PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp642a5ca2-8c1c-4e8a-b44a-950807b0be4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp642a5ca2-8c1c-4e8a-b44a-950807b0be4e-415x250-IndiaHerald.jpgముఖ్యంగా విశాఖ కేంద్రంగా భూ క‌బ్జాలు మాత్రం అధికార పార్టీ బాగానే చేసింద‌న్న ఆరోప‌ణ‌లు మాత్రం ఉన్నాయి. వీటికి త‌గ్గ ఆధారాలు కూడా కొన్ని విప‌క్ష పార్టీల ద‌గ్గ‌ర ఉన్నాయి. అయితే రాజకీయంలో భాగంగా అవి బాహాటంగా మాట్లాడ‌లేక‌పోతున్నా యి. ముఖ్యంగా రిషికొండ త‌దిత‌ర ప్రాంతాల చుట్టూ రిసార్టుల నిర్మాణం పేరిట పెద్ద భూ పందేర‌మే న‌డిచింది. ఇదే కాదు చాలా చోట్ల వైసీపీ పెద్ద‌లు త‌మ హ‌వాను న‌డిపించి స‌క్సెస్ అయ్యారు కూడా. కార్పొరేట్ శ‌క్తుల క‌నుస‌న్న‌ల్లో విశాఖ న‌డుస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇదే నేప‌థ్యంలో ycp{#}kishore;Corporate;Vishakapatnam;Party;YCPవైసీపీ క్యాపిటల్ : విశాఖ కలలు కల్లలేనా జగన్ ?వైసీపీ క్యాపిటల్ : విశాఖ కలలు కల్లలేనా జగన్ ?ycp{#}kishore;Corporate;Vishakapatnam;Party;YCPMon, 08 Nov 2021 22:23:35 GMTవిశాఖ‌లో విలువ‌యిన ఆస్తుల‌ను అమ్ముకునేందుకు, ఖ‌రీద‌యిన ప్రాంతాల‌లో ఉన్న ఆస్తుల‌ను బ్యాంకులో తాక‌ట్టు పెట్టేందుకు మాత్రం ఈ ప్రాంతం చాలా బాగా జ‌గ‌న్ కు ఉప‌యోగ‌పడింది. అంతే త‌ప్ప వీళ్లంతా చెప్పిన విధంగా యావ‌త్ ఆంధ్రావ‌నికే త‌ల‌మానికంగా నిలిచే ఈ న‌గ‌రానికి చేసింది ఏం లేదు.


ఆంధ్రావ‌నిలో వింత రాజ‌కీయాలు అన్నీ న‌డుస్తున్నాయి. ముందుగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఒప్పుకుని త‌రువాత అధికారం పొంద‌గానే మాట మార్చ‌గ‌ల నేర్ప‌రిత‌నం వైసీపీకే ఉంది. మూడు రాజ‌ధానుల పేరిట పెద్ద డ్రామానే న‌డిపిన వైసీపీ ఆర్థిక రాజ‌ధాని విశాఖ‌ను ఏ పాటి అభివృద్ధి చేయ‌నుందో మ‌రి అని ఆస‌క్తిగా ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. దీనిని వాళ్లు ప‌రిపాల‌న రాజ‌ధాని అని వ్య‌వ‌హ‌రించినా మ‌రో పేరు పెట్టి సంబ‌ర‌ప‌డిపోయినా ఇప్ప‌టిదాకా ఇక్క‌డి అభివృద్ధి రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు సున్నా. విశాఖ‌ను అనూహ్య రీతిలో మార్చేస్తామ‌ని ప్ర‌సంగాల్లో ఊద‌ర‌గొట్టే గౌర‌వ ముఖ్య‌మంత్రికి ఇప్పుడు నిధుల స‌మ‌స్య అన్న‌ది వెన్నాడుతోంది. ఆశించిన స్థాయిలో మిగ‌తా రంగాల అభివృద్ధి లేక‌పోవ‌డం, విభిన్న రంగాల నుంచి విభిన్న దారుల‌లో రావాల్సిన ఆదాయం లేక‌పోవ‌డంతో ఆస్తుల త‌న‌ఖా మిన‌హా విశాఖ‌కు ఆయ‌న చేసిందేమీ లేదు.

ముఖ్యంగా విశాఖ కేంద్రంగా భూ క‌బ్జాలు మాత్రం అధికార పార్టీ బాగానే చేసింద‌న్న ఆరోప‌ణ‌లు మాత్రం ఉన్నాయి. వీటికి త‌గ్గ ఆధారాలు కూడా కొన్ని విప‌క్ష పార్టీల ద‌గ్గ‌ర ఉన్నాయి. అయితే రాజకీయంలో భాగంగా అవి  బాహాటంగా మాట్లాడ‌లేక‌పోతున్నా యి. ముఖ్యంగా రిషికొండ త‌దిత‌ర ప్రాంతాల చుట్టూ రిసార్టుల నిర్మాణం పేరిట పెద్ద భూ పందేర‌మే న‌డిచింది. ఇదే కాదు చాలా చోట్ల వైసీపీ పెద్ద‌లు త‌మ హ‌వాను న‌డిపించి స‌క్సెస్ అయ్యారు కూడా. కార్పొరేట్ శ‌క్తుల క‌నుస‌న్న‌ల్లో విశాఖ న‌డుస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇదే నేప‌థ్యంలో వ‌రుణ్ సంస్థ‌ల అధినేత ప్ర‌భు కిశోర్ ఓ  ఖ‌రీద‌యిన  హోట‌ల్ నిర్మాణానికి కూడా సుముఖ‌త వ్య‌క్తం చేసి అందుకు త‌గ్గ అనుమ‌తులు కూడా పొందారు. ఇప్పుడొచ్చిన స‌మ‌స్యేంటంటే వీళ్లంతా నిర్మాణాల పేరిట ఇష్టారాజ్యంగా  మ‌ట్టి త‌వ్వ‌కాలు సాగిస్తూ ఇష్ట‌మొచ్చిన చోటుకు త‌ర‌లించి కాసులు పిండుకుంటున్నారు. కానీ వీళ్లెవ్వ‌రూ నేష‌న‌ల్  గ్రీన్ కోర్ ఆదేశాల‌ను మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. సుంద‌ర విశాఖ నిర్మాణంలో వీరంతా భాగం అవుతున్నామ‌న్న
ఆనందంతో ఇలాంటి ప‌నులకు ఎలా పూనుకుంటారో మ‌రి!



లారీ ఓనర్ల డిమాండ్ లో అంత ఆంతర్యముందా..?

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>