PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgకాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన... 4 వేల మంది టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు. టీటీడీ .కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిష్కరించాలి అని ఆయన డిమాండ్ చేసారు. 2010లో టీటీడీ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది అని పవన్ పేర్కొన్నారు. మరి కొత్తగా ఇప్పుడు కార్పోరేషన్ ఎందుకు? అpavan kalyan{#}Tirumala Tirupathi Devasthanam;Janasena;Government;YCPమీకు నేనున్నా... అప్పుడు ఆ మాట ఎందుకు: పవన్మీకు నేనున్నా... అప్పుడు ఆ మాట ఎందుకు: పవన్pavan kalyan{#}Tirumala Tirupathi Devasthanam;Janasena;Government;YCPMon, 08 Nov 2021 18:04:46 GMTకాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ  అండగా ఉంటుంది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన... 4 వేల మంది టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు.  టీటీడీ .కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిష్కరించాలి అని ఆయన డిమాండ్ చేసారు. 2010లో టీటీడీ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది అని పవన్ పేర్కొన్నారు.

మరి కొత్తగా ఇప్పుడు కార్పోరేషన్ ఎందుకు?  అని ఆయన నిలదీశారు. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అన్నారు.  వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి ఘోర వైఫల్యం చెందింది అని తెలిపిన ఆయన  ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాక  వారి జీవితాలలోఅల్లకల్లోలం సృష్టించింది అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. ఉదాహరణలు చెప్పుకొంటే.. ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ రీతిలోనే 73 సంఘాలను రద్దు చేసి కార్పోరేషన్ గా మార్చడం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్య అని ఫైర్ అయ్యారు.  దీనిని పొమ్మనకుండా పొగపెట్టడం లాంటి నిర్ణయంగా భావించాలి అన్నారు ఆయన. జస్టిస్ జె.ఎస్.ఖేహార్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్డు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారు అని మండిపడ్డారు. కార్పోరేషన్లో చేరని ఉద్యోగులను.. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవల్సి వస్తుందని బెదిరిస్తున్నారు అని విమర్శించారు.

వారిని కార్పోరేషన్లో చేరాలని బలవంతపెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. కొత్తగా కార్పోరేషన్ ఏర్పాటు  చేయడం... నిధులు దారి మళ్లించేందుకేనా?  అని నిలదీశారు. బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? అంటూ ప్రశ్నించారు.  73 సొసైటీలలో ఉన్న నాలుగు వేలమంది ఉద్యోగులను ఒప్పించ లేకపోయిందా?  అని నిలదీశారు. నాలుగువేల మంది ఉద్యోగులకు వైసీపీ  పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చింది అని ఆయన ప్రశ్నించారు.



కొంట‌వా.. కొన‌వా.. ధ‌ర్నా చేస్తాం : కేసీఆర్

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>