BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------2e47cf21-50ef-4ced-819a-734bff190c45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------2e47cf21-50ef-4ced-819a-734bff190c45-415x250-IndiaHerald.jpgపంజాగుట్టలో ఓ చిన్నారి మృతదేహమును రోడ్డుపైనే ప‌డేసిన విష‌యం తెలిసిన‌దే. అయితే ఈ కేసును పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు. ఈ నివేదిక‌లో కొన్ని కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పంజాగుట్ట చిన్నారి క‌డుపులో బ‌లంగా త‌న్న‌డం వ‌ల్ల‌నే మృతి చెందిన‌ద‌ని వైద్యులు ధృవీక‌రించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంత‌ముగా చేప‌డుతున్నారు. ఘ‌ట‌న చోటు చేసుకున్న రోజు తొలుత అనుమాన‌స్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప#పంజాగుట్ట చిన్నారి మృతి కేసు {#}Mohandas Karamchand Gandhi;Postmortem;police;mediaపంజాగుట్ట చిన్నారి మృతి కేసు : పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే..?పంజాగుట్ట చిన్నారి మృతి కేసు : పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే..?#పంజాగుట్ట చిన్నారి మృతి కేసు {#}Mohandas Karamchand Gandhi;Postmortem;police;mediaMon, 08 Nov 2021 10:20:36 GMT
పంజాగుట్టలో ఓ చిన్నారి మృతదేహమును రోడ్డుపైనే ప‌డేసిన విష‌యం తెలిసిన‌దే. అయితే ఈ కేసును పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు. ఈ నివేదిక‌లో కొన్ని కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పంజాగుట్ట చిన్నారి క‌డుపులో బ‌లంగా త‌న్న‌డం వ‌ల్ల‌నే మృతి చెందిన‌ద‌ని వైద్యులు ధృవీక‌రించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంత‌ముగా చేప‌డుతున్నారు.
 
ఘ‌ట‌న చోటు చేసుకున్న రోజు తొలుత అనుమాన‌స్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. త‌రువాత పోస్టుమార్టం నివేధిక అంద‌డంతో హ‌త్య కేసుగా న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు. మొత్తం 15 బృందాలుగా కేసు ద‌ర్యాప్తు కోసం విచార‌ణ కొన‌సాగిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. పంజాగుట్ట పోలీసుల‌తో పాటు సిటీ, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు ద‌ర్యాప్తు చేస్తే ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.
.
ఇప్ప‌టికే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఓ వాహ‌నం నెంబ‌ర్‌ను ట్రేస్ చేశారు. ఈ కేసు ద‌ర్యాప్తులో స‌వితి త‌ల్లి ప్ర‌మేయం ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మ‌రోవైపు పోలీసుల అదుపులోనే నిందితులు ఉన్నార‌ని కొంద‌రూ పేర్కొంటున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే నిందితుల‌ను మీడియా ముందుకు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. ఇది జ‌రిగితే ఐదు రోజుల సుదీర్ఘ ద‌ర్యాప్తు అనంత‌రం ఈ చిన్నారి మృతి కేసు ఓ కొలికి వ‌స్తుంది.





కేసీఆర్ నయా టార్గెట్ బీజేపీ...!

కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!

రేపు ఒడిశా-ఏపీ సీఎంలు భేటీ

చైనా కబ్జా చేస్తుంది.. అమెరికా స్పష్టికరణ..!

బీజేపీపై.. కేసీఆర్ యుద్దమా..!

ఈటల పేరెత్తడానిక్కూడా ఇష్టపడని కేసీఆర్.. ఎందుకంటే..?

బిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>