MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anukshanam-bandhala-viluva-thelipe-prathiroju-pandaged079396e-418e-4075-aabd-7864ba7ffa5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anukshanam-bandhala-viluva-thelipe-prathiroju-pandaged079396e-418e-4075-aabd-7864ba7ffa5a-415x250-IndiaHerald.jpgమారుతి డైరెక్షన్ లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ ఆధ్వర్యంలో నిర్మించబడ్డ చిత్రం ప్రతి రోజు పండగే. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. TOLLYWOOD-FAMILY-MOVIES{#}Father;Success;Hero;Audience;Chitram;Cinemaఅనుక్షణం బంధాల విలువ తెలిపే "ప్రతి రోజు పండుగే"అనుక్షణం బంధాల విలువ తెలిపే "ప్రతి రోజు పండుగే"TOLLYWOOD-FAMILY-MOVIES{#}Father;Success;Hero;Audience;Chitram;CinemaMon, 08 Nov 2021 16:00:00 GMTమారుతి డైరెక్షన్ లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ ఆధ్వర్యంలో నిర్మించబడ్డ చిత్రం ప్రతి రోజు పండగే. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. సినిమా టైటిల్ వినగానే ఈ మూవీ కుటుంబ తరహా నేపథ్యంలో రానుందని మెగా ఫ్యాన్స్ ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే ఫ్యామిలీ ఆడియన్స్ మనసును టచ్ చేసే చిత్రంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. నేడు ఫాస్ట్ జనరేషన్ లో అందరూ ఆర్థికంగా ఎదగడం కోసం చూస్తున్నారే తప్ప, డబ్బుకు ఇచ్చిన విలువను చాలా మంది మనుషులకు కూడా వారి సమయాన్ని కాస్త కూడా కేటాయించలేకపోతున్నారు.

కాలంతో పరుగులు తీసి జీవితంలో అసలు వారేమీ కోల్పోతున్నారో గుర్తించడం లేదు. కానీ ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి ప్రశాంతంగా..అసలు జీవితం అంటే ఎంటి?? అని ఆలోచిస్తే మన కుటుంబం, మన బంధాల విలువ కాస్తైనా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ఇదే తరహాలో బంధాలు, బాధ్యతలు నడుమ అల్లుకుని ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా అలరించింది. ఇక ఈ సినిమాలో తాత మనవల్ల సెంటిమెంట్ అయితే సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. అలాగే కుటుంబం మొత్తాన్ని ఒకటి చేయడం కోసం, తిరిగి వారిలోని ప్రేమను, ఆప్యాయతలను బయటకు తీసుకురావడం కోసం హీరో చేసిన ప్రయత్నాలు బాగా ఆకట్టుకున్నాయి.  

కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నది.  ఇక కథ మొత్తం...  సత్యరాజ్‌ మీదే నడుస్తుంది. చావు అంచుల మధ్య ఉన్న తన పట్ల తన కుటుంబ సభ్యులు చూపే అనుచిత ప్రవర్తన అలాగే ఎప్పుడెప్పుడు అక్కడి నుండి వెళ్లిపోదామా అని వారు చేసే ప్రయత్నాలు చూసి ఒక తండ్రి  ఎంత  మానసిక క్షోభను అనుభవిస్తాడు, ఆ సమయంలో మనవడు ( సాయి ధరమ్ తేజ్) ఎలా అందరినీ ఒక్కటి చేస్తాడు అన్నది కథకు స్ట్రాంగ్ పాయింట్ అయింది. పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి బాగా నటించారు. ప్రస్తుత జనరేషన్ కి ఈ సినిమా దగ్గరగా ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యింది. అందరూ ఇలాగే ఉన్నారు అని చెప్పలేం కానీ యువతకు ఈ మూవీ  మంచి మెసేజ్ ఇచ్చిందనే చెప్పాలి.



లో బడ్జెట్ ఫ్యామిలీ చిత్రం ఇది

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"నువ్వు మీ నాన్నను మించిపోతావు రా".. బన్నీ కొడుకు దేశముద్దురే..!!

సోష‌ల్ వార్ : దాక్కో దాక్కో కేసీఆర్ ?

కేంద్రానికి వైసీపీ ఎంపీ సపోర్ట్...?

పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ విధించ‌లేదా..? బండి సంజ‌య్

కెసిఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>