ఉన్నా సరే...కొందరు అధికారులు కొన్ని పత్రాలని చించి వేసి, అవి లేవని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పుకొచ్చారు.

అంటే వైసీపీ గెలుపులో అధికారులు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నారో చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. ఇదే విష‌య‌మైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో అధికారులు వైసీపీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారట. దీనిపై అక్క‌డ పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఈ క్రమంలోనే దాచేపల్లి మున్సిపాలిటీలో 17 వార్డుకు నామినేషన్ వేసిన ఒక టీడీపీ అభ్యర్ధి నామినేషన్ రిజెక్ట్ చేశారు. కుల ధృవీకరణ పత్రం పాతది అని చెప్పి రిజెక్ట్ చేశారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఆ అభ్యర్ధి ఎస్సీ పైగా, టీడీపీ ఛైర్మన్ అభ్యర్ధి. అందుకనే అధికారులు వైసీపీ గెలుపు కోసం తన నామినేషన్ రిజెక్ట్ చేశారని స్వయంగా ఆ అభ్యర్ధి చెప్పారు. దీని బట్టి చూస్తే గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలో వైసీపీని సగం అధికారులే గెలిపించేలా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

 



లో బడ్జెట్ ఫ్యామిలీ చిత్రం ఇది

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"నువ్వు మీ నాన్నను మించిపోతావు రా".. బన్నీ కొడుకు దేశముద్దురే..!!

సోష‌ల్ వార్ : దాక్కో దాక్కో కేసీఆర్ ?

కేంద్రానికి వైసీపీ ఎంపీ సపోర్ట్...?

పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ విధించ‌లేదా..? బండి సంజ‌య్

కెసిఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>