PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఒట‌మితో తెలంగాణ‌లో బీజేపీని టార్గెట్ చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేవలం బీజేపీని మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల తూటాలు పేల్చారు. గ‌తంలో కేంద్రం తీసుక‌న్న నిర్ణ‌యాల‌పై ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప పెద్ద‌గా ఎన్న‌డూ మాట్లాడ‌లేదు. పైగా చాలా సంద‌ర్భాల్లో కేంద్ర ప్ర‌భుత్వం విష‌యంలో మౌనంగా ఉంటూ తెర‌చాటున స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ ఉన్న‌ కేసీఆర్ ఇప్పుడు ఒక్క‌సారిగా హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ఓటమి చ‌విచూడ‌డంతో త‌న గ‌ళంలో జోరు పెంచారు. కేంద్trs vs bjp{#}Nijam;media;Huzurabad;central government;CM;KCR;Bharatiya Janata Partyకేసీఆర్ vs బీజేపీ : టార్గెట్ క‌మ‌ళం..!కేసీఆర్ vs బీజేపీ : టార్గెట్ క‌మ‌ళం..!trs vs bjp{#}Nijam;media;Huzurabad;central government;CM;KCR;Bharatiya Janata PartyMon, 08 Nov 2021 09:41:32 GMTహుజురాబాద్ ఒట‌మితో తెలంగాణ‌లో బీజేపీని టార్గెట్ చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేవలం బీజేపీని మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల తూటాలు పేల్చారు. గ‌తంలో కేంద్రం తీసుక‌న్న నిర్ణ‌యాల‌పై ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప పెద్ద‌గా ఎన్న‌డూ మాట్లాడ‌లేదు. పైగా చాలా సంద‌ర్భాల్లో కేంద్ర ప్ర‌భుత్వం విష‌యంలో మౌనంగా ఉంటూ తెర‌చాటున స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ ఉన్న‌ కేసీఆర్ ఇప్పుడు ఒక్క‌సారిగా హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ఓటమి చ‌విచూడ‌డంతో త‌న గ‌ళంలో జోరు పెంచారు.


 కేంద్ర ప్ర‌భుత్రం ప్ర‌భుత్వం రంగ సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రిస్తున్నార‌ని..  పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచుకుంటూ పోయార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.  అయితే, ఈ నిర్ణ‌యాలు ఇప్పటికిప్పుడు తీసుకున్న‌వ‌యితే కావు.. కేంద్ర ప్ర‌భుత్వ‌ ప‌రిధిలోని సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించ‌డం, అమ్మే అంశం చాలా రోజుల నుంచి న‌డుస్తోంది. అలాగే, పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు ఇప్ప‌టికిప్పుడు పెరిగిన‌వి కావు, ఎల్ఐసీ కూడా ఉన్న‌ప‌లంగా నిర్వీర్యం చేయలేదు. ఆ సమ‌యంలో మౌనం వ‌హించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు బీజేపీ ఒంటి కాలిపై ఉవ్వెత్తున నిల‌బ‌డుతున్నారు.


అయితే, కేసీఆర్ ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేయ‌డానికి ముఖ్యంగా హుజురాబాద్ ఓట‌మి, రాష్ట్రంలో బీజేపీ బ‌లం పుంజుకుంటుందనే ప్ర‌ధాన అంశాలు అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వానికి ఇదే నిజం ఎందుకంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే, కేంద్రంలో అధికారంలో ఉండ‌డం ఆ పార్టీకి క‌లిసి వచ్చే అంశం. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ గ‌ట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంద‌ని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


  క్షేత్ర స్థాయిలో బ‌లంగా లేని బీజేపీని అన‌వ‌స‌రంగా కేసీఆర్ భుజాల‌పై ఎత్తుకుంటున్నాడ‌న్న వాద‌న వినిపిస్తోంది. అలాగే, కేసీఆర్ మాట‌లు బీజేపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంది. ఏదైమైనా బీజేపీ విష‌యంలో గులాబీ బాస్ ఆచితూచి అడుగు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తాడో వేచి చూడాలి.



కేసీఆర్ vs బీజేపీ : టార్గెట్ క‌మ‌ళం..!

బీజేపీపై.. కేసీఆర్ యుద్దమా..!

ఈటల పేరెత్తడానిక్కూడా ఇష్టపడని కేసీఆర్.. ఎందుకంటే..?

బిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!

హుజురాబాద్ ఎఫెక్ట్ : కేసీఆర్ ఇంకా కోలుకోలేదా..?

పవన్ ను టార్గెట్ చేసిన జై భీమ్ !

టీమిండియా... పేపర్ పులి...!

జగన్ బాటలో రాష్ట్రాలు... కేంద్రంతో ఢీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>