PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amaravathi-yatrabc8f35fb-9e41-44c2-ac28-278cf49e2a7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amaravathi-yatrabc8f35fb-9e41-44c2-ac28-278cf49e2a7a-415x250-IndiaHerald.jpgన్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాద యాత్ర జనసందోహం మధ్య కొనసాగుతోంది. మొదట్లో ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, హైకోర్టు ఆదేశాలు ఊరటనివ్వడంతో రైతులు యాత్ర చేపట్టగా పోలీసులు కొన్ని షరతులు విధించారు. కేవలం యాత్రకు 157మందిని మాత్రమే అనుమతించారు. కానీ వాస్తవంగా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలపడం, ప్రతిపక్షాలు కూడా సంఘీభావం తెలపడంతో ర్యాలీల్లో భారీగా జనం పాల్గొంటున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు యాత్ర నిర్వాహకులకు నోటీసులందించారు. amaravathi yatra{#}Amaravati;High court;police;local language;YCP;Yatra;Partyఅమరావతి యాత్రతో పోలీసులకు తిప్పలుఅమరావతి యాత్రతో పోలీసులకు తిప్పలుamaravathi yatra{#}Amaravati;High court;police;local language;YCP;Yatra;PartySun, 07 Nov 2021 06:57:36 GMTన్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాద యాత్ర జనసందోహం మధ్య కొనసాగుతోంది. మొదట్లో ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, హైకోర్టు ఆదేశాలు ఊరటనివ్వడంతో రైతులు యాత్ర చేపట్టగా పోలీసులు కొన్ని షరతులు విధించారు. కేవలం యాత్రకు 157మందిని మాత్రమే అనుమతించారు. కానీ వాస్తవంగా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలపడం, ప్రతిపక్షాలు కూడా సంఘీభావం తెలపడంతో ర్యాలీల్లో భారీగా జనం పాల్గొంటున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు యాత్ర నిర్వాహకులకు నోటీసులందించారు.

వాస్తవానికి వివిధ జిల్లాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలకు అధికార పార్టీ నాయకులతో సహా చాలామంది భారీ ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. వీటిని పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. అయితే అమరావతి యాత్ర విషయంలో మాత్రం కొవిడ్ నిబంధనల పేరుతో నోటీసులివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతిచ్చినవారికంటే ఎక్కువమంది యాత్రకు రావడం పోలీసు ఆంక్షల్ని మీరడమే అయినా.. యాత్రకు ఇంత భారీ మద్దతు వస్తుందని తాము కూడా ఊహించలేదంటున్నారు రైతు నేతలు. మద్దతుగా వస్తున్నవారిని అదుపు చేయడం తమ చేతుల్లో లేదని చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం యాత్ర విషయంలో టెన్షన్ పడుతున్నారు. యాత్ర సక్సెస్ అనే పేరు వస్తే.. కచ్చితంగా అధికార పార్టీకి అది ఇబ్బందికర పరిణామమే. మరోవైపు నోటీసులిస్తే అమరావతి రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ దశలో పోలీసులు నలిగిపోతున్నారు.

వైసీపీ నేతల ర్యాలీలకు అడ్డురాని కొవిడ్ నిబంధనలు, అమరావతి రైతుల యాత్రకు అడ్డొచ్చాయా అని ప్రశ్నించారు నారా లోకేష్. ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల నోటీసులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. నోటీసులకు వారం రోజుల్లోగా వివరణ ఇస్తామని రైతులు చెబుతుండగా.. కళాకారులు వినియోగిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం విశేషం. మొత్తమ్మీద అమరావతి రైతుల యాత్ర మధ్యలోనే సంచలనానికి వేదికగా మారింది.



ఇక చంద్రబాబుకు జాకీలు వేయడం కష్టమేనా..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>