PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-23e04df3-a961-4011-bce1-1a58a7992a5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-23e04df3-a961-4011-bce1-1a58a7992a5b-415x250-IndiaHerald.jpgఎన్నిక‌లకు ఇంకా చాలా కాలం దూరం ఉంది. ఆ దూరాన్ని ద‌గ్గ‌ర చేసే ప్ర‌య‌త్న‌మేదీ కేసీఆర్ చేయ‌కున్నా, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌నో, ప్ర‌తిపాద‌నో చేయ‌కున్నా కేసీఆర్ మాత్రం కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. ఎప్ప‌టిలానే ఇష్టం వ‌చ్చిన విధం గా తిట్ట‌కుండా చాలా ఆచి తూచి తిట్టారు. త‌న‌ను అన్న‌వారిని కొన్ని చ‌ట్టాల‌ను ఉద్దేశించి మాట్లాడిన వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత ఆయన మీడియా ముందుకు వ‌చ్చిన చేసిన వ్యాఖ్య‌లు కార‌ణంగా బీజేపీ పూర్తిగా పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయిtrs {#}Allu Aravind;MP;Scheduled caste;Huzurabad;Bharatiya Janata Party;KCR;Telangana;media;Ishtamకేసీఆర్ టాక్స్ : నిధులియ్యకుంటే నోరెందుకు మెదపలే ?కేసీఆర్ టాక్స్ : నిధులియ్యకుంటే నోరెందుకు మెదపలే ?trs {#}Allu Aravind;MP;Scheduled caste;Huzurabad;Bharatiya Janata Party;KCR;Telangana;media;IshtamMon, 08 Nov 2021 11:28:13 GMT
బీజేపీతో త‌గువేసుకుంటున్నాడు కేసీఆర్. కేంద్రంకు తెలంగాణ కు మ‌ధ్య ఉన్న ద‌గ్గ‌ర సంబంధాలు అన్నీ చెరిపేసేలా మాట్లాడుతున్నాడు కేసీఆర్. కేంద్రం నిధుల విష‌య‌మై రాష్ట్రాల‌కు అన్యాయం చేసింద‌నే చెబుతున్నాడు. ఫెడ‌రల్ స్ఫూర్తికి విరుద్ధంగా న‌డుచుకుంటున్న మోడీ న‌ల్ల చ‌ట్టాల‌కు అండ‌గా ఉంటున్నారే త‌ప్ప పేద‌ల‌కు చేసిందేం లేద‌ని తేల్చేశారు.


ఎన్నిక‌లకు ఇంకా చాలా కాలం దూరం ఉంది. ఆ దూరాన్ని ద‌గ్గ‌ర చేసే ప్ర‌య‌త్న‌మేదీ కేసీఆర్ చేయ‌కున్నా, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే  ఆలోచ‌నో, ప్ర‌తిపాద‌నో చేయ‌కున్నా కేసీఆర్ మాత్రం కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. ఎప్ప‌టిలానే ఇష్టం వ‌చ్చిన విధం గా తిట్ట‌కుండా చాలా ఆచి తూచి తిట్టారు. త‌న‌ను అన్న‌వారిని కొన్ని చ‌ట్టాల‌ను ఉద్దేశించి మాట్లాడిన వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత ఆయన మీడియా ముందుకు వ‌చ్చిన చేసిన వ్యాఖ్య‌లు కార‌ణంగా బీజేపీ పూర్తిగా పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది. అప్పుడే బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్ వ‌చ్చి మాట్లాడారు. త‌న‌దైన వివ‌ర‌ణ ఒక‌టి ఇచ్చారు. ఇదే సంద‌ర్భంలో ఆ ఎంపీ స్థాయి మ‌రిచి కేసీఆర్ ను కొన్ని తిట్లు తిట్టారు. తాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌లేద‌ని, ద‌ళితులంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని అన్నారు. ఇక కేసీఆర్ బీజేపీని ప్ర‌ధానంగా టార్గెట్ చేసిన వాటిలో నిధులు విష‌యం ఒక‌టి ప్ర‌ధానంగా తెర‌పైకి వ‌చ్చింది.

ఏడేళ్ల‌లో కేంద్రం త‌మ‌కు 45వేల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఇచ్చింద‌ని, కేంద్రం నుంచి న‌రేగా, నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ స్కీం, స‌ర్వ‌శిక్ష అభియాన్ కు సంబంధించిన నిధులు త‌ప్ప ఇంకేం రాలేద‌ని, దేశంలో అత్యున్నత స్థాయిలో ఆదాయం  కేంద్రానికి అందిస్తున్న రాష్ట్రం తెలంగాణానే అని, ఈ విష‌యం ఆర్బీఐ  కూడా అంగీక‌రించింద‌ని అన్నారు. ఇక విభ‌జ‌న చ‌ట్టంకు సంబంధించిన మాట‌లు కూడా  కేసీఆర్ వినిపించారు. ఈ విష‌య‌మై త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై గొంతు వినిపించారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా 450కోట్లు కేటాయించాల్సి ఉన్నా ఇప్ప‌టికీ ఆ ఊసే లేద‌ని వాపోయారు. ఇవ‌న్నీ బీజేపీ చేసిన త‌ప్పిదాలే అని, వీటిపై తాను ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూనే ఉంటాన‌ని అన్నారు. అయితే నిధుల విష‌య‌మై ఇంత‌కాలం మాట్లాడ‌ని కేసీఆర్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నార‌ని? కేంద్రంతో క‌య్యం పెట్టుకుని ఏం సాధిస్తార‌ని?



పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే ను లాక్ చేసిన హరీష్ శంకర్..!

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?

కేసీఆర్ నయా టార్గెట్ బీజేపీ...!

కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>