PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----------e7418a88-cfcb-4329-91f3-7b7e3f9595a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----------e7418a88-cfcb-4329-91f3-7b7e3f9595a2-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రైతుల‌కు ఉద‌యం వేళ‌లో 9 గంట‌ల పాటు విద్యుత్‌ను వ‌చ్చే 25 ఏండ్ల పాటు ఇవ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ సెకితో ఒప్పందానికి నిర్ణ‌యించాము అని రాష్ట్ర ఇంధ‌న‌శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ‌కాంత్ నాగుల‌ప‌ల్లి వెల్ల‌డించారు. వ‌చ్చే రెండున్న‌ర ద‌శాబ్దాల్లో ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఢోకా లేద‌న్నారు. విజ‌య‌వాడ ఆర్ అండ్ బీ భ‌వ‌నంలో విద్యుత్ ప‌రిస్థితిపై మీడియా స‌మావేశంతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయానికి అందించే విద్యుత్ ఒక యూనిట్ ప్ర‌స్తుతం స‌గ‌టున రూ.4.36 కొనుగోలు చేసి రైతుల‌కు ఉచి#రైతులకు ఉచిత విద్యుత్{#}Adah Sharma;srikanth;contract;electricity;media;central government;Governmentరైతులకు ఉచిత విద్యుత్ కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!#రైతులకు ఉచిత విద్యుత్{#}Adah Sharma;srikanth;contract;electricity;media;central government;GovernmentSun, 07 Nov 2021 22:29:10 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రైతుల‌కు  ఉద‌యం వేళ‌లో 9 గంట‌ల పాటు విద్యుత్‌ను వ‌చ్చే 25 ఏండ్ల పాటు ఇవ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ సెకితో ఒప్పందానికి నిర్ణ‌యించాము అని రాష్ట్ర ఇంధ‌న‌శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ‌కాంత్ నాగుల‌ప‌ల్లి  వెల్ల‌డించారు. వ‌చ్చే రెండున్న‌ర ద‌శాబ్దాల్లో ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఢోకా లేద‌న్నారు. విజ‌య‌వాడ ఆర్ అండ్ బీ భ‌వ‌నంలో విద్యుత్ ప‌రిస్థితిపై మీడియా స‌మావేశంతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయానికి అందించే విద్యుత్ ఒక యూనిట్ ప్ర‌స్తుతం స‌గ‌టున రూ.4.36 కొనుగోలు చేసి రైతుల‌కు ఉచితంగా అందిస్తుట్టు వెల్ల‌డించారు.  

సెకీ ఒప్పందంతో రూ.2.49 కి వ‌స్తుంద‌ని, యూనిట్ మీద దాదాపు రూ.1.87 ఆదా అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు శ్రీ‌కాంత్‌. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను క‌లుపుకొని వ్య‌వసాయానికి ప‌గ‌టిపూట 9 గంట‌ల పాటు విద్యుత్‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నాం అని చెప్పారు. ప్ర‌భుత్వం గ్రీన్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ద్వారా పిలిచిన టెండ‌ర్ల‌లో మినిమం బిడ్ యూనిట్ రూ.2.49కు కోట్ అయిన‌ట్టు శ్రీ‌కాంత్ వెల్ల‌డించారు.
త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం గ‌త సెప్టెంబ‌ర్‌లోనే సెకి నుంచి యూనిట్ రూ.2.61 కి సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేసిన‌ద‌ని. అంత‌కంటే త‌క్కువ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కొనుగోలు చేయ‌డానికి సెకీ అంగీక‌రించింద‌ని స్ప‌ష్టం చేశారు. డిస్కంల‌పై ప‌డే నెట్‌వ‌ర్క్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని వివ‌రించారు.


విద్యుత్ కొనుగోలు అంశం ముందుగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకొని.. ఆ త‌రువాత ఈఆర్‌సీ ప్ర‌తిపాదిస్తుంద‌ని పేర్కొన్నారు. 2014 నుంచి పీపీఏ ఒప్పందాల‌లో ఛేంజ్ ఆఫ్ లా ప్ర‌కారం విద్యుత్ ఉత్ప‌త్తి ప్రాజెక్టుల మీద ప‌న్నులు పెరిగినా, త‌గ్గినా కొనుగోలు దారుడే భ‌రిస్తార‌ని, ప్ర‌స్తుతం అన్ని టెండ‌ర్ల‌లో ఈ నిబంధ‌న అమ‌లులో ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు శ్రీ‌కాంత్‌.  రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే రూ. 2వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రభుత్వం  ఎవాక్యులేషన్‌ లైన్లు వేయాల్సి ఉంటుందని శ్రీకాంత్ వివ‌రించారు.అదేవిధంగా బయట ప్రాజెక్టు నుంచి కొనుగోలు చేయ‌డం ద్వారా రాష్ట్రం చేసే ఎవాక్యులేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఖర్చు కూడా సెకీతో ఒప్పందం కారణంగా మిగులుతుందన్నారు.  దాదాపు రూ.2,260 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసుకోవ‌చ్చ‌ని శ్రీకాంత్ వెల్ల‌డించారు.





నాని దసరా సినిమాలో రొమాన్స్ కు చోటే లేదట...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>