PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parliament-b377f073-4dda-48f3-b1e4-299fd6306f8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parliament-b377f073-4dda-48f3-b1e4-299fd6306f8e-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం దాదాపు ఖరారైంది. కరోనా కారణంగా వర్షాకాల సమావేశాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలపై అందరి కళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముహుర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రానికి పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై చర్parliament{#}Cabinet;Assembly;Parliment;central government;Coronavirus;Ministerనవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...!నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...!parliament{#}Cabinet;Assembly;Parliment;central government;Coronavirus;MinisterMon, 08 Nov 2021 18:28:07 GMTపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం దాదాపు ఖరారైంది. కరోనా కారణంగా వర్షాకాల సమావేశాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలపై అందరి కళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముహుర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రానికి పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై చర్చించింది. ఈ కమిటీ సూచించిన తేదీలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత శీతాకాల సమావేశాలు పూర్తిస్థాయిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీకి గతంలోనే కీలక సూచనలు చేసింది కేంద్రం.

మొత్తం 19 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ కేంద్రానికి సూచించింది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన కొవిడ్ జాగ్రత్తలతో పాటు ఇతర చర్యల గురించి కూడా కేబినెట్ కమిటీ కీలక సూచనలు చేసింది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులపై కూడా కేంద్రం చర్చించనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఓ వైపు వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటికి విపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ సమావేశంలోనే ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీయనున్నాయి. వర్షాకాల సమావేశాల సమయంలో పెగాసస్ వ్యవహారం పార్లమెంట్‌ను ఓ కుదుపు కుదిపేసింది కూడా. చివరికి కేంద్రం కూడా సరైన సమాధానం ఇవ్వలేక పోయింది. ఇప్పుడు యూపీలో రైతులపై దాడులు, పెట్రో ధరల వివాదం వంటి కీలక అంశాలు కేంద్రాన్ని మరోసారి ఇరుకున పెట్టేలా ఉన్నాయి. యూపీ ఎన్నికల ముందు జరిగే పార్లమెంట్ సమావేశాలు కావడంతో... ఎలాంటి బిల్లులకు ఆమోదం లభిస్తుందో చూడాలి మరి.





షర్మిల :నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిన కేసీఆర్ కి చలనం లేదా..?

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>